Maa Aai Productions First Film In Shivakumar’s Direction Titled ’22’

Maa Aai Productions First Film In Shivakumar’s Direction Titled ’22’

 

Maa Aai Productions First Film In Shivakumar's Direction Titled '22'

శివకుమార్‌ బి. దర్శకత్వంలో మా ఆయి ప్రొడక్షన్స్‌ తొలి చిత్రం ’22’

శివకుమార్‌ బి. దర్శకత్వంలో మా ఆయి ప్రొడక్షన్స్‌ పతాకంపై రూపేష్‌ కుమార్‌ చౌదరి, సలోని మిశ్రా హీరోహీరోయిన్లుగా రూపొందనున్న చిత్రం ’22’. ఈ చిత్రం బేనర్‌ లోగో, టైటిల్‌ ఎనౌన్స్‌మెంట్‌ కార్యక్రమం జూన్‌ 22న హైదరాబాద్‌లోని దసపల్లా హోటల్‌లో జరిగింది. మా ఆయి ప్రొడక్షన్స్‌ బేనర్‌ లోగోను ప్రముఖ నిర్మాత సి. కల్యాణ్‌ ఆవిష్కరించగా, సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌ టైటిల్‌ను ఎనౌన్స్‌ చేశారు. ఇంకా ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు మారుతి, ప్రముఖ నిర్మాత కొండా కృష్ణంరాజు అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌ మాట్లాడుతూ – ”శివ నా దగ్గర చాలా సినిమాలకు దర్శకత్వశాఖలో పని చేశాడు. తనంటే నాకు చాలా ఇష్టం. చాలా క్రమశిక్షణ, డెడికేషన్‌ ఉన్న వ్యక్తి. తనకి దర్శకుడిగా అవకాశం రావడం మంచి విషయం. ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతల్ని అభినందిస్తున్నాను. సహజంగా బి.ఎ. రాజుగారి ద్వారా సినిమా అవకాశం వచ్చిందని చాలామంది అనుకుంటారు. కానీ.. శివ తన టాలెంట్‌తో కథను రెడీ చేసుకొని నిర్మాతలని మెప్పించి ఈ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా టైటిల్‌ ’22’. జూలై 22 నుండి రెగ్యులర్‌ షూటింగ్‌ జరుపనున్నారు. శివ ఇండస్ట్రీలో చాలా పెద్ద దర్శకుడు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే హీరో రూపేష్‌కుమార్‌ చౌదరి, సలోని మిశ్రా, సంగీత దర్శకుడు సాయికార్తీక్‌, చిత్ర యూనిట్‌కి ఆల్‌ ది బెస్ట్‌” అన్నారు.
దర్శకుడు మారుతి మాట్లాడుతూ – ”కొత్త డైరెక్టర్‌, కొత్త కాన్సెప్ట్‌తో ముందుకు వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. బి.ఎ. రాజుగారి మీద ఆధారపడకుండా సినిమా మీద ప్యాషన్‌తో ఓ వెబ్‌ సిరీస్‌కి దర్శకత్వం వహించి తన టాలెంట్‌ను ప్రూవ్‌ చేసుకొని మళ్లీ తననే హీరోగా పెట్టి సినిమా తీయడం అనేది సామాన్యమైన విషయం కాదు. శివ మా బేనర్‌లో కొన్ని సినిమాలకు వర్క్‌ చేశాడు. మంచి యాటిట్యూడ్‌ ఉన్న వ్యక్తి. ఈ ’22’ టైటిల్‌ చాలా ఇన్నోవేటివ్‌గా ఉంది. నాకు ‘ఈరోజుల్లో’ సినిమా ఎలా ఒక ట్రెండ్‌ మార్క్‌ అయిందో ఈ ’22’ సినిమా శివకి అలా ట్రెండ్‌ మార్క్‌ మూవీ అవ్వాలని కోరుకుంటున్నాను. టీమ్‌ అందరికీ ఆల్‌ ది బెస్ట్‌” అన్నారు.
