‘majili ‘movie success meet
నా జీవితంలో మర్చిపోలేని హిట్ ‘మజిలీ’..ఇంత పెద్ద విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు – మజిలీ విజయోత్సవ వేడుక లో అక్కినేని నాగ చైతన్య..!!
నాగ చైతన్య సమంత జంటగా నటించిన సినిమా ‘మజిలీ’.. శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా లో దివ్యాన్ష కౌశిక్ మరో హీరోయిన్. ఏప్రిల్ 5 న విడుదల అయిన ఈ సినిమా సూపర్ హిట్ కాగా నిర్మాతకి మంచి లాభాలను తెచ్చిపెట్టింది.. నాగ చైతన్య కెరీర్ లోనే వసూళ్ల పరంగా ఈ సినిమా ది బెస్ట్ అనిపించుకోగా ఈ సినిమా జైత్రయాత్ర ఇంకా కొనసాగుతూనే ఉంది.. అయితే తాజాగా ఈ సినిమా కి సంబంధించి సక్సెస్ మీట్ ని హైదరాబాద్ లో నిర్వహించింది చిత్ర బృందం.. ఈ కార్యక్రమానికి నటులు రావు రమేష్, పోసాని కృష్ణమురళి, సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్ తో పాటు ప్రముఖ దర్శకుడు కొరటాల శివ, అనిల్ రావిపూడి ముఖ్యఅథిధులు గా విచ్చేశారు..
ఈ సందర్భంగా నటుడు రావు రమేష్ మాట్లాడుతూ.. ఫ్యూచర్ లో ఈ సినిమా రాబోయే సినిమా లకు ఒక రిఫరెన్స్ లా మిగిలిపోతుందని ముందే అనుకున్నాను..అది నిజం చేస్తూ ఇంత మంచి హిట్ అందించిన ప్రేక్షకులకు చాల థాంక్స్..సినిమా లో అందరు బాగా నటించారు.. నాగచైతన్య ఇంత బాగా ఎలా చేశారనిపిస్తుంది.. సమంత గారు ఏ పాత్ర కైనా యిట్టె ఒదిగే పోయే నటి.. ప్రతి పాత్ర చాల బాగా డిజైన్ చేశారు శివ.. పాటలు అద్భుతంగా ఉన్నాయి.. ఒక శిల్పంలా ఎంతో ఓర్పుగా తీర్చిదిద్దారు.. సుబ్బరాజ్ గారు పాత్ర వెరైటీ గా ఉంది.. ఎక్కడా ఎమోషన్ మిస్ అవకుండా చాల బాగా సీన్స్ చేశారు..పాటలు ఇంత మధురంగా అందించిన గోపి సుందర్ గారికి హ్యాట్సాఫ్.. థమన్ గారి నేపథ్య సంగీతం సినిమా కె హైలైట్..ఎక్కడ ఎలా ఉపయోగించాలో అలా ఉపయోగించి మంచి ఆర్.ఆర్. అందించారు..సినిమాటోగ్రాఫర్ విష్ణు శర్మ అందరిని చాల చక్కగా చూపించారు.. అందరిని సమంత , నాగ చైతన్య ల పాత్ర మరిచిపోలేనిది..మా జీవితంలో గుర్తుండిపోయే సినిమా మజిలీ.. అన్నారు..
నటుడు పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ..మజిలీ సినిమా హిట్ సందర్భంగా ఈ ఫంక్షన్ లో షీల్డ్ తీసుకోవడం చాల సంతోషంగా ఉంది.. ఈ సినిమా పాత్రతో నాకు మంచి పేరు వచ్చింది.. గతంలో ఎన్నో తండ్రి పాత్రలు చేసిన ఈ సినిమా లో ఈ పాత్ర చేయడం ఎంతో స్పెషల్.. ఈ సినిమా కి ఎలా నటిస్తే బాగుంటుందో అలానే నటించాడు నాగచైతన్య..తాగుబోతు పాత్రలో తనకంటూ ప్రత్యేకత ఏర్పరుచుకున్నారు.. అటు తాతలా కాకుండా, నాన్న లా కాకుండా తనదైన స్టయిల్ లో నటించాడు.. నాకీ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ , ప్రొడ్యూసర్స్ గారికి చాల థాంక్స్. అన్నారు..
సంగీత దర్శకుడు ఎస్.ఎస్.థమన్ మాట్లాడుతూ.. నన్ను నమ్మి ఇంత మంచి అవకాశం ఇచ్చిన డైరెక్టర్ శివ గారికి చాల థాంక్స్.. ఎంతో ప్రేమించి ఈ సినిమా ని తీశాడు.. అందుకే ఇంత పెద్ద హిట్ అయ్యింది.. మొదటి సారి శివ గారిని కలిసినప్పుడు సినిమా తాలూకు ప్రేమ అయన కళ్ళలో ఉంది.. ఆ ప్రేమే వారికి ఈ విజయాన్ని చేకూర్చింది.. అందరు చాల బాగా పనిచేశారు.. ఆర్.ఆర్ కి మంచి పేరొచ్చింది.. సినిమా కు తగ్గట్లే ఆర్.ఆర్ ఇచ్చి అక్కడే మొదటి విజయాన్ని పొందాను.. ఎంతో ఎంజాయ్ చేస్తూ చేసిన సినిమా ఇది.. చైతు ఎలాంటి సినిమా తీయాలో అలాంటి సినిమా చేశాడు.. రైట్ టైం లో రైట్ సినిమా చేసి మంచి సక్సెస్ ఇచ్చాడు.. సమంత గారు చాల బాగా నటించారు.. అన్నారు..
