Mahesh launches his Madame Tussauds wax statue at AMB Cinemas
మహేష్ బాబు వ్యాక్స్ స్టాట్యూ విడుదల
మేడమ్ టుసాడ్స్ రూపొందించిన మహేష్ వ్యాక్స్ స్టాట్యూని హైదరాబాద్‌లోని ఏఎంబీలో సోమవారం ఉదయం మహేష్‌బాబు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మేడమ్ టుస్సాడ్స్ తరఫున అలెక్స్ పాల్గొన్నారు.
మహేష్ మాట్లాడుతూ – “నా విగ్రహాన్ని హైదరాబాద్ లో ఇక్కడి సినీ ప్రియుల మధ్య విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. గతేడాది వాళ్లు నన్ను సంప్రదించారు. రకరకాల కళ్లను, రంగు రంగుల జుట్టును తీసుకొచ్చి నాకు పోల్చి చూశారు. అదంతా మామూలుగా చేస్తున్నారని , కొలతలు తీసుకుంటున్నారని అనుకున్నా. కానీ వారు విగ్రహాన్ని మలిచిన తీరు చాలా బావుంది. నన్ను నేను చూసుకుంటున్నట్టుగా ఉంది. ఒకసారి వాళ్లు ఆ ఫోటోలను నాకు పంపిచారు. వాటిని నా భార్యతోనూ ,కొంతమంది సన్నిహితులలోనూ పంచుకున్నాను. వాటిని చూసిన వారు నేనేదో సినిమాకు ఫోటో షూట్ చేశానని అనుకున్నారు. అంత బాగా ఉంది స్టాట్యూ. ప్రాణం పోసినట్టుగా చేసిన ఇవాన్ రీజ్, బెంటానా తదితర టీమ్ కు ధన్యవాదాలు. నాకు నా విగ్రహాన్ని చూస్తుంటే ఆనందంగా , అద్వితీయంగా, గొప్పగా, ఉత్కఠంగా, ఒకింత భయంగా, అన్నీ భావాలు కలగలిసినట్టుగా ఉంది. భారతదేశానికి చెందిన పలువురు సెలబిట్రీలబొమ్మలు అక్కడున్నాయని నాకు తెలుసు. నా ఫ్యామిలీతో కలిసి అక్కడికి వెళ్లాలని కూడా అనుకుంటున్నా“ అని అన్నారు.
మేడమ్ టుస్సాడ్స్ అలెక్స్ మాట్లాడుతూ- “యునిక్ అకేషన్ ఇది. తొలిసారి మేం ఒక వ్యాక్స్ స్టాట్యూని సింగపూర్ కాకుండా , మరోచోట విడుదల చేస్తున్నాం. తొలిసారి మేం హైదరాబాద్ కు వచ్చాం. తెలుగు సినిమా స్టార్ స్టాట్యూని సింగపూర్ లో విడుదల చేయడం కూడా ఇదే తొలిసారి. మహేష్ ని ఎంతో మంది రిఫర్ చేశారు. మా టీమ్ 20 మంది ఆరు నెలలు కష్టపడి ఈ స్టాట్యూని చేశారు. దాదాపు మహేష్ కి సంబంధించిన 200 మెజర్ మెంట్స్ తీసుకున్నారు. కంటిపాప నుంచి అన్నీ కొలతలు తీసుకున్నారు. షారుఖ్ ఖాన్ , అమితాబచ్చన్ , ఇప్పుడు మహేష్ బాబు స్టాట్యూని విడుదల చేయడం ఆనందంగా ఉంది “అని అన్నారు.
మహేష్ గారు ఇది వరకు ఎప్పుడైనా మేడమ్ టుసాడ్స్ వెళ్లారా ? అప్పుడు మీకు ఎలా అనిపించింది ?
