Kajal Aggarwal inaugurated South Central Mall in Anakapalle

అనకాపల్లిలో చందమామ సందడిహీరోయిన్ కాజల్ చేతుల మీదుగా సౌత్ సెంట్రల్ షాపింగ్ మాల్ ప్రారంభం
అనకాపల్లి: విశాఖ రూరల్ జిల్లా ప్రధాన కేంద్రమైన అనకాపల్లి పట్టణంలో ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థ సౌత్ సెంట్రల్ తన నూతన వ్యాపార శాఖను బుధవారం నాడు ప్రారంభించింది. ప్రముఖ సినీహీరోయిన్ కాజల్ అగర్వాల్ ముఖ్య అతిధిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలనతో షోరూమ్ ప్రారంభించారు. మాజీ మున్సిపల్ చైర్మన్ కొణతాల జగన్నాథరావు నాయుడు (జగన్) రిబ్బన్ కట్ చేశారు. ఈ కార్యక్రమానికి అతిధిగా విచ్చేసిన మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ డా.కె.విష్ణుమూర్తిలను సంస్థ చైర్మన్ మామిడి వెంకటేశ్వరరావు, ఎండీ మామిడి రాజవరహాలు, మేనేజింగ్ పార్టనర్స్ దొడ్డి వెంకట సునీల్, మామిడి సూర్య, మామిడి తేజ, మామిడి చైతన్య లు అతిధులకు ఘనస్వాగతం పలికి పూలబొకేలతో సత్కరించారు.
ఈ సందర్భంగా కాజల్ మాట్లాడుతూ.. అనకాపల్లి ప్రజలందరికీ నమస్కారం అంటూ ముందుగా తెలుగులో నగర ప్రజల్ని ఉత్సాహపరిచారు. సాల్ట్ నుంచి 1 గ్రామ్ గోల్డ్ వరకూ అన్ని రకాల బంగారు ఆభరణాలు ఒకేచోట లభ్యమవ్వడం వినియోగదారులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని కాజల్ అన్నారు. దేశవ్యాప్తంగా నాణ్యమైన వస్త్రాలు ఇతర బ్రాండ్ల వస్తువులు ఇక్కడ సరసమైన ధరలకే అందుబాటులో ఉంటాయని చెప్పారు. సంస్థ ఛైర్మన్ మామిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. రానున్న క్రిస్మస్ నూతన సంవత్సరం సంక్రాంతి పండగల సందర్భంగా మా షోరూమ్ లో అన్ని రకాల వస్తువులపై ప్రత్యేకమైన రాయితీలు అందజేస్తున్నామని తెలిపారు. అలాగే పట్టణ పోలీసులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ.. స్త్రీల పట్ల హింసకు వ్యతిరేకంగా అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
కాగా ఉదయం 9 గంటల నుంచే కాజల్ ని చూసేందుకు షోరూమ్ వద్దకు జనం తండోపతండాలుగా తరలి రావడంతో పట్టణ సీఐ లంకా భాస్కరరావు ఆధ్వర్యంలో తన సిబ్బంధితో పటిష్టంగా బంధోబస్త్ ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని విజయవంతంగా జరిగేలా కృషి చేశారు.