మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప్రొడ‌క్ష‌న్ నంబ‌ర్ 9 టైటిల్ ‘అర్జున ఫ‌ల్గుణ‌’

మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప్రొడ‌క్ష‌న్ నంబ‌ర్ 9 టైటిల్ ‘అర్జున ఫ‌ల్గుణ‌’

మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప్రొడ‌క్ష‌న్ నంబ‌ర్ 9 టైటిల్ ‘అర్జున ఫ‌ల్గుణ‌’

ఒక‌వైపు ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైనర్స్‌, మ‌రోవైపు యువ ప్ర‌తిభావంతుల‌తో కంటెంట్ రిచ్ ఎంట‌ర్‌టైన‌ర్స్ నిర్మిస్తూ ప‌ర్ఫెక్ట్ స్ట్రాట‌జీతో ముందుకు వెళ్తోన్న సంస్థ మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌.

శ్రీవిష్ణు హీరోగా, ‘జోహార్’ ఫేమ్ తేజ మ‌ర్ని ద‌ర్శ‌క‌త్వంలో ఆ సంస్థ నిర్మిస్తోన్న ప్రొడ‌క్ష‌న్ నంబ‌ర్ 9కు ఆదివారం ‘అర్జున ఫ‌ల్గుణ’ అనే టైటిల్ ప్ర‌క‌టించారు. మ‌హాభార‌తంలో అర్జునునికి ఫ‌ల్గుణ అనే మ‌రో పేరు కూడా ఉంద‌ని మ‌న‌కు తెలుసు. ఫాల్గుణ మాసంలో జ‌న్మించినందున ఆయ‌నను ఆ పేరుతోనూ పిలుస్తుంటారు.

టైటిల్ పోస్ట‌ర్‌లో ఐదుగురు వ్య‌క్తులు ప‌రుగులు పెడుతుంటే, వారిని ఓ పోలీస్ జీప్ వెంటాడుతోంది. పైన వ్య‌క్తుల ముఖాలు మ‌న‌కు క‌నిపించ‌డం లేదు. కానీ వారు ప‌రుగెత్తుతుండ‌గా, ప‌క్క‌నే ఉన్న కాల‌వ‌లో వారి ప్ర‌తిబింబాలు క‌నిపిస్తున్నాయి. ఆ ప్ర‌తిబింబాలు ఎవ‌రివో వెల్ల‌డ‌వుతున్నాయి. హీరో హీరోయిన్లు, వారి ముగ్గురు ఫ్రెండ్స్.. పోలీసుల నుంచి త‌ప్పించుకోవ‌డానికి పారిపోతున్నార‌ని ఆ పోస్ట‌ర్ తెలియ‌జేస్తోంది. టైటిల్ డిజైన్‌ను రెగ్యుల‌ర్‌గా కాకుండా సంస్కృత లిపి త‌ర‌హాలో డిజైన్ చేయ‌డం గ‌మ‌నార్హం.

మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్ నుంచి వ‌స్తున్న మ‌రో ఉత్తేజ‌భ‌రిత చిత్రం ‘అర్జున ఫ‌ల్గుణ‌’. ఎప్పుడూ వైవిధ్య‌భ‌రిత‌మైన క‌థ‌ల‌నే ఎంచుకుంటూ ఉంటార‌ని పేరుపొందిన శ్రీ‌విష్ణు మ‌రో ఆస‌క్తిక‌ర కాన్సెప్ట్‌తో మ‌న ముందుకు రానున్నారు. మ‌రోవైపు, డైరెక్ట‌ర్‌గా త‌న తొలి చిత్రం ‘జోహార్‌’తో విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు పొందారు తేజ మ‌ర్ని. ఇలాంటి హీరో, డైరెక్ట‌ర్‌, ప్రొడ్యూస‌ర్ల తొలి క‌ల‌యిక 2021లో ఒక ఆస‌క్తిక‌ర చిత్రాన్ని అందించ‌నున్న‌ద‌ని క‌చ్చితంగా చెప్ప‌వ‌చ్చు.

ఇప్ప‌టివ‌ర‌కూ ‘అర్జున ఫ‌ల్గుణ‌’కు సంబంధించి 75 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది.

