క‌థ వెనుక క‌థ‌` మూవీ రివ్యూ!!

క‌థ వెనుక క‌థ‌` మూవీ రివ్యూ!!

క‌థ వెనుక క‌థ‌` మూవీ రివ్యూ!!

 న్యూ ఏజ్ స్టోరీస్‌తో వ‌చ్చే ద‌ర్శ‌కుల‌కు తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ ఎప్పుడూ బ్ర‌హ్మ ర‌థం ప‌డుతుంది. ఇప్పుడు న‌డుస్తున్న ట్రెండ్‌కు త‌గ్గ సినిమాలు వ‌స్తే ప్రేక్ష‌కులు ఆద‌రిస్తూనే ఉంటారు. అలాంటి క‌థ‌తో తెర‌కెక్కిన చిత్రం `క‌థ వెనుక క‌థ‌`. దండ‌మూడి బాక్సాఫీస్ సంస్థ  నిర్మించిన ఈ చిత్రానికి కృష్ణ  చైత‌న్య ద‌ర్శ‌కుడు. టైటిల్ తోనే ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్న ఈ చిత్రం టీజ‌ర్ మ‌రియు ట్రైల‌ర్‌తో అంచ‌నాల‌ను మ‌రింత పెంచింది. ఎన్నో అంచ‌నాల మ‌ధ్య 12-05-2023న విడుద‌లైన ఈ చిత్రం ఎలా ఉందో తెలుసుకుందాం.
 స్టోరీ ఏంటంటే…
ద‌ర్శ‌కుడు కావాల‌న్న‌ది అశ్విన్ (హీరో విశ్వంత్) గోల్‌. ఎంతో మంది నిర్మాత‌ల‌కు క‌థ‌లు చెబుతాడు. చివ‌ర‌గా ఓ రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారీ సినిమాను నిర్మించ‌డానికి ముందుకు వ‌స్తాడు. ఈ క్ర‌మంలో త‌న మేన మామ కూతురు శైల‌జ‌తో ప్రేమ‌లో ప‌డ‌తాడు. సినిమా షూటింగ్ పూర్త‌యి …రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డే స‌మ‌యంలో ప్ర‌మోష‌న్స్ కు డ‌బ్బులు అడ్జ‌స్ట్ అవ్వ‌డంలేద‌ని నిర్మాత చెప్ప‌డంతో దీంతో అశ్విన్ డిప్రెష‌న్ కి లోన‌వుతాడు. ఇంత‌లోనే ఈ చిత్రంలో న‌టించిన న‌టీన‌టులు క‌నిపించ‌కుండా పోతారు. `తెర వెనుక క‌థ‌` న‌టీన‌టులు ఎలా మిస్స‌య్యారు? ఈ కేసును స‌త్య ( సునీల్) అనే పోలీస్ ఇన్స్ పెక్ట‌ర్ ఛేదించే క్ర‌మంలో ఎలాంటి నిజాలు బ‌య‌ట‌ప‌డ్డాయి?.. అశ్విన్ త‌న ప్రేమ‌కు ఎలాంటి అడ్డంకులు ఏర్ప‌డ్డాయి.. తెలియాలంటే చిత్రాన్ని చూడాల్సిందే.
విశ్లేష‌ణః
 ఒక‌వైపు వ‌రుస హ‌త్య‌ల‌తో, అత్యాచారాల‌తో అట్టుకుడిపోతున్న సిటీ. ఇంతో ఒక కొత్త ద‌ర్శ‌కుడు …నిర్మాతని ప‌ట్టుకొని సినిమా చేసి హిట్ తెచ్చుకోవాల‌న్న క‌సి.  కానీ అనూహ్యంగా సినిమా ఆగిపోయి. సినిమాలో న‌టించిన వారి మిస్సింగ్ తో క‌థ మ‌రోవైపు ట‌ర్న్ తీసుకుంటుంది. అక్క‌డ నుంచి హీరో రంగంలోకి దిగి…త‌న న‌టీన‌టుల‌తో పాటు, వ‌రుస హ‌త్య‌ల‌ను ఎవ‌రు చేస్తున్నార‌న్న విష‌యాన్ని బ‌య‌ట‌పెట్ట‌డం ఎంతో ఆస‌క్తిక‌రంగా ఉంటాయి. క్లైమాక్స్ లో వ‌చ్చే సునీల్ సీక్వెన్స్ సినిమాకు హైలెట్ గా నిలుస్తాయి.
న‌టీన‌టులు..
డైర‌క్ట‌ర్ గా అశ్విన్ చాలా బాగా న‌టించాడు. సునీల్ క్యార‌క్ట‌ర్ మాత్రం మంచి అసెట్‌గా నిలిచింది. నిర్మాత‌గా చేసిన జ‌య‌ప్ర‌కాష్ న‌ట‌న సినిమాకు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌. ర‌ఘుబాబు, మ‌ధునంద‌న్ , స‌త్యం రాజేష్, భూపాల్ , ఖ‌య్యుం పాత్ర‌ల‌కు త‌గ్గ‌ట్టుగా న‌టించారు. హీరోయిన్ కి త‌న పాత్ర మేర‌కు న‌టించింది.
సాంకేతిక నిపుణులు..
 `క‌థ‌ని ఎంతో ఆస‌క్తిక‌రంగా త‌యారు చేసుకున్న ద‌ర్శ‌కుడు  క‌థ‌నం మీద కాస్తంత శ్ర‌ద్ధ పెడితే సినిమా సూప‌ర్ హిట్ గా నిలిచేది.
ఫ‌స్టాఫ్ చాలా నెమ్మ‌దిగా ఉన్న‌ప్ప‌టికీ   సెకండాఫ్ లో వ‌చ్చే ఒక్కో  ట్విస్ట్ ప్రేక్ష‌కుల‌ని షాక్ కి గురి చేస్తూ ఎంతో థ్రిల్ చేస్తుంది.
 మ్యూజిక్ కొన్ని చోట్ల లౌడ్ అయినా కొన్ని చోట్ల క‌థ‌ను ముందుకు న‌డిపింపే విధంగా ఉంది.  సినిమాటోగ్ర‌ఫీ క‌థ మూడ్ కి త‌గ్గ‌ట్టుగా ఉంది. నిర్మాణ విలువ‌లు బావున్నాయి.
చివ‌ర‌గా..
ప్ర‌జెంట్ ట్రెండ్‌కు త‌గ్గ  క‌థ‌ను ఎంచుకొని ప్రేక్ష‌కుల మ‌న్న‌న‌లు పొందే విధంగా ఎక్క‌డా బోర్ కొట్ట‌కుండా తాను రివీల్ చేసే ప్ర‌తీ ట్విస్ట్‌ను ఆడియేన్స్ ఎంజాయ్ చేసే విధంగా  `క‌థ వెనుక క‌థ‌` ను ప్రేక్ష‌కుల‌కు చూపించాడు ద‌ర్శ‌కుడు. అన్ని వ‌ర్గాల‌కు న‌చ్చే అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయి. ప్ర‌తి ఒక్క‌రూ త‌ప్ప‌కుండా చూడాల్సిన చిత్రమిది.

రేటింగ్ః 3/5