ఒక యాక్టర్ గా అన్ని రకాల పాత్రలు చేస్తూ ఎప్పటికప్పుడు నన్ను నేను సిల్వర్ స్క్రీన్ పై కొత్తగా చూడాలనుకుంటున్నాను. – హీరో అనురాగ్

ఒక యాక్టర్ గా అన్ని రకాల పాత్రలు చేస్తూ ఎప్పటికప్పుడు నన్ను నేను సిల్వర్ స్క్రీన్ పై కొత్తగా చూడాలనుకుంటున్నాను. – హీరో అనురాగ్

ఒక యాక్టర్ గా అన్ని రకాల పాత్రలు చేస్తూ ఎప్పటికప్పుడు నన్ను నేను సిల్వర్ స్క్రీన్ పై కొత్తగా చూడాలనుకుంటున్నాను. – హీరో అనురాగ్
 
‘రాగల 24 గంటల్లో’ చిత్రంతో  పరిచయమయ్యి  మొదటి చిత్రంతోనే నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో అనురాగ్. ప్రస్తుతం ప్ర‌ముఖ ద‌ర్శకుడు`ఢ‌మ‌రుకం` ఫేమ్ శ్రీనివాస‌రెడ్డి స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణలో రూపొందిన చిత్రం ‘రాధాకృష్ణ‌’. అనురాగ్‌, ముస్కాన్ సేథీ (పైసా వ‌సూల్ ఫేమ్‌) హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో నంద‌మూరి లక్ష్మీ పార్వతి ఒక కీల‌క‌పాత్ర‌ పోషించారు. టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వహించిన ఈ చిత్రాన్ని హ‌రిణి ఆరాధ్య‌ క్రియేష‌న్స్ ప‌తాకంపై పుప్పాల సాగ‌రిక కృష్ణ‌కుమార్‌ నిర్మించారు.  ఫిబ్ర‌వ‌రి 5న సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యి సక్సెస్ ఫుల్ టాక్ తో రన్ అవుతోంది. ఈ సందర్భంగా హీరో అనురాగ్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..

సినిమా ఎలా స్టార్ట్ అయ్యింది. యాక్టర్ గా మీ ప్రయాణం ఎలా మొదలైంది ?
ఇండస్ట్రీలో అలీ గారు నాకు పరిచయం. ఆయన ద్వారా శ్రీనివాసరెడ్డి గారిని కలిశాం. నా గురించి ఆలీ గారు శ్రీనివాసరెడ్డి గారికి చెప్పారు. అప్పట్నుంచి వారితో నాకు మంచి సాన్నిహిత్యం మొదలైంది. వారు చెప్పడం వల్ల ‘రాగల 24 గంటల్లో’ సినిమాలోని ముగ్గురు హీరోల్లో ఒకరిగా చేశాను. నా యాక్టింగ్ బాగా నచ్చి నన్ను ‘రాధాకృష్ణ’ మూవీకి రికమండ్ చేశారు. అలా రాధాకృష్ణ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. శ్రీనివాసరెడ్డి గారి వల్ల ఈ సినిమా ఇప్పుడు ఇంత సక్సెస్ అయ్యింది.

మీ క్యారెక్టర్ గురించి విన్నప్పుడు మీరు ఎంత ఎగ్జైట్ అయ్యారు?
మెయిన్ లీడ్ క్యారెక్టర్ నన్ను చేయడమనడం నాకు పెద్ద విషయంగా అనిపించింది. ‘రాగల 24 గంటల్లో’ సినిమాలో నా క్యారెక్టర్ డ్యూరేషన్ తక్కువగా ఉంటుంది. రాధాకృష్ణ లో చేయమనగానే చాలా ఎగ్జైటింగ్ గా అనిపించింది. ఒక పక్క టెన్షన్గా ఉంది. మరోవైపు ఎగ్జైట్మెంట్. రాధాకృష్ణ సినిమాలో మంచి క్యారెక్టర్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది.

