Murder movie press meet

Murder movie press meet

కబడ్ధార్ ఈ నెల 24 న వస్తున్న రాంగోపాల్ వర్మ ఫిల్మ్ “మర్డర్”

 అనురాగ్ కంచర్ల సమర్పణలో నట్టిస్ ఎంటర్ టైన్మెంట్ పతాకంపై ఆనంద్ చంద్ర దర్శకత్వంలో నట్టి కరుణ,నట్టి క్రాంతి లు నిర్మిస్తున్న రాంగోపాల్ వర్మ కుటుంబ కథా చిత్రం మర్డర్..డిసెంబర్ 24 న థియేటర్స్ లలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ లోని జయభేరి క్లబ్ లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు..…

 రాంగోపాల్ వర్మ వీడియో బైట్ ద్వారా మాట్లాడుతూ…. ఈ రాంగోపాల్ వర్మ “మర్డర్” సినిమా ఎన్నో నిజ  జీవితాలపై తీసిన యదార్థ కథ.ఈ సినిమా అన్ని అడ్డంకులు పూర్తి చేసుకొని ఈ నెల 24న విడుదల చేస్తున్నాం.కాబట్టి మేము 22వ తేదీన మిర్యాలగూడలో ప్రెస్ మీట్
పెడుతున్నాం.ఈ సినిమా  పిల్లలకు తల్లిదండ్రులకు జరిగే కంటిన్యూ యుద్ధం.వారి ఇష్టాలను కాదన్నపుడు చాలామందికి ఎం నష్టం జరుగుతుందనేది ఈ చిత్రం ద్వారా తెలుపుతున్నామని అన్నారు..

దర్శకుడు మాట్లాడుతూ …రాంగోపాల్ వర్మ”మర్డర్” సినిమా ఒక యదార్థ సంఘటన ఆధారంగా పూర్తి ఎమోషన్ కంటెంట్ తో తీసిన కుటుంబ కథా చిత్రం. ఇది ప్రతి తల్లిదండ్రులకు బాగా కనెక్ట్ అవుతుంది.ఈ సినిమాపై చాలామందికి రకరకాల అపోహలు ఉన్నాయి.వాటన్నిటికీ ఈ మర్డర్ సినిమా 24న సమాధానం చెబుతుంది.ఈ సినిమా ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ చిత్రాన్ని మీరందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను

 నిర్మాతలు మాట్లాడుతూ…. కొంతమంది ఈ సినిమాపై  వేసిన కేసుల అన్ని అడ్డంకులను తొలగించుకుంటూ రాంగోపాల్ వర్మ”మర్డర్” సినిమాను  ఈ నెల 24 న అన్ని థియేటర్లలో  విడుదల చేస్తున్నాము..ఇందులో మేము నిజాన్ని నిర్భయంగా చూపిస్తున్నాము.. తల్లి,తండ్రులు వారి పిల్లలపై చూపించే అతి ప్రేమ తో పాటు వారితో ఉన్న ఎక్కువ అటాచ్ మెంట్ వల్ల ఏం జరిగింది అనేదే ఈ సినిమా కథాంశం. మేము సినిమా మొదలుపెట్టి నప్పటి  నుండి మాకు కొంతమంది బెదిరింపు కాల్స్ చేసి మిర్యాలగూడ లో సినిమా విడుదల చేస్తే థియేటర్లు ధ్వంసం చేస్తామని బెదిరిస్తున్నారు. మీరు ముందు సినిమా చూసి అందులో మీ పేరు ఉంటే మాట్లాడండి.సినిమాను ఆపే హక్కు ఎవరికీ లేదు. అలాకాకుండా సినిమా ఆపేస్తామని ముందుకు వస్తే మేము యస్.పి కు  కంప్లైంట్ చేసి మీపై  కోర్టు ధిక్కరణ నోటీసు పై మీ పై చర్యలు తీసుకుంటాం.ఈ మిర్యాలగూడ మీ ఇద్దరి కుటుంబాలది కాదు.మీ బెదిరింపులకు మేం బయపడం..మీరు ధ్వంసం చేయాలనుకుంటే థియేటర్ ని కాదు.. ఆరోజు నేను రాంగోపాల్ వర్మ  థియేటర్ దగ్గర వస్తాము. మొదట నన్ను రామ్ గోపాల్ వర్మ ని చంపి ఆ తర్వాత థియేటర్ ను ద్వంసం చేయండి.మేము ఎవరినీ కించపరచడానికి ఈ చిత్రం తీయలేదు.ఈ సినిమాను మేము చట్టపరంగా విడుదల చేస్తున్నాం అని అన్నారు…

 గాయత్రి భార్గవి మాట్లాడుతూ… ఒక అమ్మాయి వారి తల్లిదండ్రులను కాదనుకొని బయటకు వెళ్తే ఎలా ఉంటుందనేది  ఈ సినిమా లో దర్శకుడు చక్కగా చూయించారు.ఇది ప్రతి యొక్క తల్లిదండ్రులకు కనెక్ట్ అయ్యే సినిమా.. ఈ కథ నచ్చి ఇందులో ఒక మంచి క్యారెక్టర్ చేస్తున్నాను. ఈ సినిమాను నేను ఫ్యామిలీతో కలిసి చూడడం జరిగింది. సినిమా చూసిన మా పిల్లలు మా వారు ఎంతో ఎమోషన్ అయ్యారు. వారిలాగే ఈ సినిమా చూసిన వారందరూ తప్పక ఎమోషన్ కు కనెక్ట్ అవుతారు.ఈ సినిమా అందరికీ తప్పక నచ్చుతుందని అన్నారు

 నటీనటులు ..
శ్రీకాంత్ అయ్యంగార్,గాయత్రీ భార్గవి,సాహితీ, గిరిధర్,దీపక్, గణేష్

 సాంకేతికవర్గం
నిర్మాతలు..నట్టి కరుణ /నట్టి క్రాంతి
దర్శకత్వం… ఆనంద్ చంద్ర
సంగీతం.. డి ఎస్ ఆర్
డిఓపి.. జగదీష్ చీకటి
ఎడిటర్ ..శ్రీకాంత్ పట్నాయక్. ఆర్
ప్రొడక్షన్ కంట్రోలర్..రామ్ మంతెన
పి ఆర్ ఓ..మధు వి ఆర్