ప్రేక్షకులను నవ్వించే పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘సోలో బ్రతుకే సో బెటర్‌’ – నభా నటేశ్‌

ప్రేక్షకులను నవ్వించే పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘సోలో బ్రతుకే సో బెటర్‌’ – నభా నటేశ్‌

   ప్రేక్షకులను నవ్వించే పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘సోలో బ్రతుకే సో బెటర్‌’ – నభా నటేశ్‌
 
 సుప్రీమ్ హీరో సాయితేజ్ హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర బ్యాన‌ర్‌పై బీవీఎస్ఎన్ ప్ర‌సాద్ నిర్మాత‌గా సుబ్బ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం ‘సోలో బ్రతుకే సో బెట‌ర్‌’ . నభా నటేశ్ హీరోయిన్. ఈ చిత్రం మ‌రో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియో అసోసియేష‌న్‌తో డిసెంబ‌ర్‌ 25న విడుద‌లవుతుంది. ఈ సందర్భంగా వెబినార్‌లో హీరోయిన్‌ నభా నటేశ్‌ మాట్లాడుతూ …
 
 తేజ్‌ నాకు చాలా మంచి ఫ్రెండ్‌.. సపోర్టర్‌. టీమ్‌ అందరూ చాలా ఆతృతతో, ఏదో సాధించాలనే తపనతో పనిచేశారు. మా దర్శకుడు సుబ్బుకి ఇది ఫస్ట్ సినిమా. చాలా హ్యాపీగా అనిపించింది. యంగ్‌ టీమ్‌తో పాటు సినిమాలో రాజేంద్రప్రసాద్‌, నరేష్… లాంటి సీనియర్‌ స్టార్స్‌ కూడా ఉన్నారు. త‌మ‌న్ అద్భుత‌మైన సంగీతాన్ని అందిచంఆరు. పాటలు చాలా పాపులర్‌ అయ్యాయి. ప్రజలకు చాలా నచ్చాయి. ఆల్బమ్‌ మొత్తం చాలా పెద్ద హిట్‌ అయింది. లాక్‌డౌన్‌లో ఒకదాని తర్వాత ఒక పాటను విడుదల చేశాం. నో పెళ్లి, ఆ తర్వాత హే ఇది నేనేనా… విడుదల  చేశాం. విన్నవాళ్లందరూ బావుందంటున్నారు. ట్రైలర్‌కి చాలా మంచి స్పందన వచ్చింది.
 
 సినిమాను ఓటీటీలో చూడటానికి, టిక్కెట్స్‌ కొని థియేటర్స్‌లో బిగ్‌ స్క్రీన్‌పై చూడటానికి చాలా తేడా ఉంటుంది. డిసెంబర్‌ 25న విడుదలవుతున్న మా సినిమా ‘సోలో బ్రతుకే సో బెటర్‌’ సినిమాను థియేటర్‌లో ప్రేక్షకులు ఎలా ఎంజాయ్‌ చేస్తారని నాకు కూడా ఆసక్తి ఉంది. 
 
 కోవిడ్‌ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో  ‘సోలో బ్రతుకే సో బెటర్‌’ సినిమా ఓటీటీలో రిలీజ్‌ అవుతుందని అన్నారు. కాస్త టెన్షన్‌గా అనిపించింది. ఫ్యామిలీ ఎంటర్‌టైనింగ్ మూవీ. థియేటర్‌లోకి వస్తే బావుటుంది అనుకున్నాను. అయితే పరిస్థితులు అలా ఉన్నాయి. ఎవరూ ఏమీ చేయలేం కదా అనిపించింది. అయితే ఈలోపు థియేటర్స్ ఓపెన్‌ కావడమూ, మా మేకర్స్‌ సినిమాను థియేటర్‌లో విడుదల చేయడానికి ఒప్పుకోవడం చకచకా జరిగిపోయాయి. 
 
 సినిమాలో చాలా మంచి పాత్ర చేశాను. రేపు సినిమా విడుదలైన తర్వాత నేను ఎందుకు ఇలా చెప్పానో మీకే అర్థమవుతుంది. సినిమా విడుదలైన తర్వాత నా పాత్ర గురించి మాట్లాడుతాను. కొన్ని విలువలు పాటించే అమ్మాయి పాత్రలో కనపడతాను. నా పాత్రను డైరెక్టర్‌ సుబ్బుగారు ఎంటర్‌టైనింగ్‌గా మలిచారు. 
 
 సుబ్బు నాకు పాత్రను నెరేట్‌ చేశాడు. తన నెరేషన్‌, నా పాత్రను మలిచిన తీరు నచ్చడంతో నేను వెంటనే ఓకే చెప్పేశాను. 
 
 ఇస్మార్ట్‌ శంకర్‌లో మాస్‌ పాత్ర చేశాను. ఇందులో క్లాస్‌ అమ్మాయిగా నటించాను. గర్ల్‌ నెక్ట్స్‌ డోర్‌ పాత్ర. పాత్ర క్యారీ చేయడంలో పెద్దగా ఇబ్బంది పడలేదు. ఎందుకంటే నేను దక్షిణాది అమ్మాయిని. మన సినిమాలే చూస్తూ పెరిగాను. థియేటర్స్‌లో యాక్ట్‌ చేశాను. నాటకాల్లో నటించాను. కాబట్టి పాత్రలో ట్రాన్స్‌ఫార్మ్‌ కావడం నాకు కష్టమేమీ కాదు. 
 
 నటిగా నేను డైరెక్టర్‌ చెప్పింది చేసుకుంటూ వెళతాను. సినిమా సక్సెస్‌ అయితే, నాకు పేరొస్తుందని నమ్ముతాను. కష్టపడటమే తెలుసు.