నిర్మల్ బొమ్మల బ్యాక్ డ్రాప్ లో సినిమా చేశారు?
నిర్మల్ బొమ్మల బ్యాక్ డ్రాప్ లో సినిమా చేయడాన్ని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నిర్మల్ బొమ్మల ప్రసిద్ధి గురించి ఇప్పటి వారికి అంతగా తెలియదు. ఈ సినిమా ద్వారా ఓ మంచి సందేశం నా ద్వారా వెల్లడం చాలా ఆనందంగా ఉంది.

ఈ సినిమా ద్వారా ఏం తెలుసుకున్నారు?
నిర్మల్ బొమ్మలను తయారు చేసే వారి కష్టం తెలిసింది. మన సంస్కృతిను కాపాడుకోవాలి. మాటల్లో చెప్పలేను వారి కష్టాన్ని. వారికి ఈ సినిమా ద్వారా పరోక్షం గా హెల్ప్ చేశామని మాకు అనిపిస్తోంది.

షూటింగ్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి?

అమేజింగ్ షూటింగ్ ఎక్స్పీరియన్స్. మన దగ్గర కూడ ఇంత మంచి  లొకేషన్స్ ఉన్నాయా? అనిపించింది. చిత్ర యూనిట్ అందరు బాగా సహకరించారు. శ్రీనివాస రెడ్డిగారి స్క్రీన్ ప్లే కు ఓ డిఫరెంట్ యాంగిల్ ఉంటుంది. కొత్త విషయాలను నేర్చుకున్నాను. ముస్కాన్ హార్డ్ వర్కింగ్ హీరోయిన్.

మీ సినిమాకు డైరెక్టర్, ప్రొడ్యూసర్ కొత్తవారు. సినిమా స్టార్టింగ్లో ఏమనిపించింది?
మేజర్ గా కొత్తవారు ఉన్నా….ఎక్స్పీరియన్స్ ఉన్నవారు కూడ ఉన్నారు. ప్రసాద్ అన్న శ్రీనివాసరెడ్డి గారి దగ్గర పనిచేశారు. ప్రసాద్ గారికి ఆ అనుభవం ఉంది కాబట్టి మా పని సులువు అయ్యింది. శ్రీలేఖ గారు మంచి సంగీతం అందించారు. చిన్న సినిమా అని ఆమె అనుకోలేదు. మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. థియేటర్లో సినిమాను చూసినప్పుడు ప్రేక్షకులు ఎమోషనల్ అయ్యారు. మేం కూడా భావోద్వేగానికి లోనయ్యాం. మా టీమ్ అంతా కష్టపడి మంచి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాం. చాలా ఆనందంగా ఉంది.

విజయశాంతిగారు మీ సినిమాలోని పాటను విడుదల చేశారు?
విజయశాంతి గారు మా సినిమాలోని ‘నిర్మల బొమ్మా’ సాంగ్  విడుదల చేశారు. ఆమెకు థ్యాంక్స్. విజయశాంతి గారిని చిన్నప్పుడు సినిమాల్లో, టీవీల్లో చూశాను. సాంగ్ రిలీజ్ చేయడానికి వెళ్లినప్పుడు ఆమె చాలా బాగా మాట్లాడారు. విజయశాంతి గారితో మాట్లాడిన మాటలను మర్చిపోలేను.

లక్ష్మీపార్వతిగారితో కలిసి నటించడం గురించి చెప్పండి?
లక్ష్మీపార్వతి గారు మా సినిమాలో నటిస్తారని మేం ఊహించలేదు. షూటింగ్ కి రెండు రోజుల ముందు మాకు తెలిసింది ఆమె చేస్తున్నారని. లక్ష్మీపార్వతి గారితో కలిసి  వర్క్ చేయడాన్ని నా అదృష్టంగా భావిస్తున్నాను.

మీ డ్రీమ్ రోల్ ఏంటీ?
ఒక యాక్టర్ గా అన్ని రకాల పాత్రలు చేయాలనుకుంటున్నాను. ఎప్పటికప్పుడు నన్ను నేను సిల్వర్ స్క్రీన్ పై కొత్తగా చూడాలనుకుంటున్నాను. ఇప్పుడు చేస్తున్న సినిమాలో ఓ మంచి క్యారెక్టర్ చేస్తున్నాను. అది ప్రేక్షకులకు నచ్చుతుంది.