ప్రముఖ నిర్మాత సి. కల్యాణ్‌ మాట్లాడుతూ – ”ఈ రోజు జయగారు ఎక్కడున్నా చాలా సంతోషిస్తారు. ఆమె డైరెక్టర్‌గా సినిమా తీయడం కన్నా.. శివ డైరెక్టర్‌ అవ్వాలనేది ఆమె కోరిక. శివ మా బేనర్‌లో ఎక్కువ సినిమాలు చేశాడు. ప్రొడ్యూసర్స్‌కి చాలా కంఫర్టబుల్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌. ఒక డైరెక్టర్‌కి ప్రొడక్షన్‌ మీద కంట్రోల్‌ ఉండటం అనేది చాలా అవసరం. శివ మీద నాకు నమ్మకం ఉంది. శివలో మంచి స్పార్క్‌ ఉంది. చాలా తక్కువ టైమ్‌లో ఎక్కువ సినిమాలు చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అన్నారు.
ప్రముఖ నిర్మాత కొండా కృష్ణంరాజు మాట్లాడుతూ – ”నేను, బి.ఎ. రాజుగారు స్వంత అన్నదమ్ముల్లాంటి వాళ్లం. ఈరోజు మా రాజుగారి అబ్బాయి శివ తనకు తానుగా స్వయంకృషితో వెబ్‌ సిరీస్‌ చేయడం, అది నిర్మాతకి నచ్చి తనతో సినిమా తీయడానికి ముందుకు రావడం చాలా సంతోషం. అలాగే జయగారి దీవెనలు ఎప్పుడూ శివకి ఉంటాయి” అన్నారు.
సంగీత దర్శకుడు సాయి కార్తీక్‌ మాట్లాడుతూ – ”దర్శకుడు శివ నాకు గత ఐదారు సంవత్సరాలుగా తెలుసు. ఈ స్టోరి విన్నాను. చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంది. ఈ సినిమా శివకి మంచి పేరు తెస్తుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకి థాంక్స్‌” అన్నారు.
హీరో రూపేష్‌ కుమార్‌ చౌదరి మాట్లాడుతూ – ”శివగారు నాకు వెబ్‌ సిరీస్‌లో నటించే అవకాశం ఇచ్చి, ఇప్పుడు మళ్లీ హీరోగా సినిమా చేసే అవకాశం ఇచ్చినందుకు థాంక్స్‌” అన్నారు.
ప్రొడక్షన్‌ హెడ్‌ అనీ లామా మాట్లాడుతూ ”జూలై 22 నుంచి ఈ సినిమా రెగ్యులర్‌ షూట్‌ ప్లాన్‌ చేశాం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ నాన్‌స్టాప్‌గా జరుగుతోంది” అన్నారు.
ఫైట్‌ మాస్టర్‌ జాషువా మాట్లాడుతూ ”ఖైదీ నంబర్‌ 150, సాహో వంటి సినిమాలకు వర్క్‌ చేసిన నేను శివ చెప్పిన కథ వినగానే ఎంతో ఎక్సైట్‌ అయి ఈ సినిమా ఒప్పుకున్నాను. ఇందులో యాక్షన్‌ పార్ట్‌ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది” అన్నారు.
