Nagarjuna Wraps Up His Work For Ahishor Solomon And Matinee Entertainment’s ‘Wild Dog’
‘వైల్డ్ డాగ్’లో తన పార్ట్ షూటింగ్ పూర్తి చేసిన కింగ్ నాగార్జున
అక్కినేని నాగార్జున టైటిల్ రోల్ పోషిస్తోన్న చిత్రం ‘వైల్డ్ డాగ్’. ఇది మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై నిర్మాణమవుతోన్న 6వ చిత్రం. అహిషోర్ సాల్మన్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో తన పోర్షన్‌ను పూర్తి చేసిన నాగార్జున మనాలి నుంచి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. తన టాలెంటెడ్ టీమ్‌కు, హిమాలయాలకు వీడ్కోలు చెప్పడానికి బాధ కలుగుతోందని ఆయన అన్నారు.
శుక్రవారం తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ‘వైల్డ్ డాగ్’ షూటింగ్ సెట్లో తోటి నటులతో తీసిన పిక్చర్లతో పాటు మనాలి అందాలను తెలియజేసే ఓ పిక్చర్‌ను కూడా నాగార్జున షేర్ చేశారు. దాంతో పాటు “వైల్డ్ డాగ్లో నా వర్క్ పూర్తిచేసి ఇంటికి బయలుదేరుతున్నా! నా టాలెంటెడ్ టీమ్‌కు, హిమాలయాలకు వీడ్కోలు చెబుతుంటే బాధగా అనిపిస్తోంది” అని రాసుకొచ్చారు నాగ్. దానికి #manali అనే హ్యాష్‌ట్యాగ్‌ను జోడించారు.
కాగా, మిగతా షూటింగ్‌ను సినిమా టీమ్ కొనసాగించనున్నది. అక్కడ చిత్రీకరణ పూర్తిచేసుకొని, హైదరాబాద్‌కు వచ్చి పోస్ట్ ప్రొడక్షన్ పనులను మొదలు పెట్టనున్నారు.
యథార్థ ఘటనల ఆధారంగా రూపొందుతోన్న ఈ చిత్రంలో ఏసీపీ విజయ్ వర్మగా నాగార్జున ఇప్పటివరకూ చేయని విభిన్న తరహా పాత్రను చేస్తున్నారు. క్రిమినల్స్‌ను నిర్దాక్షిణంగా డీల్ చేసే విధానం వల్ల సినిమాలో ఆయనను ‘వైల్డ్ డాగ్’ అని పిలుస్తుంటారు.
నాగార్జున జోడీగా దియా మీర్జా నటిస్తున్న ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో సయామీ ఖేర్ కనిపించనున్నారు.
మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కిరణ్ కుమార్ సంభాషణలు రాస్తుండగా, షానీల్ డియో సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.
సాంకేతిక బృందం:
రచన-దర్శకత్వం: అహిషోర్ సాల్మన్
నిర్మాతలు: నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి
సహ నిర్మాతలు: ఎన్.ఎం. పాషా, జగన్మోహన్ వంచా
సినిమాటోగ్రఫీ: షానీల్ డియో
యాక్షన్ డైరెక్టర్: డేవిడ్ ఇస్మలోన్
డైలాగ్స్: కిరణ్ కుమార్
ఎడిటింగ్: శ్రావణ్ కటికనేని
ఆర్ట్: మురళి ఎస్.వి.
స్టంట్ కో-ఆర్డినేటర్: జాషువా
పీఆర్వో: వంశీ-శేఖర్
Matinee Entertainment’s 6th project ‘Wild Dog’, starring Akkineni Nagarjuna in the main lead is directed by Ahishor Solomon. Nagarjuna has wrapped up his work for the film and is heading back to home from Manali. Calling them the talented team, Nagarjuna says he is feeling sad to say goodbye to them.
“Heading home after wrapping up my work for #WildDog !!feeling sad as I say good bye to my talented team and the Himalayas!! #manali @MatineeEnt @SaiyamiKher @ActorAliReza @onelifeitiz @mayankparakh19 @bilal06858696 ,” posted Nagarjuna on his Twitter page.
The team, however, will continue the shoot and wrap up the complete shoot before heading back to Hyderabad and start post production.
Reportedly based on true incidents, the film sees Nagarjuna essaying a different character as ACP Vijay Varma who is given the nickname of Wild Dog for his character streak of dealing with criminals severely.
Dia Mirza is the leading lady, while Saiyami Kher will be seen in a crucial role.
This production venture of Matinee headed by Niranjan Reddy and Anvesh Reddy has cinematography by Shaneil Deo, action by David Ismalone and Sham Kaushal, co-produced by N M Pasha and Jagan Mohan Vancha.
The following are the credits:
Writer – Director: Ahishor Solomon
Producers: Niranjan Reddy, Anvesh Reddy
Co-Producers: N M Pasha, Jagan Mohan Vancha
DOP: Shaneil Deo
Action Director: David Ismalone & Sham Kaushal
Dialogues: Kiran Kumar
Editor: Shravan Katikaneni
Art Director: Murali SV
VFX Supervisor: Yugandhar T
Costume Designer: Ashwanth Byri
Stunt Coordinator: Jashuva
PRO: Vamsi-Shekar
Publicity Designers: Anil&Bhanu