జాతీయ రహదారి మూవీ రివ్యూ!!
జాతీయ రహదారి మూవీ రివ్యూ!!
నిర్మాత :- తుమ్మలపల్లి రామసత్యనారాయణ.
ఎడీటర్ :; వి నాగిరెడ్డి,
రచన దర్శ కత్వం :; నరసింహ నంది…
సమర్పణ.:- సంధ్య స్టూడియోస్ రవి కనగల.
సినిమాటొగ్రఫి :- యస్ మురలి మొహన్ రెడ్డి,
సంగీతం :- సుక్కు,
పాటలు :;- మౌన శ్రీ మల్లిక్,
నటి నటులు: మధు చిట్టె ,సైగల్ పాటిల్ , మమత, ఉమాభారతి, మాస్టర్ నందిరెడ్డి. ధక్షిత్ రెడ్ది, అభి, తెల్జెరు మల్లెష్ తదితరులు ..
విడుదల : 10 – 09- 2021
రేటింగ్ : 3 / 5
భీమవరం టాకీస్ పతాకంపై మధుచిట్టి, సైగల్ పాటిల్,మమత,ఉమాభారతి,మాస్టర్ దక్షిత్ రెడ్డి, అభి, శ్రీనివాస్ పసునూరి నటీనటులుగా నరసింహనంది దర్శకత్వంలో తుమ్మలపల్లి రామ సత్యనారాయణ నిర్మించిన చిత్రం “జాతీయ రహదారి”. కరోనా కష్టకాలంలో సామాన్య మనుషుల నేపథ్యంలో వారి ఎమోషన్లకు అద్దం పట్టేలా తెరకెక్కించిన జాతీయ రహదారి గురించి తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే ..
స్టోరిః
హీరో మధు చిట్టి ఒక పల్లెలూరి కుర్రాడు. అతని భార్య సైగల్ పాటిల్. వీరిద్దరికి ప్రేమ పెళ్లి, ఒకరంటే ఒకరు ప్రాణంగా ప్రేమించుకుని ఆ తరువాత పెళ్లి చేసుకుని అందరికి దూరంగా ఓ పల్లెటూరిలో కాపురం ఉంటారు. ఆ తరువాత వీరికి ఓ బాబు. ఊరిలో పనుల్లేక ఇబ్బందులు పడుతున్న సమయంలో హైద్రాబాద్ లో పనికోసం బయలుదేరతాడు హీరో మధు. ఆ తరువాత అక్కడ రకరకాల కష్ఠాలు పడుతూ ఇంటికి డబ్బు పంపిస్తూ ఉంటాడు… అలా జరుగుతున్న సమయంలో అందరి జీవితాలను అతలాకుతలం చేసిన కరోనా వీళ్ళను వెంటాడుతుంది. కరోనా లాక్ డౌన్ ప్రకటించడంతో సొంత ఊరికి వెళ్ళడానికి అతడు పడుతున్న ఇబ్బందులు, మరోవైపు అతనికోసం భార్య , కొడుకు ఆరాటం నేపథ్యంలో జరుగుతున్న సమస్యలేమిటి ? అసలు తన సొంతూరు వెళ్లేందుకు అతడు జాతీయ రహదారిపై నడక సాగించాడా అన్నది మిగతా కథ !
ఆర్టిస్ట్స్ పర్ఫార్మెన్స్ః
హీరోగా నటించిన మధు చిట్టె నటుడిగా తనదైన మార్క్ చూపించాడు. సహజమైన నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేసాడు. ముఖ్యంగా వలస కూలీల బతుకులు ఎలా సాగుతాయి అన్నది చాలా దగ్గరగా చూపించే ప్రయత్నం చేసాడు. అలా జేర్పుఓం సైగల్ పాటిల్ రెండు షేడ్స్ లో చక్కగా నటించింది. ముక్యంగా పెళ్లికి ముందు ప్రియురాలిగా… పెళ్లి తరువాత భార్యగా రెండు వేరియషన్ చూపిస్తూ ఆకట్టుకుంది. ఇక మిగతా పాత్రల్లో మమత, ఉమాభారతి, మాస్టర్ నందిరెడ్డి. ధక్షిత్ రెడ్ది, అభి, తెల్జెరు మల్లెష్, తరని,గొవిందరాజు, ఘర్షణ శ్రీనివాస్., విజయ భాస్కర్, సిద్దిపెట రవి వారి వారి పాత్రల్లో ఆకట్టుకున్నారు.
సాంకేతిక నిపుణుల పనితీరుః
ఈ సినిమా టెక్నీకల్ హైలెట్స్ విషయానికి వస్తే ఈ చిత్రానికి సినిమాటొగ్రఫి అందించిన యస్ మురలి మొహన్ రెడ్డి కెమెరా పనితనం బాగుంది. చాలా సన్నివేశాల్లో ఫీల్ కలిగించేలా చిత్రీకరించాడు. ఇక ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ సంగీతం. సుక్కు అందించిన సంగీతం సినిమాకు ప్రాణం పోసింది. ముక్యంగా ఆర్ ఆర్ సినిమాకు అదనపు ఆకర్షణ. చాలా సన్నివేశాలను ఎలివేట్ చేసేలా ఆర్ ఆర్ అదిరిపోయింది. ఇక ఎడీటర్ వి నాగిరెడ్డి కత్తెరకు పనిచెప్పాల్సిన సన్నివేశాలు ఉన్నాయి. ఇక దర్శకుడు నరసింహ నంది గురించి కొత్తగా చెప్పేది ఏముంది.. రియలిస్టిక్ కథలతో ఆకట్టుకునే కథనంతో తనదైన శైలి లో సినిమాలు తీస్తూ మంచి ఇమేజ్ తెచ్చుకున్న నరసింహ నంది తెరకెక్కించిన మరో ఎమోషనల్ సినిమా జాతీయ రహదారి. రియలిస్ట్ అంశాలతో తెరకెక్కిన ఈ సినిమా విషయంలో నిర్మాణ విలువలు బాగున్నాయి.
చివరగా :
నరసింహ నంది దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మాణంలో వచ్చిన మరో మంచి చిత్రం `జాతీయరహదారి`. కరోనా లాక్ డౌన్ పరిస్టితుల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా చాలా సన్నివేశాలు కళ్ళకు కట్టినట్టు చూపించారు. ముఖ్యంగా వలస కూలీలా జీవితం ఎలా మారింది. వారి పరిస్థితి ఎలాంటి మలుపులు తిరిగింది అన్న కోణంలో దర్శకుడు ఎంచుకున్న కథ అందరిని కట్టిపడేస్తుంది. ఈ సినిమాకు మాటలు, మ్యూజిక్, ఫోటోగ్రఫి ప్రధాన ఆకర్షణ గా నిలుస్తాయి. రియలిస్టిక్ అంశాలతో చిత్రాలను తెరకెక్కించే నరసింహ నంది మరోసారి చేసిన మరో గొప్ప ప్రయత్నం ఇది. ఎమోషనల్ చిత్రంగా తెరకెక్కిక ఈ చిత్రం కచ్చితంగా అందరి మనసులను హత్తుకుంటుంది. సో డోంట్ మిస్ దిస్ వీక్.. గో అండ్ వాచ్.