karan arjun movie review

karan arjun movie review

క‌ర‌ణ్ అర్జున్ మూవీ రివ్యూ!

       

 మ‌హాభార‌తంలోని క‌ర్ణుడు, అర్జునుడు పాత్రల్లోని ఎమోష‌న్స్ ని తీసుకుని నేటి ట్రెండ్ కి త‌గ్గ‌ట్టుగా తెర‌కెక్కించిన చిత్రం `క‌ర‌ణ్ అర్జున్‌`.  ట్రైల‌ర్ తో ఇంట్ర‌స్టింగ్ క్రియేట్ చేసి విడుద‌ల‌కు ముందే బ‌జ్ తెచ్చుకున్న సినిమా ఈ శుక్ర‌వారం విడుద‌లైంది. మ‌రి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూ ద్వారా తెలుసుకుందాం…
   క‌థ‌
 ప్రీ వెడ్డింగ్ కోసం క‌ర‌ణ్, వృషాలి డిఫ‌రెంట్ లొకేష‌న్స్ కోసం రాజ‌స్థాన్ లోని జై స‌ల్మేర్ వెళుతుంటారు. మార్గం మ‌ధ్యలో ఒక అప‌రిచితుడు వీరిద్ద‌ర్నీ ఎటాక్ చేసి బంధిస్తాడు. అస‌లు ఆ అప‌రిచితుడు ఎవ‌రు?  వాళ్ల‌కు అత‌డికి సంబంధం ఏమిటి? ఆ త‌ర్వాత క‌థ ఎలాంటి మ‌లుపులు తిరిగింది అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
         
 విశ్లేష‌ణః
 ఇటీవ‌ల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో ప్రీ వెడ్డింగ్ సాంగ్స్ చేయ‌డ‌మ‌నే కొత్త ట్రెండ్ మొద‌లైంది.  అలా ఒక ఇంట్ర‌స్టింగ్ పాయింట్ ని తీసుకుని అద్భుత‌మైన లొకేష‌న్స్ లో ఎంతో రిస్క్ చేసి షూటింగ్ చేసిన‌ట్లు సినిమా చూస్తే అర్థ‌మ‌వుతుంది. లొకేష‌న్స్ తో పాటు చేజింగ్ సీన్స్ గూస్ బంప్స్ క‌లిగించేలా ఉన్నాయి. ఇక క‌ర‌ణ్‌, వృషాలిని అర్జున్ రోడ్ లో వెంబ‌డించే సీన్స్ ఎంతో నేచ‌ర‌ల్ గా ఆస‌క్తిక‌రంగా చిత్రీక‌రించారు. ఇక క‌ర‌ణ్‌ని అర్జున్ వెంబ‌డించాడినికి గ‌ల కార‌ణం రివీల్ చేసే స‌న్నివేశాలు ద‌ర్శ‌కుడు చాలా బాగా రాసుకున్నాడు. అతి ఎప్పుడైనా ప్ర‌మాద‌క‌ర‌మే అనే అంశాన్ని ద‌ర్శ‌కుడు అద్భుతంగా చూపించాడు. అమ్మ‌నైనా. అమ్మాయినైనా అతిగా ప్రేమిస్తే ఏం జ‌రుగుతుంది? చ‌చ్చేంత ప్రేమ‌, చంపేంత ప్రేమ మ‌నిషికి అవ‌స‌రమా అనే పాయింట్ ప్ర‌తి ఒక్క‌రినీ ఆలోచిపంజేసేలా చేస్తుంది. ప్ర‌తి టెక్నీషియ‌న్ త‌మ బెస్ట్ ఇవ్వ‌డానికి ప్ర‌య‌త్నించారు. అలాగే ఇద్ద‌రు హీరోలు రెండు డిఫ‌రెంట్ పాత్ర‌ల్లో మెప్పించారు. హీరోయిన్ అందంతో పాటు అభిన‌యంతో ఆక‌ట్టుకుంది. ఎక్క‌డా బోర్ కొట్ట‌కుండా మూడు పాత్ర‌ల‌తో ద‌ర్శ‌కుడు సినిమాను ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా మ‌ల‌చ‌డంలో స‌క్సెస్ అయ్యాడు.  త‌న‌కు మంచి బ‌డ్జెట్ తో పాటు స్టార్ హీరోల‌ను ఇస్తే టాలీవుడ్ లో మంచి డైర‌క్ట‌ర్ గా పేరు తెచ్చుకుంటాడు.  డిఫ‌రెంట్ బ్యాక్ డ్రాప్ లో ఇంట్ర‌స్టింగ్ సినిమా చూడాలి అనుకునే వారికి క‌ర‌ణ్ అర్జున్ కచ్చితంగా న‌చ్చుతుంది. 
 
రేటింగ్: 3/5
న‌టీన‌టులుః
అభిమన్యు, నిఖిల్ కుమార్, షిఫా, మాస్ట‌ర్ సునీత్, అనితా చౌదరి,
రఘు.జి, జగన్, ప్రవీణ్ పురోహిత్, మోహిత్, వినోద్ బాటి, ప్రసన్..
సాంకేతిక నిపుణులు:
నిర్మాతలు: డా. సోమేశ్వ‌ర‌రావు పొన్నాన,
బాలక్రిష్ణ ఆకుల, సురేష్, రామకృష్ణ, క్రాంతి కిరణ్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రవి మేకల
కథ -మాటలు -స్క్రీన్ ప్లే- ద‌ర్శ‌క‌త్వం: మోహన్ శ్రీవత్స
ఫైట్స్: రామ్ సుంకర
ఎడిటర్: కిషోర్ బాబు
మ్యూజిక్: రోషన్ సాలూర్
పాట‌లుః సురేష్ గంగుల‌
కొరియోగ్రఫీ: రవి మేకల
డి .ఓ .పి: మురళి కృష్ణ వర్మన్