‘‘కథంటే ఇదేరా’’ ఫస్ట్ లుక్ ఆవిష్కరించిన నక్కిన త్రినాధరావు !!
ప్రతిమ ప్రొడక్షన్స్ పతాకంపై అభిరామ్, వెన్నెల హీరోహీరోయిన్లుగా హరీష్ చావా దర్శకత్వంలో దాసరి ప్రతిమ నిర్మించిన మెసేజ్ ఓరియంటెడ్ లవ్ స్టోరీ ‘కథంటే ఇదేరా’. ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ని ప్రముఖ దర్శకులు నక్కిన త్రినాధరావు చేతుల మీదుగా హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో హ్యాపీడేస్ ఫేమ్ వంశీతో పాటు చిత్రయూనిట్ పాల్గొన్నారు.
ఫస్ట్ లుక్ విడుదల అనంతరం దర్శకులు నక్కిన త్రినాధరావు మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా పేరు చాలా ఆసక్తికరంగా ఉంది. వినగానే కథ తెలుసుకోవాలనే కోరిక కలిగి, పాయింట్ ఏంటి అని అడిగితే.. కథ లైన్ వినిపించారు. చాలా కొత్తగా అనిపించింది. మంచి మెసేజ్ ఓరియంటెడ్ చిత్రమిది. ఈ సినిమా మంచి విజయం సాధించాలని, చిత్రయూనిట్‌కు మంచి పేరు రావాలని అభినందిస్తూ.. చిత్రయూనిట్‌కు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను..’’ అన్నారు. తమ చిత్ర ఫస్ట్ లుక్‌ని విడుదల చేసి.. శుభాకాంక్షలు తెలిపిన నక్కిన త్రినాధరావుగారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.. అని చిత్రయూనిట్ పేర్కొంది.
అభిరామ్, వెన్నెల, పవన్ రాయల్, మనోహర్ లక్కి, కిృష్, మంజుల, ఎఫ్2 ఫేమ్ ప్రదీప్, సరస్వతి తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: మీరావలి షేక్; కెమెరా: యాదగిరి; కథ-మాటలు-పాటలు: నోరి నాగప్రసాద్; ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: యడాలి శ్రీనివాసరావు; నిర్మాత: దాసరి ప్రతిమ; స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: హరీష్ చావా.