INDHAVI movie release on 18th December

ఈ నెల 18న నందు హారర్ థ్రిల్లర్ ”ఐందవి” విడుదల
నందు హీరోగా నటించిన కొత్త సినిమా ‘ఐందవి’. హారర్ థ్రిల్లర్ కథతో ఈ సినిమా తెరకెక్కించారు దర్శకుడు ఫణిరామ్ తుఫాన్. సన్నీ అండ్ విన్నీ సినిమాస్ పతాకంపై శ్రీధర్ లింగం నిర్మించారు. అనురాధ నాయికగా నటించిన ఈ చిత్రంలో ఛత్రపతి శేఖర్, దిలీప్, అవంతిక ఇతర కీలక పాత్రలు పోషించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘ఐందవి’ సినిమా ఈ నెల 18న థియేటర్ లలో విడుదలకు సిద్ధమవుతోంది.
ఈ సందర్భంగా నిర్మాత శ్రీధర్ లింగం మాట్లాడుతూ….లాక్ డౌన్ ముందే మా సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. థియేటర్లు లేకపోవడంతో ఇన్నాళ్లూ ఆగాం. సినిమాను థియేటర్ లో చూస్తే వచ్చే అనుభూతి వేరు. అందుకే కొంత ఆలస్యమైనా మంచి థియేటర్ లలో ఐందవి సినిమాను విడుదల చేస్తున్నాం. హారర్ థ్రిల్లర్ కథతో సినిమా సాగుతుంది. జన సంచారం లేని ప్రాంతంలో సరదాగా కొన్ని రోజులు గడుపుదామని ఆరుగురు వ్యక్తులు వెళ్తారు. ఆ ప్రాంతంలో వారు ఒకరి తర్వాత ఒకరు హత్యలకు గురవుతారు. ఆ హత్యలు చేసిందెవరు, ఐందవికి ఈ హత్యలకు సంబంధం ఏంటి అనేది కథాంశంగా ఉంటుంది. సవారి సినిమా తర్వాత నందు ఫర్మార్మెన్స్ బాగా చేసిన చిత్రమిది. అన్నారు.
ఈ చిత్రానికి సంగీతం – ఎస్ఏ ఆర్మాన్, సినిమాటోగ్రఫీ – భరత్ సి కుమార్, సమర్పణ – రాజేశ్వరి తుమ్మల