ఏప్రిల్ 30న రిలీజ్‌కు రెడీ అవుతోన్న `గాడీ నెం-143`
ఏప్రిల్ 30న రిలీజ్‌కు రెడీ అవుతోన్న `గాడీ నెం-143`
సాయి విజయ గణపతి పిక్చర్స్ పతాకంపై హేమంత్, సురేంద్ర బాబు , అంజలి లీజా రెడ్డి హీరో హీరోయిన్లుగా వి. భాను మురళి దర్శకత్వంలో ఎమ్.చంద్రశేఖర్ రెడ్డి (శిల్పి) నిర్మిస్తోన్న చిత్రం `గాడీ నెం-143`. ఈ చిత్రం ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని యుబైఏ సర్టిఫికెట్ అందుకుంది. ఏప్రిల్ 30న విడుదలకు ముస్తాబవుతోంది.
ఈ సందర్భంగా నిర్మాత ఎమ్.చంద్రశేఖర్ రెడ్డి (శిల్పి) మాట్లాడుతూ…“మా సినిమాకు సంబంధించిన సెన్సార్ పనులు ఇటీవలే పూర్తయ్యాయి. యుబైఏ సర్టిఫికెట్ తో పాటు సినిమా బావుందంటూ సెన్సార్ సభ్యులు ప్రశంసించారు. ఇక మొదట మా సినిమాను ఏప్రిల్ మొదటి వారంలో రిలీజ్ చేద్దామనుకున్నాం. కానీ పవర్ స్టార్ పవన్‌కళ్యాణ్ `వకీల్ సాబ్` , లవ్ స్టోరీ, టక్ జగదీస్ లాంటి పెద్ద సినిమాలు విడుదలవుతుండటంతో మా సినిమాను ఏప్రిల్ 30కి పోస్ట్ పోన్ చేశాం. మా సినిమాకు సంబంధించిన పాటలు మధుర ఆడియో ద్వారా విడుదలై శ్రోతలను ఆకట్టుకున్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. పాటలు, ట్రైలర్ సినిమా పై హైప్‌ని క్రియేట్ చేశాయి. ఈస్ట్ గోదావరి పరిసర ప్రాంతంలో సినిమాను షూటింగ్ చేయడంతో అక్కడ ఎక్కువ థియేటర్స్ లో సినిమా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నాం. ఎన్నో ఆర్థిక ఒడిదుడుకులు వచ్చినప్పటికీ అన్నింటినీ అధిగమించి సినిమాను థియేటర్స్ కొరతైన రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. చిన్న చిత్రం అయిన ప్రస్తుత పరిస్థితుల్లో కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఆ కోవలో మా సినిమా కూడా చేరుతుంతన్న నమ్మకంతో ఉన్నాం. ప్రేక్షకులు మా ప్రయత్నాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాం“ అన్నారు.
చిత్ర దర్శకుడు వి.భాను మురళి మాట్లాడుతూ…“ ఎన్నో ఇబ్బందులు వచ్చినప్పటికీ మా నిర్మాత ఎక్కడ రాజీ పడకుండా సినిమా బాగా రావడానికి సహకరించారు. చిన్న బడ్జెట్ సినిమా అయినా కంటెంట్ పరంగా మాత్రం పెద్ద సినిమా అని చెప్పడంలో సందేహం లేదు. ఇక కథ విషయానికొస్తే … సిన్సియర్ గా లవ్ చేసుకుంటోన్న ఒక ప్రేమ జంట మధ్యలోకి ట్రైం పాస్ కోసం లవ్ చేసే ఒక వ్యక్తి ప్రవేశించి ఆ జంటను ఎలా డిస్ట్రర్బ్ చేసాడు. తను ఎలాంటి సమస్య ఎదుర్కొన్నాడు అన్నది చిత్ర కథాంశం. చివరకు ఏం జరిగింది అనేది ఆసక్తికరమైన ముగింపు. కథ కథనాలు చాలా కొత్తగా ట్విస్టులతో కూడుకుని ఉంటుంది. సెన్సిబుల్ లవ్, కడుపుబ్బ నవ్వించే కామెడి, ఎమోషన్స్ ఇలా కమర్షియల్ సినిమాకు కావాల్సిన అన్ని హంగులున్నాయి. యూత్, ఫ్యామిలీ ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసి సినిమా ఇది“ అన్నారు.
ఫణికాంత్, జాకి, గౌతం రాజు, జబర్దస్త్ రైజింగ్ రాజు, ఫన్ బకెట్ మహేష్, జెమిని అశోక్, సుబ్బారెడ్డి, రాజా రాంబాబు తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి డీఓపీః పి.ఏసు; ఎడిటర్ః లోకేష్ కుమార్ కడలి; సంగీతంః త్రినాథ్ మంతెన; నిర్మాతః ఎమ్.చంద్రశేఖర్ రెడ్డి (శిల్పి); దర్శకత్వంః వి.భాను మురళి.