Karthikeya Interview
ఎలాంటి సినిమాలు చేయాలో, ఎలాంటివి చేయకూడదో నాకు బాగా క్లారిటీ ఉంది – `కార్తికేయ`
`RX 100` ఫేమ్ కార్తికేయ హీరోగా నటించిన చిత్రం `హిప్పీ`. స్టార్ ప్రొడ్యూసర్ కలైపులి థాను నిర్మాతగా, టీఎన్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రమిది. వీ క్రియేషన్స్ పతాకం పై రూపొందుతోంది. జూన్ 6న సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా హీరో కార్తికేయ ఇంటర్వ్యూ….
ఆర్.ఎక్స్.100 తర్వాత కథల ఎంపిక ప్రక్రియలో ఒత్తిడి ఫీలయ్యారా?
లేదండి. అసలు ఫీల్ కాలేదు. ఎందుకంటే ఎలాంటి సినిమాలు చేయాలో, ఎలాంటివి చేయకూడదో నాకు బాగా క్లారిటీ ఉంది. అందులో కన్ ఫ్యూజన్ ఎప్పుడూ లేదు.నాకు నచ్చిందే నేను 100 శాతం నమ్మి చేశాను.
రొమాంటిక్ సీన్లు ఇందులోనూ ఉన్నాయి. మీ నుంచి యువత ఎక్స్ పెక్ట్ చేస్తారని ఏమైనా చేస్తున్నారా?
అలాగని కాదు. నిజానికి రొమాంటిక్ సీన్లు అందరు చేసినా, కొందరినే బాగా యాక్సెప్ట్ చేస్తారు. నన్ను అలా యాక్సెప్ట్ చేశారు. నాకు అలాంటి ప్లేస్ ఇచ్చి, నన్ను గౌరవించినప్పుడు నేను ఆ విషయాన్ని గొప్పగానే ఫీలవుతున్నా. రొమాంటిక్ సీన్లు ఆర్.ఎక్స్100లో వేరుగా ఉంటాయి. ఇందులో వేరుగా ఉంటాయి. అయినా నా వయసుకు నాకు ఎక్కువగా లవ్‌స్టోరీలే వస్తాయి. వాటిలో రొమాంటిక్ మొమెంట్స్ ఉంటాయి. అలాంటి సందర్భాల్లో లిప్‌లాక్‌లు చేయాలి. అలా కాకుండా పాత కాలంలో లాగా గొడుగు అడ్డం పెట్టేసినట్టు చూపిస్తే బావుండదు కూడా. అందుకే నేను రియలిస్టిక్ సినిమా, నేచురల్ సినిమా చేయాలని అనుకున్నప్పుడు అది కూడా అందరికీ కనెక్ట్ అయ్యేలాగే ఉండాలి.
పలు గెటప్స్ ఉన్నట్టున్నాయి ?
హిప్పీ గా ఉండే టైమ్ లో లాంగ్ హెయిర్ గెటప్ ఉపయోగపడింది. కేర్ ఫ్రీ యాటిట్యూడ్ నచ్చింది చేస్తాడు. వంటివన్నీ ఆ గెటప్ తోనే ఎస్టాబ్లిష్ అయింది.కిక్ బాక్సర్, గిటారిస్ట్ ని చూపించాలనుకున్నప్పుడు ఇంకో గెటప్ కనిపిస్తుంది.స్టాప్ వేర్ గెటప్ ఉంది. బాల్డ్ హెడ్ లుక్ ఒకటి ఉంది. ఇంకో గెటప్ కూడా ఉంది. అది సర్ ప్రైజ్ అన్నమాట. మెయిన్ గెటప్ లు రెండు , మిగిలినవి సస్పెన్స్. నా రెండో సినిమాకే ఇన్ని గెటపులు చేయడం ఆనందంగా ఉంది. సినిమా ఒప్పుకోవడానికి మెయిన్ రీజన్లలో గెటప్పులు ఉండటం కూడా ఒకటి.
గెటప్ కావాలని చేసుకుంటారా? లేకుంటే లైఫ్ స్పాన్ ఉంటుందా?
కథలో భాగంగా కొన్ని వస్తాయి. కొన్ని ఇమేజినేషన్‌లో వస్తుంటాయి.
దర్శకుడికి ఈ మధ్య సినిమాలేమీ లేవు. మరి ఎలా అంగీకరించారు?
ఆయన నువ్వు నేను ప్రేమ చేశారని ఈ సినిమా ఒప్పుకోలేదు. కథ నచ్చాలి. కథ చెప్పే తీరు నచ్చాలి. వాళ్లు ఆ కథను హ్యాండిల్ చేస్తారనే నమ్మకం రావాలి. అవి ఉంటే చాలు. నేను సినిమాను అంగీకరించడానికి. టోటల్ కొత్త దర్శకులనే నేను అంతగా నమ్ముతున్నప్పుడు ఓ సినిమాను తీసిన వ్యక్తిని ఇంకెంత నమ్ముతానో ఆలోచించండి. ఆయన కథ చెబుతాను అని అన్నప్పుడు `ఏమాయచేసావె` తరహా కథ చెబుతారేమోనని అనుకున్నా. కానీ ఆయన కథ చెబుతుంటే ఫుల్ ఎనర్జీ, ఫుల్ కామెడీ ఉంది స్క్రిప్టులో. ఆర్.ఎక్స్.100కీ, దీనికీ సంబంధం లేదు. కానీ చాలా జోష్‌ఫుల్ సినిమా ఉంటుంది. వినగానే చాలా హ్యాపీగా అనిపించింది. అక్కడే నాకు ఆయన మీద మంచి ఇంప్రెషన్ వచ్చింది.
