Naa Peru Raju Movie Logo And Teaser Launch
`నా పేరు రాజా` లోగో అండ్ టీజర్ లాంచ్!!
అమోఘ్ ఎంటర్ ప్రైజెస్ పతాకంపై రాజ్ సూరియన్ హీరోగా ఆకర్షిక, నస్రీన్ హీరోయిన్స్ గా అశ్విన్ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం `నా పేరు రాజా`. రాజ్ సూరియన్, ప్రభాకర్ రెడ్డి, కిరణ్ రెడ్డి నిర్మాతలు. తెలుగు, కన్నడ రెండు భాషల్లో రూపొందుతోన్న ఈ చిత్రం లోగో మరియు టీజర్ లాంచ్ కార్యక్రమం ఈ రోజు ఫిలించాంబర్ లో జరిగింది. ఈ సందర్బంగా హీరో రాజ్ సూరియన్ మాట్లాడుతూ…“నేను హీరోగా తిరుగుబోతు, జటాయువు సినిమాలు చేసాను. `నా పేరు రాజా` నా మూడో సినిమా. ఇది తెలుగు, కన్నడ రెండు భాషల్లో రూపొందిస్తున్నాం. దర్శకుడు అశ్విన్ అద్బుతమైన కథతో ఈ సినిమాను తెరకెక్కించాడు. షూటింగ్ పూర్తైంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. రెండు నెలల్లో సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం“ అన్నారు.
నిర్మాత కిరణ్ రెడ్డి మాట్లాడుతూ…“ నిర్మాతగా ఇది నా మూడో సినిమా. ఇప్పటిటికే షూటింగ్ పూర్తైంది. మనాలి, హైదరాబాద్, కేరళ లో షూటింగ్ పూర్తి చేసాం. ఇందులో లవ్, కామెడీ, యాక్షన్ ఇలా ఆడియన్స్ కు కావాల్సిన అంశాలన్నీ మెండుగా ఉన్నాయి. రెండు నెలల్లో సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం“ అన్నారు.
సినిమాటోగ్రాఫర్ వెంకట్ మాట్లాడుతూ…“డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమాను డైరక్టర్ ప్రతి సీన్ అద్బుతంగా తీసాడు. నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా అన్ని విధాల సహకరించారు“ అన్నారు.
హీరోయిన్స్ మాట్లాడుతూ…“ ఒక మంచి సినిమాలో పార్ట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉందన్నారు.
దర్శకుడు అశ్విన్ కృష్ణ మాట్లాడుతూ…“డైరక్టర్ గా ఇది నా తొలి సినిమా. ఉపేంద్ర , మురళీమోహన్ గార్ల వంటి పెద్ద డైరక్టర్స్ వద్ద నేను దర్శకత్వ శాఖలో గత 20 ఏళ్లుగా పని చేస్తున్నా. ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్. హీరో క్యారక్టర్ లో త్రీ షేడ్స్ ఉంటాయి. అవి ఏంటనేవి స్క్రీన్ పైనే చూడాలి. అలాగే ఇద్దరు హీరోయిన్స్ పాత్రలు కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. తెలుగు, కన్నడలో రూపొందుతోన్న బైలింగ్వల్ ఫిలిం ఇది. లవ్, ఎమోషన్, కామెడీ, యాక్షన్ ఇలా అన్ని రకాల కమర్షియల్ అంశాలతో ఈ సినిమాను తెరకెక్కించాం“ అన్నారు.
ఈ చిత్రానికి సంగీతంః ఎల్విన్ జాషువా, సినిమాటోగ్రాఫర్ః ఎ.వెంకట్; ఎడిటర్ః వెంకీ యుడివి; ఫైట్స్ః థ్రిల్లర్ మంజు, మాస్ మాద; కొరియోగ్రాఫర్ః నగేష్.వి; లిరిక్స్ః శ్రీమణి, సాహితి, అర్మాన్; నిర్మాతలుః రాజ్ సూరియన్, కిరణ్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి; రచన-దర్శకత్వంః అశ్విన్ కృష్ణ.