Kanchana 3 Movie Review
Kanchana 3 Movie Review
కాంచన సినిమా రివ్యూ!!
రేటింగ్ః 2.75
ఆర్టిస్ట్స్ః
రాఘవ లారెన్స్, కోవై సరళ, వేదిక ఓవియా తదితరులు
టెక్నీషియన్స్ః
డైరక్షన్ః రాఘవ లారెన్స్
సంగీతంః యస్ తమన్
నిర్మాతః కళానిధి మారన్
సినిమాటో గ్రఫీః వెట్రీ
విడుదల తేతి 19-4-2019
రేటింగ్ః 2.75
ముని సిరీస్‌లలో భాగంగా వచ్చిన లెటెస్ట్ సినిమా `కాంచన -3`. రాఘవ లారెన్స్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఓవియా, వేదిక హీరోయిన్స్ గా నటించారు. ఈ రోజు విడుదలైన కాంచన 3 చిత్రం వరుసగా వచ్చిన కామిక్ థ్రిల్లర్ లా ప్రేక్షకులను భయపెడుతూ న వ్వించిందా? లేక నవ్విస్తూ భయ పెట్టిందా తెలియాలంటే రివ్యూలోకి వెళదాం…
కథ విషయానికొస్తే…
మొదటి నుంచి తల్లి ని ఎంతో ఇష్టపడే రాఘవ లారెన్స్ ఈ సారి తల్లి పై ఒక కాన్సెప్ట్ తీసుకుని కాంచన 3 చిత్రాన్ని రూపొందించాడు. ఇక కథలోకి వెళితే.. కాళీ (లారెన్స్) తన తల్లి ప్రభావంతో తన లైఫ్‌ని పక్కవారి కోసం త్యాగం చేస్తూ…అనాథ పిల్లల కోసం ఒక ఆశ్రమాన్ని రన్ చేస్తుంటాడు. ఆ ఆశ్రమం ద్వారా డబ్బు సంపాదించాలని ప్లాన్ వేస్తారు కొంత మంది పొలిటీషియన్స్. కానీ కాళీ ఒప్పుకోడు. దీంతో కాళీ ని చంపేస్తారు. ఆ కాళీ దెయ్యంలా మారి హీరో రాఘవ లోకి ప్రవేశిస్తాడు. కాళీ తన పగను ఎలా తీర్చుకున్నాడు ఏంటి అన్నది సినిమా కథాంశం.
ప్లస్ పాయింట్స్ః
రాఘవ లారెన్స్ నటన, డైరక్షన్
తమన్ సంగీతం,
సినిమాటోగ్రఫీ
గ్రాఫిక్స్
హీరోయిన్స్ అందం,అభినయం
మైనస్ పాయింట్స్ః
రెగ్యులర్ హరర్ కాన్సెప్ట్
ఫస్టాప్ సాగతీత
తమిళ్ నేటివిటీ ఎక్కువగా ఉండటం
విశ్లేషణలోకి వెళితే..
మొదటి నుంచి లారెన్స్ హారర్ కామెడీతో ముని సిరీస్ లు చేస్తూ సినిమాలు సక్సెస్ కొడుతూ వస్తున్నాడు. అందులో భాగంగా వచ్చిన సినిమానే `కాంచన-3`. భయపెడుతూ , నవ్విస్తూ, నవ్విస్తూ భయపెడుతూ సినిమాను ఆద్యంతం ఆసక్తికరంగా తీసుకెళ్లాడు. దీనికి తోడు మంచి ఎమోషనల్ సీన్స్ కూడా జోడించాడు. ఇక ఎప్పటి తీరుగానే తన నటనతో ఆకట్టుకున్నాడు లారెన్స్. అలాగే డైరక్షన్ పరంగా కూడా తన ప్రతిభను చూపించే ప్రయత్నం చేసాడు. హీరోయిన్స్ వేదిక, ఓవియా అందంతో పాటు, అభినయం పరంగా కూడా ఆకట్టుకున్నారు. రొమాంటిక్ సీన్స్ తో పాటు హర్రర్ సన్నివేశాలను కూడా రక్తి కట్టించారు. ఎప్పటిలాగే తల్లి పాత్రలో కోవై సరళ తనదైన శైలిలో నవ్విస్తుంది. హర్రర్, కామెడీ సీన్స్ ఆకట్టకున్నప్పటికీ …అక్కడ క్కడక్కడా స్ర్కీన్ ప్లే గాడీ తప్పడంతో ఫ్లో మిస్సైన ఫీలింగ్. అలాగే కాంచన గతంలో వచ్చిన రెండు పార్ట్స్ లో స్ర్కీన్ ప్లే ని అనుసరించడంతో కొన్ని సీన్స్ చూసిన ఫీలింగ్ కలుగుతుంది.
పైనల్ గా చెప్పాలంటే…తమిళ నేటివిటీ ఎక్కువైందన్న ఫీలింగ్ వచ్చినా, మాస్ ఆడియన్స్ కు నచ్చే మసాలా చాలా ఉంది. రెగ్యులర్ కాన్సెప్ట్ అనిపించినా కాలక్షేపం చేయించే కామెడీ, హర్రర్ ఎలిమెంట్స్ మెండుగా ఉన్నాయి. సో లారెన్స్ నటన, డాన్స్, తో పాటు, హీరోయిన్స్ అందం, అభినయం, తమన్ సంగీతం కోసం మూడో కాంచనను కూడా గాంచవచ్చును.