ఆర్.ఎక్స్.100 ఆరా కంటిన్యూ అవుతోందా ?
లేదండి . పాతికేళ్లు నేను మామూలుగానే ఉన్నా, ఆర్.ఎక్స్.100 సినిమా విడుదలై 11 నెలలు కూడా కాలేదు. ఇప్పుడు ఎవరైనా నన్ను గుర్తుపడితే నాకు అదో ఆనందం. ఎందుకంటే చిన్న చిన్న ఆర్టిస్టులను కూడా ఎగ్జయిట్ అయ్యేరకం నేను. నేను చిన్నప్పటి నుంచీ సినిమాల్లో పెరగలేదు. అందుకే సినిమా అంటే ఎగ్జయిట్ మెంట్ కొనసాగుతోంది.నన్ను
ఎవరైనా గుర్తుప్టినా చాలా ఆనందంగా అనిపిస్తుంటుంది.
గ్యాంగ్‌లీడర్ షూటింగ్ ఎంత వరకు వచ్చింది ?
ఆగస్టు 30 విడుదల కదా. చాలా వరకు షూటింగ్ పూర్తయింది.
మీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని ఫీలవుతున్నారా ?
అలాంటి డ్యామేజ్ ఏదీ జరగదు. ఎందుకంటే అలాగే కావాలని ఆడియన్స్ కోరుకుంటున్నారు. అదర్ లాంగ్వేజెస్లో ఆర్టిస్టులు ఇప్పటికే ఇలా చేస్తున్నారు. చేయాలి కూడా. ఒకప్పుడు చిరంజీవిగారు 20 ఏళ్లు హీరోగానే చేయాలని కోరుకున్నారు జనాలు. కానీ ఇప్పుడు ఆడియన్స్ రెండు, మూడు సినిమాల తర్వాత `అబ్బే బోర్ కొడుతోంది` అని అంటున్నారు. టేస్టులు మారిపోయాయి. తమిళ్‌లో విజయ్‌సేతుపతి చాలా పెద్ద మాస్ హీరో. ఆయనతో పోలిస్తే నథింగ్ మనం. ఆయన విలనీ చేస్తున్నారు. కామెడీ చేస్తున్నారు. తెలుగులో వైష్ణవ్ తేజ్ సినిమాలో హీరోయిన్ ఫాదర్‌గా నటిస్తున్నారు.
ఇందులో బాక్సర్ కదా. మీరు నేర్చుకున్నారా?
నేను జనరల్ హీరో అవుతున్నానని అనుకున్నప్పుడు కొంచెం మార్షల్ ఆర్ట్స్ వంటిన్నీ నేర్చుకున్నా. ఈ సినిమా చేసేటప్పుడు మూడు నెలలు ముందు నేర్చుకున్నా.
శాడ్ ఎండింగా ?
దర్శకుడి లైఫ్ లో జరిగిన విషయాలే కాదు. అందరి జీవితాల్లో జరిగినవీ ఇందులో ఉంటాయి. 15 ఏళ్లు పూర్తయిన ఏ అబ్బాయికైనా ముగ్గురు నలుగురు అమ్మాయిలు అప్పటికే నచ్చేసి ఉంటారు. అప్పటిదాకా అబ్బాయిని వెంట తిప్పించుకుని ఊరించి అమ్మాయి, నిజంగా అతనికి పడితే ఆ తర్వాత అతనికి పెద్ద కిక్కు ఉండదు. అందుకే అమ్మాయి పడనంత వరకు ప్యారడైజే పడితేనే లాస్ట్. ఆ విషయాన్ని డైరెక్టర్ గా హీరో , హీరోయిన్ల చేత నేరుగా చెప్పించేశాం కొత్తగా ఉంటుంది.
ఆర్.ఎక్స్.100ని మళ్లీ మీతో చేయమంటే చేస్తారా?
అజయ్ చేస్తే చేస్తానేమో, అయినా అప్పుడున్న మేజిక్ ఇప్పుడు సెట్లో మళ్లీ వస్తుందో రాదో. బహుశా చేయనేమో.
ఈ సినిమాను మల్టీస్టారర్ సినిమా అని అనుకోవచ్చా?
ఇందులో హీరో, హీరోయిన్లు అని ప్రత్యేకంగా ఏమీ ఉండరు. ఇది ఖచ్చితంగా మల్టీస్టారరే. ఎక్కడా హీరో ఎలావేషన్, క్యారెక్టర్ ఎలివేషన్ అన్నట్టు ఉండదు. అందరూ ఎలివేట్ అవుతారు. ఎక్కువసేపు నేను కనిపిస్తాను కాబట్టి, నన్ను హీరో అంటారంతే. మిగిలిన వాళ్లందరూ ఇంపార్టెంటే. నా సినిమాల్లో అన్ని క్యారెక్టర్లూ అలాగే ఉండాలని కోరుకుంటా.
నెక్స్ట్ మూవీస్ ఏంటి?
నాని సినిమా ఉంది. దాని తర్వాత గుణ ఉంది. ఆ తర్వాత శేఖర్ రెడ్డి అనే కొత్త దర్శకుడితో ఒక సినిమా , శ్రీ సరిపల్లి అని ఒక దర్శకుడితో సినిమా ఉంది.