దర్శకుడు శివ నిర్వాణ మాట్లాడుతూ.. ఈ ఫంక్షన్ వచ్చిన అందరికి కృతజ్ఞతలు. ఈ సినిమా కి ఇంత పెద్ద విజయం అందించిన ప్రేక్షకులకు చాలా చాలా థాంక్స్.. ఈ సినిమా ను నాకంటే ఎక్కువ గా నమ్మింది సినిమా యూనిట్ అంతా.. అందరు ఎంతో ఎంజాయ్ చేస్తూ ప్రేమించి చేశారు ఈ సినిమా ని .. చైతు గారు ఈ సినిమా కి న్యాయం చేశారు.. ఫ్యూచర్ లో మంచి మంచి పాత్రలు చేస్తారు.. సమంత గారు చాలా మంచి మనిషి.. క్లైమాక్స్ లో ఆమె నటన అద్భుతం.. ఈ సినిమా కి చైతన్య, సమంత గారు లైఫ్ ఇచ్చారు..తమన్ గారు చేసిన హెల్ప్ మాటల్లో చెప్పలేను.. అంత అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు..ఫస్ట్ టైం కలిసినప్పుడు చాల భయంగా ఉంది.. ఇప్పుడు చాల ఆనందంగా ఉంది.. ఈ సినిమా ప్రేక్షకుల్లోకి వెళ్ళడానికి ఎంతో పనిచేసిన వంశీ శేఖర్ గారికి కృతజ్ఞతలు అన్నారు..
దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. శివ నిర్వాణ మంచి ఫీల్ ఉన్న డైరెక్టర్.. సినిమా చూస్తున్నంతసేపు ఎంతో ఫీల్ లో ఉండిపోయి సినిమా చూస్తున్నాను.. సినిమా మొత్తం లో పూర్ణ పాత్ర చాలా బాగా నచ్చింది.. చైతన్య గారు సినిమా సినిమా కి మంచి పరిణితి కనపరుస్తున్నారు..ఈ సినిమా తో కంప్లీట్ యాక్టర్ అయిపోయారు.. ఎక్కడ కూడా తొణకలేదు.. పాత్రలో లీనమైపోయి అందరిని మెప్పించారు.. సమంత గారు చాల బాగా నటించారు..సెకండ్ హాఫ్ లో ఆమె నటన అద్భుతం.. తమన్ గారికి ఒక సినిమా బాకీ ఉన్నారు.. తప్పకుండా చేస్తాను..ఈ సినిమా కి అయన చేసిన ఆర్.ఆర్ చాల అబగుంది.. టీం అందరికి కంగ్రాట్స్ అన్నారు..
దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ..సినిమా ఇంత మంచి సక్సెస్ పొందినందుకు టీం అందరికి శుభాకాంక్షలు..
ఈ సినిమా లోని ప్రతి పాత్ర గుర్తుండిపోతుంది.. అంత బాగా తీర్చిదిద్దారు దర్శకుడు.. ప్రతి సీన్ చాల బాగుంది.. డైలాగ్స్ పాత్రకు సరిపోయేలా రాశారు.. నిజంగా లోకల్ లో ఇలానే జరుగుతుందా అని అన్నట్లు తీర్చిదిద్దారు.. చైతన్య గారు మంచి పాత్ర చేశారు.. పోసాని గారు రావు రమేష్ గారు ఇండస్ట్రీ లో ఉండడం అందరి అదృష్టం.. చైతు గారు ఇంత మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చారంటే నిజంగా గ్రేట్. పూర్ణ పాత్ర ను చూస్తుంటే నిజంగా అలాంటి క్యారెక్టర్ ఉందా అనిపిస్తుంది.. సమంత గారు చాలా బాగా చేశారు..ఆమెతో నేను పనిచేశాను.. గ్రేట్ యాక్టర్.. చైతు , సమంత ల కెమిస్ట్రీ చాల బాగుంది.. తమన్ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఇంత తక్కువ టైం లో ఇంత క్వాలిటీ మ్యూజిక్ ఇవ్వడం నిజంగా గ్రేట్.. ప్రొడ్యూసర్స్ గారు మంచి హిట్ కొట్టారు. అన్నారు..
నాగ చైతన్య మాట్లాడుతూ.. ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ కావడానికి కారణమయిన ప్రేక్షకులకు చాలా థాంక్స్.. అందరు కలిసి ఎంతో కష్టపడి ఈ సినిమా చేసారు… ఈ హిట్ అందరికి అంకితం.. శివ ఎప్పటికి మర్చిపోలేని హిట్ ఇచ్చాడు.. ఇంపార్టెంట్ టైం లో మంచి హిట్ ఇచ్చాడు.. ప్రొడ్యూసర్స్ సాహు, హరీష్ మంచి సపోర్ట్ చేశారు. ఈ హిట్ ని మర్చిపోలేను.. పెద్ద పెద్ద ఆర్టిస్ట్స్ లతో నటించాను.. మంచి అనుభూతిని ఇచ్చింది. సుబ్బరాజ్ తో ఒక సీన్ లో నటించాను.. ఆ సీన్ సినిమా లో లేదు కానీ మీరు చూస్తే బాగుంది అంటారు.. దివ్యాన్ష చాల బాగా నటించింది..తమన్ ఈ సినిమా కి మంచి లైఫ్ ఇచ్చాడు.. మరొకసారి అందరికి చాలా చాల థాంక్స్ అన్నారు..