ఆరేళ్ల క్రితం లండన్ లో మ్యూజియమ్ కి వెళ్లాను. నా పిల్లలు చాలా హ్యాపీగా ఫీలయ్యారు. అక్కడ ఉన్న మైనపు
విగ్రహాలతో ఫోటోలు తీసుకున్నారు. వాళ్లను చూసిన తర్వాత ఎప్పుడో ఒకరోజు నా బొమ్మ ఇక్కడికి వస్తుందని అనుకున్నా. ఇప్పుడు అది జరిగింది. సింగపూర్ మేడమ్ టుస్సాడ్స్ కి ధన్యవాదాలు . చాలా ఆనందంగా ఉంది.
మీ మైనపు ప్రతిమను చూస్తుంటే ఏమనిపిస్తోంది మహేష్?
చాలా ఆనందంగా , సంతోషంగా ఉంది. మేడమ్ టుస్సాడ్స్ సింగపూర్ వాళ్లు ఇంత బాగా చేశారు. మా పిల్లల ముందు విడుదల చేయడం చాలా బావుంది. టీమ్ కి థాంక్యూ.
`మహర్షి` గురించి చెప్పండి?
నా 25వ సినిమా. నా బిగ్గెస్ట్ సినిమా అవుతుంది.
మీ బొమ్మతో మీకు మాట్లాడే అవకాశం వస్తే ఏం మాట్లాడుతారు?
ఎలా ఉన్నావు , బావున్నా, అని మాట్లాడుతూ . (నవ్వుతూ) స్టాట్యూ చాలా బావుంది.
మీ ఐ, హెయిర్ అలాగే చేశారు? ఎలా సాధ్యమైంది?
మెజర్ మెంట్స్ అని ఒకసారి వచ్చారు. సరేనని ఇచ్చాను. కానీ ఇంత డీటైలింగ్ గా ఉంటుందని అనుకోలేదు. నా పాదంసైజ్, నా చేతుల సైజు , నా రంగు , నా చర్మం , నా గోళ్లు ఇలా అన్నీ నాలాగే ఉన్నాయి.
ఈ బొమ్మను చేయడానికి ఎన్ని రోజులు పట్టింది?
20 మంది 6 నెలలు పని చేశారు. చాలా కేర్ తీసుకుని చేశారు.
ఇలాంటివన్నీ సింగపూర్‌లో పెడతారు. మరి హైదరాబాద్‌లో ఎందుకు పెట్టారు?
నా షెడ్యూల్స్ టైట్ వల్ల అక్కడికి వెళ్లడానికి కుదరలేదు. అందుకే వాళ్లు ఇక్కడికి వచ్చారు. అది హానర్. నా పిల్లల ముందు దీన్ని విడుదల చేయడం చాలా ఆంనందంగా ఉంది.
మీ సినిమాల్లో ఈ స్టాట్యూని చూడొచ్చా?
సింగపూర్ మ్యూజియమ్ కి వెళ్లి చూడోచ్చు. సినిమాల్లో కాదు.
మహేష్ స్టాట్యూని చేయడానికి కారణం ప్రత్యేకంగా ఏదైనా?
ప్రపంచంలోని పలువురు చేసిన రిక్వెస్ట్ కారణంగా మేం ఇది చేశాం.
మీ స్టాట్యూ పెడుతున్నారని తెలియగానే. ఇంట్లో వాళ్లు ఏమన్నారు?
మా ఆవిడ ఈ విషయాన్ని నాతో చెప్పింది. చాలా హ్యాపీగా ఫీలయ్యాం. నాకు ఏదో అచీవ్ చేసినట్టు అనిపించింది.
మైనపు విగ్రహం చూడగానే ఇద్దరు భర్తలున్నారని నమ్రత అన్నారు.
ఇద్దరు మహేష్ బాబులున్నారని ఆవిడ మాటకు అర్థం అండీ.
ఈ లుక్ ఏ సినిమాలోది?
ఈ లుక్ శ్రీమంతుడులో లుక్. శ్రీ మంతుడు లో ఆ పోజు బావుందని చెప్పి , అలా పోజు ఇవ్వమని అడిగారు. అలాగే ఇచ్చాను. నా అన్నీ ఫోటోలు చూశారు. ఏది బావుంటే , దాన్ని బట్టి తీసుకున్నారు.