శ్రీ‌విష్ణు స‌ర‌స‌న నాయిక‌గా అమృతా అయ్య‌ర్ న‌టిస్తోన్న‌న ఈ చిత్రాన్ని నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఎన్‌.ఎం. పాషా స‌హ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్న ఈ మూవీకి క‌థ‌, స్క్రీన్‌ప్లేల‌ను ద‌ర్శ‌కుడు తేజ మ‌ర్ని స్వ‌యంగా స‌మ‌కూరుస్తున్నారు. సుధీర్ వ‌ర్మ పి. డైలాగ్స్ రాస్తున్నారు.

ప్రియ‌ద‌ర్శ‌న్ బాల‌సుబ్ర‌మ‌ణియ‌న్ మ్యూజిక్ అందిస్తుండ‌గా, జ‌గ‌దీష్ చీక‌టి సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.

తారాగ‌ణం:
శ్రీ‌విష్ణు, అమృతా అయ్య‌ర్‌, సీనియ‌ర్ న‌రేష్‌, శివాజీ రాజా, సుబ్బ‌రాజు, దేవీప్ర‌సాద్‌, ‘రంగ‌స్థ‌లం’ మ‌హేష్‌, రాజ్‌కుమార్ చౌద‌రి (‘రాజావారు రాణిగారు’ ఫేమ్‌), చైత‌న్య (‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ ఫేమ్‌).

సాంకేతిక బృందం:
నిర్మాత‌లు: నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్ రెడ్డి
స‌హ నిర్మాత‌: ఎన్‌.ఎమ్‌. పాషా
క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: తేజ మ‌ర్ని
డైలాగ్స్‌: సుధీర్ వ‌ర్మ పి.
సినిమాటోగ్ర‌ఫీ: జ‌గ‌దీష్ చీక‌టి
ఆర్ట్‌: గాంధీ న‌డికుడిక‌ర్‌
యాక్ష‌న్‌: రామ్ సుంక‌ర‌
మ్యూజిక్‌: ప్రియ‌ద‌ర్శ‌న్ బాల‌సుబ్ర‌మ‌ణియ‌న్‌
పాట‌లు: చైత‌న్య ప్ర‌సాద్‌
పీఆర్వో: వ‌ంశీ-శేఖ‌ర్‌.

 
MATINEE ENTERTAINMENT’s PRODUCTION NO:9 TITLED ARJUNA PHALGUNA

Matinee Entertainment is following a perfect strategy to offer pucca commercial entertainments and at the same time the popular production house is making rich content entertainers with young talent.

Matinee Entertainment has today announced title of their Production No 9 with hero Sree Vishnu and director Teja Marni of Johaar Fame, besides unveiling theme poster of the film titled Arjuna Phalguna. It is known that Arjuna is also called as Phalguna, because he was born in the month of Phalguna.

Every journey in our life makes us move forward but some journeys make our lives upside down and the same is portrayed through the mirror water reflection in the theme poster. The title Arjuna Phalguna is designed as Sanskrit letters and we can see police in patrol vehicle chasing a group of friends.

Arjuna Phalguna is going to be another intriguing film from Matinee Entertainment. Proving to be a perfect choice for distinctive subjects, Sree Vishnu picks another interesting concept. Teja Marni, on the other hand, won rave reviews for his very first film Johaar. The first collaboration of the hero, director and producers is irrefutably one of the most exciting films of 2021.

Amritha Aiyer who has become one of the most sought after actress in Tollywood is paired opposite Sree Vishnu in Arjuna Phalguna.

Niranjan Reddy and Anvesh Reddy are bankrolling the project, while N M Pasha is the co-producer. Story & screenplay for the film is by director Teja Marni himself, dialogues are provided by Sudheer Varma P.

Coming to the other technical departments, the film has music by Priyadarshan Balasubramanian and cinematography by Jagadeesh Cheekati. The film thus far has completed 75 % of its shoot.

Cast: Sree Vishnu, Amritha Aiyer, Senior Naresh, Sivaji Raja, Subba Raju, Devi Prasad, Rangasthalam Mahesh, Raj Kumar Chowdary (Raja Vaaru Rani Gaaru fame), Chaitanya (Middle class Melodies fame) and others.

Technical Crew:

Producers: Niranjan Reddy, Anvesh Reddy
Co-Producer: N M Pasha
Story, Screenplay, Direction: Teja Marni
Dialogue Writer: Sudheer Varma .P
Cinematography: Jagadeesh Cheekati
Art Director: Gandhi Nadikudikar
Action: Ram Sunkara
Music Director: Priyadarshan Balasubramanian
Lyrics: Chaitanya Prasad
Publicity Design: Anil & Bhanu
PRO: Vamsi-Sekhar
Costume Designer: Prasanna Varma Danthuluri