కో-డైరెక్టర్‌ పుల్లారావు కొప్పినీడి మాట్లాడుతూ ”ఇంతకుముందు నేను, శివ కలిసి వర్క్‌ చేశాం. ’22’ కథ చాలా అద్భుతంగా ఉంటుంది. డెఫినెట్‌గా సినిమా పెద్ద విజయం సాధిస్తుంది” అన్నారు.
హీరోయిన్‌ సలోని మిశ్రా మాట్లాడుతూ ”ఫలక్‌నుమాదాస్‌ తర్వాత చేస్తున్న సినిమా ఇది. చాలా ఇంట్రెస్టింగ్‌ క్యారెక్టర్‌. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా ఆయి ప్రొడక్షన్స్‌కి, పూరి కనెక్ట్స్‌కి థాంక్స్‌” అన్నారు.
దర్శకుడు శివకుమార్‌ బి. మాట్లాడుతూ – ”నేను మారుతి, పూరి జగన్నాథ్‌, వి.వి.వినాయక్‌గారి సినిమాలకి దర్శకత్వ శాఖలో పని చేశాను. అనుకోకుండా ఒకరోజు కొరియోగ్రాఫర్‌ ఆనీ మాస్టర్‌ నాతో నిర్మాత సుశీలాదేవిగారిని కలిసి కథ చెప్పమన్నారు. అప్పుడు నేను ముందుగా ఒక వెబ్‌ సిరీస్‌ చేద్దాం అన్నాను. అలా కథ నచ్చడంతో నాకు వెబ్‌ సిరీస్‌ చేసే అకాశం ఇచ్చారు. అదే ప్రొడక్షన్‌లో నాకు దర్శకుడిగా అవకాశం ఇచ్చినందుకు థాంక్స్‌. అలాగే నన్ను బ్లెస్‌ చేయడానికి వచ్చిన సి. కల్యాణ్‌, వి.వి. వినాయక్‌, మారుతి, కొండా కృష్ణంరాజుగార్లకు థాంక్స్‌. మా నాన్న బి.ఎ. రాజుగారు నా అన్ని స్ట్రగుల్స్‌లో నాకు తోడుగా ఉంటూ, నన్ను ప్రతిక్షణం ముందుకు నడిపిస్తున్నారు. మా మమ్మీ జయగారి దగ్గర నేను ముందుగా ప్రొడక్షన్‌ నేర్చుకున్నాను. ఆ తర్వాత దర్శకత్వ శాఖలో మెళకువలు తెలుసుకున్నాను. మమ్మీ ఎక్కడున్నా.. ఆమె ఆశీస్సులు నాతోనే ఉన్నాయని నమ్ముతున్నా. అలాగే మేం అడగ్గానే సలోని మిశ్రా డేట్స్‌ అడ్జస్ట్‌ చేసి ఇచ్చిన పూరి కనెక్ట్స్‌ పూరి జగన్నాథ్‌గారికి, ఛార్మిగారికి థాంక్స్‌” అన్నారు.
రూపేష్‌ కుమార్‌ చౌదరి, సలోని మిశ్రా, విక్రమ్‌జీత్‌ సింగ్‌, జయప్రకాశ్‌, రాజేశ్వరి నాయర్‌, రవివర్మ, అమిత్‌ తివారి, ఫిదా శరణ్య, మాస్టర్‌ తరుణ్‌ పవార్‌, బేబి ఓజల్‌ పవార్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: బి.వి. రవికిరణ్‌, సంగీతం: సాయికార్తీక్‌, ఆర్ట్‌: బ్రహ్మ కడలి, ఎడిటింగ్‌: శ్యామ్‌ వాడవల్లి, స్టంట్స్‌: జాషువ, స్టిల్స్‌: వరహాలమూర్తి, ప్రొడక్షన్‌ హెడ్‌ అండ్‌ కొరియోగ్రఫీ: అనీ లామా, చీఫ్‌ కో-డైరెక్టర్‌: పుల్లారావు కొప్పినీడి, నిర్మాత: శ్రీమతి సుశీలాదేవి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శివకుమార్‌ బి.
Maa Aai Productions First Film In Shivakumar’s Direction Titled ’22’

