జాతిరత్నాలు టీం ని అభినందించిన FTIH ఇన్స్టిట్యూట్..!!
జాతిరత్నాలు టీం ని అభినందించిన FTIH ఇన్స్టిట్యూట్..!!
రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ గా నిలిచిన చిత్రం జాతిరత్నాలు.. నవీన్ పోలిశెట్టి హీరోగా
రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రలుగా నటించిన ఈ చిత్రంలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించగా ఈ చిత్రం ఇప్పటికీ విజయవంతంగా కొనసాగుతుంది. అగ్ర నిర్మాత అశ్విని దత్ స్థాపించిన బ్యానర్ వైజయంతి నెట్ వర్క్ సంస్థ నుంచి వచ్చిన ఈ సినిమా కి నాగ్ అశ్విన్ దర్శకుడు కాగా అనుదీప్ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాడు. కాగా సౌత్ ఇండియా లోనే బెస్ట్ ఫిలిం ఇన్స్టిట్యూట్ గా పేరు పొందిన FTIH ఇన్స్టిట్యూట్ మరియు జురియాల్ స్టూడియోస్ సంయుక్త ఆధ్వర్యంలో నిన్న సాయంత్రం జాతిరత్నాలు చిత్రాన్ని ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ సినిమా కి పనిచేసిన సినిమాటోగ్రాఫర్ మనోహర్ FTIH ఇన్స్టిట్యూట్ స్టూడెంట్ కావడం విశేషం. అందుకు గాను ఈ ఇన్స్టిట్యూట్ విద్యార్థులకు ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించారు. కాగా ఈ కార్యక్రమానికి చిత్ర నిర్మాతలు నాగ్ అశ్విన్, ప్రియాంక దత్, స్వప్న దత్ లు విచ్చేసి విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు..
ఈ సందర్భంగా సినిమాటోగ్రాఫర్ మనోహర్ మాట్లాడుతూ… ఫిలిం మేకర్ గా సక్సెస్ అవ్వాలంటే చాలా కష్టపడాలి.. ఒకటి నేర్చుకున్నామని ఆగిపోవద్దు.. రోజుకో కొత్త విషయం నేర్చుకోవాలి. ఆగిపోతే మన కెరీర్ అక్కడే ఆగిపోతాం.. సినిమా ఎలా ఉన్నా పర్వాలేదు.. మన వర్క్ ఎలా వుంది అనేది చూసుకోవాలి.. ఒక్క సినిమాతోనే నేమ్ ఫేమ్ రాదు.. దానికి చాలా కష్టపడాలి. వైజయంతి మూవీస్ లోకి ఎంటర్ అయిన తరువాత ప్రతి మనిషికి రెస్పెక్ట్ ఇవ్వాలని తెలుస్తుంది.. నాగ్ అశ్విన్ గారు అదే నేర్పిస్తారు. అన్నారు.
నిర్మాత ప్రియాంక దత్ మాట్లాడుతూ..
FTIH ఇన్స్టిట్యూట్ స్టూడెంట్ అయిన మనోహర్ వైజయంతి నెట్ వర్క్ లో వచ్చిన ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి, జాతిరత్నాలు వంటి మూడు చిత్రాలకు కెమెరా విభాగంలో పనిచేసి సేవలు అందించి ప్రతిభను చాటుకున్నాడు. మంచి పెర్ఫార్మన్స్ ఉంటే ఎలా ఉన్నా, ఏదైనా సాధించవచ్చు.. సినిమా అంటే ఎవరి దగ్గరినుంచి ఎంకరేజ్ రాదు.. దాన్ని తట్టుకుని నిలబడ్డవారే సక్సెస్ అవుతారు. టైం మళ్ళీ తిరిగిరాదు.. బాగా పనిచేయాలి.. సినిమా ఇండస్ట్రీ లో ఏది చేయాలన్నా డెడికేషన్ ఉండాలి.. అన్నారు..