మీ బ్యాక్ గ్రౌండ్ గురించి చెప్పండి?
నేను హైదరాబాదీని. ఇంటీరియర్ డిజైనింగ్ కంప్లీట్ చేశాను. ఆ తర్వాత సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీకి వచ్చాను. మా ఫ్యామిలీ నన్ను బాగా సపోర్ట్ చేస్తుంది. నా కుటుంబ సభ్యుల సపోర్ట్ వల్లే నేను హీరో కాగలిగాను.

 
I want to reinvent myself on the big screen with various roles. – Hero Anurag

Anurag introduced with ‘Raagala 24 Gantallo’ and earned a good name for his performance in that film. Popular Director, ‘Dhamarukam’ fame Sreenivass Redde Provided Screenplay and Direction Supervision to ‘Radhakrishna’ movie which stars Anurag, Musskan Sethi (Paisa Vasool Fame) as Hero and Heroines. Nandamuri Lakshmi Parvathy played a crucial role. T.D. Prasad Varma Directed this film. Puppala Sagarika Krishnakumar Produced it under Harini Aradhya Creations. The film released on February 5th and is running in Cinemas with successful talk all over. Hero Anurag interacted with the media about the success of the film. Here are the excerpts…

Tell us about your journey as an Actor and How did ‘RadhaKrishna’ happened?
I know Ali Garu. I met Sreenivass Redde Garu through Ali Garu. A good rapport developed between us. He offered me ‘Raagala 24 Gantallo’, in which I played one of the lead roles. He liked my performance in that film and recommended me for ‘RadhaKrishna’. That’s how I acted in this film. The success of this film is mainly because of Sreenivass Redde garu.

How did you feel when you heard about your role ?
It’s not a small thing to do a lead role. My role in ‘Raagala 24 Gantallo’ is of small duration. When I was offered lead role in ‘RadhaKrishna’, I was a bit tensed as well as excited to play the role. I am very happy doing a good role in ‘RadhaKrishna’.

You did a film in the backdrop of Nirmal Crafts. How do you feel about it ?
I feel happy and proud doing a film about Nirmal Crafts.  These days, not many know about the uniqueness of Nirmal Crafts. This movie has showcased their importance and I am very happy that I am a part of sending a message through this film.

What did you learned with this film ?
I came to know about the effort and hard work which goes into crafting the toys at Nirmal. I witnessed their difficulties while working for this movie. We should protect our heritage. I am glad that we have helped their cause with our film.

How was the shooting experience ?
I had an amazing shooting experience. I wondered about the scenic locations we have around us. Entire unit supported very well. Sreenivass Redde Gari screenplay has a different angle. I have learned a lot of new things. Musskan is a very hard working actress. Working with her was a great experience.

This Producer and Director made their debut with this film. How is it working with them ?
Yes they are new but we also have very experienced technicians in our unit. Prasad Garu worked with Sreenivass Redde Garu. He has a vast experience which made easy for us. MM Sreelekha Garu gave very good music. She didn’t take this as a small film and gave very good background score. Audience are getting emotional in theatres while watching the film. We too were touched while watching the film with audience. Our entire team worked very hard and made a very good film. I am very happy about it.

Vijayashanthi Garu launched a song from your film. How do you feel ?
Vijayashanthi Garu launched ‘Nirmala Bomma’ song from our film. Thanks to her. I used to watch Vijayashanthi Garu in Movies and TV while I was a kid. She spoke very nicely when we went to release the song. I will always cherish the moments speaking with her.

How is it working with Lakshmi Parvathy Garu ?
I didn’t know that she would be doing a character in our film. I was surprised when I was told about her presence just two days before the shoot. It’s a blessing working with her.

What is your Dream Role?
I want to play different kinds of roles as an actor. I want to reinvent myself on the big screen with various roles. Currently I am doing a very good role. The audience will love it.  

Tell us about your background ?
I am a Hyderabadi. I have completed my interior designing. I came to Industry out of my interest towards films. My family supports me all the time. It is because of them only I became a hero today.  I also thank the media for their constant support.