Maa Aai Productions first film starring Rupesh Kumar Choudhary, Saloni Misra in Shivakumar B Direction is titled as ’22’. Production House Logo launch and Title Announcement of the film was held in an event on June 22nd at Dasapalla Hotel, Hyderabad. Popular Producer C Kalyan unveiled the logo of ‘Maa Aai Productions’ While Sensational Director VV Vinayak has announced the title ’22’. Successful Director Maruthi, Well known Producer Konda Krishnamraju also graced the event as guests. On this occasion…

Sensational Director VV Vinayak said, ” Siva worked with me in my direction department for many films. I like him a lot. He is well disciplined and very dedicated. It’s good to see him as a director today. I appreciate the producers for this opportunity for him. Naturally many will think that Shiva got this opportunity because of BA Raju garu. But, Shiva has readied his script with his own talent he impressed the producers and earned this opportunity. Title of the film is ’22’. The regular shoot will start from July 22nd. I heartfully wish Shiva to become a very big director in the industry. All the best to Hero Rupesh Kumar Choudhary, Saloni Misra, Music Director Sai Kartheek and the entire team.”

Successful Director Maruthi said, ” I am very happy that a new director is coming up with a new concept. Shiva purely driven by passion towards the movies proved his talent by directing a web series and making a film today casting the same hero without depending on BA Raju garu is not an easy thing. Shiva worked for some films in our banner. He is a person with a very good attitude. Title of the film, ’22’ is very innovative. I wish ’22’ will become a trend mark film for Shiva like how ‘Ee Rojullo’ film became a trend mark film for me.”

Popular Producer C Kalyan said, ” Jaya garu will be happy wherever she is today. She wished Shiva to become a director more than anything. Shiva worked in our banner for many films. He is a very comfortable assistant director for producers. It’s a necessity that a director should have control over production. I have belief in Shiva. He has a very good spark in him. I heartfully wish that he should make more films in less time.”

Popular Producer Konda KrishnamRaju said, “I and BA Raju garu are like own brothers. I am very happy to see our Raju gari son Shiva who has made a web series on his own is now directing a film. Shiva will always have Jaya gari blessings with him.”

Music Director Sai Kartheek said, ” I know Director Shiva for last 5 years. I know the story and it is very exciting. This film will bring a very good name for Shiva. Thanks to Director and Producers for giving me this opportunity.”

Hero Rupesh Kumar Choudhary said, ” Shiva garu has given me an opportunity to act in a web series and today he again made me a hero for this film. Thanks to Shiva garu.”

Production Head Anee Lama said, ” We planned regular shoot of the film from July 22nd. Currently pre-production work is going on a brisk pace.”

Fight Master Joshua said, ” I worked for Khaidi No 150, Saaho films. I got excited and immediately agreed to do this film when Shiva narrated me the story. This film will have a very different kind of action part.”

Co-Director Pullarao Koppineedi said, ” I and Shiva worked together. ’22’ has a superb story. The FIlm will definitely become a huge success.”

Heroine Saloni Misra said, ” I am doing this film after ‘Falaknumadas’. Mine is a very interesting character. Thanks to Maa Aai Productions and Puri Connects for giving me this opportunity.”

Director Shivakumar B said, ” I worked for many films in direction department of Maruthi, Puri Jagannadh, VV Vinayak garlu. One day Anee master asked me to narrate my story to Producer Suseela Devi garu. I said to her that we should make a web series first. She liked the story and gave me the opportunity to direct a web series. Thanks to her for giving me this opportunity to direct a film in the same production house. Thanks to C Kalyan, VV Vinayak, Maruthi, Konda Krishnamrau garlu who came here today to bless me. My father BA Raju garu stood with me in all of my struggles and he is the one who makes me walk forward every minute. I learned production from my mother Jaya garu. Then I used to learn more about direction skills. Wherever my mother is, I always have her blessings with me. Thanks to Puri Connects, Puri Jagannadh garu, Charmme garu for adjusting the dates of Saloni Misra for our film.”

Rupesh Kumar Choudhary, Saloni Misra, Vikramjeet Singh, Jayaprakash, rajeshwari Nair, Ravi Varma, Amit Tiwari, Fidaa Saranya, Master Tarun Pawar, Baby Ojal Pawar and Others

CInematography: BV Ravikiran, Music: Sai Kartheek, Art: Brahma Kadali, Editing: Shyam Vadavalli, Stunts: Joshua, Stills: Varahalamurthy, Production Head & Choregraphy : Anee Lama, Chief Co-Director: Pullarao Koppineedi, Producer: Smt SuseelaDevi, Story – Screenplay – Direction: Shivakumar B