మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇంటర్వ్యూ !!
‘‘వకీల్ సాబ్’’ కు పనిచేయడం డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్ : మ్యూజిక్ డైరెక్టర్ తమన్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘‘వకీల్ సాబ్’’ మూవీ ఏప్రిల్ 9న
ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్
మీడియాతో మాట్లాడారు.
‘‘మ్యూజికల్ సక్సెస్ చాలా రేర్ గా వస్తుంది. అల వైకుంఠపురం మూవీలో అన్ని
సాంగ్స్ బాగా పాపులర్ అయ్యాయి, అందుకు ప్రధాన కారణమైన త్రివిక్రమ్, అల్లు
అర్జున్ లకు కృతజ్ఞతలు. ఆ సినిమా తరువాత ‘‘సోలో బతుకే సో బెటర్, క్రాక్
మ్యూజికల్ హిట్స్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ గారికి జనసేన సాంగ్స్ చేశాను
అప్పటినుండి కళ్యాణ్ గారితో అనుబంధం ఏర్పడింది. ‘‘గబ్బర్ సింగ్’’ సినిమా
నేను మిస్ అయ్యాను. ఇప్పుడు వకీల్ సాబ్ తో సెట్ అయింది. త్రివిక్రమ్ గారు
నన్ను దిల్ రాజు గారికి పరిచయం చెయ్యడంతో నేను వకీల్ సాబ్ కు మ్యూజిక్
చేసే అవకాశం లభించింది.లాక్ డౌన్ కారణంగా వకీల్ సాబ్ లేట్ అయ్యింది. లేట్
అయినా సరే మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాము. డైరెక్టర్
శ్రీరామ్ వేణు కథ చెప్పగానే ‘‘మగువ మగువ’’ ట్యూన్ చేశాను. ఈ సినిమాకు
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇంకా హైలెట్ అవుతుంది. కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్
అవ్వకుండా దిల్ రాజు గారు, శ్రీరామ్ వేణు గారు ఈ సినిమాను డ్రైవ్ చేశారు.
వకీల్ సాబ్ లో సాంగ్స్ చాలా సందర్భానుసారం వస్తాయి.’’
‘‘మగువ మగువ సాంగ్ కు అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఎక్కడికి వెళ్లినా ఈ
సాంగ్ వినిపిస్తుంది. మా మదర్ ఈ సాంగ్ కు బాగా కనెక్ట్ అయ్యారు. చిరంజీవి
గారు కూడా ఈ సాంగ్ ను వాళ్ళ మదర్ తో షేర్ చేసుకోవడం మాకు సంతోషాన్ని
కలిగించింది. పవన్ కళ్యాణ్ గారితో ఒక సినిమా చేస్తే చాలు అనుకున్నాను
కానీ ఇప్పుడు ఆయనతో ఇంకో సినిమా చెయ్యబోతున్నాను. సాగర్ చంద్ర
దర్శకత్వంలో అయ్యప్పన్ కోషియం రీమేక్ చేస్తున్నాను.సత్యమేవ జయతే సాంగ్
వినిపించినప్పుడు పవన్ కళ్యాణ్ గారు బాగా ఎక్సయిట్ అయ్యారు. మగువ మగువ
సాంగ్ కూడా ఆయనకు బాగా నచ్చింది. కళ్యాణ్ గారితో శృతిహాసన్ కెమిస్ట్రీ
కంటిపాప సాంగ్ బాగుంటుంది. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ నాని టక్ జగదీష్,
బాలయ్య -బోయపాటి శ్రీను సినిమా రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. చిరంజీవి గారి
లూసిఫర్ రీమేక్ చేస్తున్నాను, పవన్ కళ్యాణ్ అయ్యప్పన్ కోసియం, మహేష్ బాబు
‘‘సర్కారువారి పాట’’ చేస్తున్నాను’’ అంటూ ముగించారు.