కార్తీ-రష్మికా మందన్న ‘సుల్తాన్’ టీజర్ రిలీజ్
కార్తీ-రష్మికా మందన్న ‘సుల్తాన్’ టీజర్ రిలీజ్!!
కార్తీ హీరోగా బక్కియరాజ్ కణ్ణన్ దర్శకత్వంలో రూపొందుతోన్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘సుల్తాన్’. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై యస్.ఆర్. ప్రకాష్ బాబు, యస్.ఆర్. ప్రభు నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో నిర్మాణమవుతున్న ఈ చిత్రంలో యోగిబాబు, నెపోలియన్, లాల్, రామచంద్రరాజు (‘కేజీఎఫ్’ ఫేమ్) కీలక పాత్రధారులు.
ఏప్రిల్ 2న ‘సుల్తాన్’ను విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. సోమవారం సాయంత్రం 5:30 గంటలకు రిలీజ్ చేసిన టీజర్ ద్వారా రిలీజ్ డేట్‌ను రివీల్ చేశారు.
హీరోయిన్ రష్మికా మందన్న తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా సుల్తాన్ తెలుగు టీజర్‌ను షేర్ చేసి, “Presenting the teaser of #Sulthan, a perfect family entertainer.” అంటూ ట్వీట్ చేశారు.
1 నిమిషం నిడివి కలిగిన ఈ టీజర్, “మహాభారతం చదివావా? భారతంలో కృష్ణుడు వంద అవకాశాలిచ్చినా కౌరవులు మారలేదు. నువ్వు ఇవ్వమంటోంది ఒక్క అవకాశమే కదా. ఇస్తా.” అంటూ ఓ పోలీసాఫీసర్ క్యారెక్టర్ కార్తీతో అనడంతో మొదలైంది. అందుకు కార్తీ, “మహా భారతంలో కృష్ణుడు పాండవుల వైపు నిల్చున్నాడు. అదే కృష్ణుడు కౌరవుల వైపుంటే? అదే మహాభారతాన్ని ఒకసారి యుద్ధం లేకుండా ఊహించుకోండి సార్.” అని సమాధానమివ్వడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
టీజర్ ప్రకారం జోవియల్‌గా ఉండే ఓ యువకుడు తనకు ఎదురైన పరిస్థితుల కారణంగా కౌరవుల్లాంటి దుష్టులను ఎలా ఎదుర్కొన్నాడు? అతను అలా మారడానికి దారితీసిన ఆ పరిస్థితులేమిటి అనే అంశాలతో ఈ చిత్రాన్ని దర్శకుడు బక్కియరాజ్ కణ్ణన్ ఉత్కంఠభరితమైన కథనంతో తీర్చిదిద్దినట్లు టీజర్ ద్వారా అర్థమవుతోంది. టైటిల్ రోల్లో కార్తీ అదరగొడుతున్నారు.
హీరోయిన్ రష్మిక ఓ పల్లెటూరి యువతి క్యారెక్టర్లో దర్శనమివ్వనున్నారు. ‘కేజీఎఫ్ చాప్టర్ 1’లో విలన్ గరుడగా పరిచయమై ఆకట్టుకున్న రామచంద్రరాజు ఈ సినిమాలో ఓ విలన్‌గా కనిపించనున్నారు. తమిళ సీనియర్ యాక్టర్ నెపోలియన్, మలయాళం పాపులర్ యాక్టర్ లాల్ పాత్రలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఎప్పట్లా యోగిబాబు నవ్వులు పండించనున్నట్లు తెలుస్తోంది.
వివేక్ మెర్విన్ బ్యాగ్రౌండ్ స్కోర్, సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీతో టీజర్ ఉత్తేజభరితంగా ఉండి, సుల్తాన్‌పై క్యూరియాసిటీని పదింతలు పెంచేసిందనడంలో సందేహం లేదు.
తారాగణం:
కార్తీ, రష్మికా మందన్న, యోగిబాబు, నెపోలియన్, లాల్
సాంకేతిక బృందం:
రచన-దర్శకత్వం: బక్కియరాజ్ కణ్ణన్
నిర్మాతలు: యస్.ఆర్. ప్రకాష్ బాబు, యస్.ఆర్. ప్రభు
బ్యానర్: డ్రీమ్ వారియర్ పిక్చర్స్
సినిమాటోగ్రఫీ: సత్యన్ సూర్యన్
మ్యూజిక్: వివేక్ మెర్విన్
ఎడిటింగ్: రూబెన్
ప్రొడక్షన్ డిజైనర్: రాజీవన్
ఆర్ట్: జయచంద్రన్
స్టంట్స్: దిలీప్ సుబ్బరాయన్
కొరియోగ్రఫీ: బృంద, శోబి, దినేష్, కల్యాణ్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అరవేందురాజ్ భాస్కరన్
క్రియేటివ్ ప్రొడ్యూసర్: తంగ ప్రభాకరన్ ఆర్.
సాహిత్యం: రాకేందు మౌళి, చంద్రబోస్, కృష్ణకాంత్, శ్రీమణి
డైలాగ్స్: రాకేందు మౌళి
పీఆర్వో: వంశీ-శేఖర్.