రామ్ డించక్.. డించక్ సాంగ్ అదిరింది

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం రెడ్. కిశోర్ తిరుమల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే టీజర్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో రామ్ డ్యూయల్ రోల్ చేస్తున్నారు. టీజర్‌కి అత్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అంతేకాకుండా సినిమాలోని.. వాడు వీడూ బ్యాడూ అనే సాంగ్ కూడా రిలీజ్ చేశారు. ఈ సాంగ్‌కి భారీ స్పందన వచ్చింది. తాజాగా చిత్రబృందం డించక్ డించక్ అనే సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్‌లో హెబ్బపాటేల్ రామ్ సరసన స్టెప్పలేశారు. అయితే సాంగ్ విడుదలై మిలియన్ వ్యూస్‌ను దాటేసింది.