ఫోకస్ మూవీ రివ్యూ

ఫోకస్ మూవీ రివ్యూ

ఫోకస్ మూవీ రివ్యూ

విడుదల తేదీ: 28.10.2022
నటీనటులు: విజయ్ శంకర్, అషు రెడ్డి, సుహాసిని మణిరత్నం, భాను చందర్
దర్శకుడు: జి.సూర్య తేజ
నిర్మాత: వీర భద్రరావు
ఎడిటర్: సత్య జి
DOP: J. ప్రభాకర్ రెడ్డి
సంగీతం: వినోద్ యాజమాన్య
బ్యానర్: రిలాక్స్ మూవీ మేకర్స్  

రేటింగ్ 3/5

సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలకు ఎప్పుడూ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ ఉంటుంది. టైటిల్ దగ్గర నుంచి ట్రైలర్ వరకు ఫోకస్ సినిమా ఆడియన్స్ లో క్యూరియాసిటీ కలిగించింది. మరి ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఫోకస్ సినిమా రివ్యూ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

స్టోరీ లోకి వెళితే …
పోలీసు సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న వివేక్ వర్మ (భాను చందర్) మరియు
గౌరవనీయమైన న్యాయమూర్తి అయిన అతని భార్య ప్రమోదా దేవి వైవాహిక జీవితాన్ని ఎంతో సంతోషంగా గడుపుతుంటారు. దురదృష్టవశాత్తు ఒక రోజు వివేక్ వర్మ దారుణంగా చంపబడతాడు . అతని మృతదేహం ఎంతో మిస్టీరియస్ గా దొరుకుతుంది. సబ్ ఇన్‌స్పెక్టర్ విజయ్ శంకర్ (విజయ్ శంకర్) మిస్టీరియస్ కేసును డీల్ చేయడాకిని నియమించబడతాడు. ఈ కేసు ఎన్నో ఊహించని మలుపులకు దారి తీస్తుంది, ఆ తర్వాత ప్రేమ కేసును టేకప్ చేసి దర్యాప్తు ప్రారంభిస్తుంది. ప్రమోదా దేవి జీవితం ఏమిటి, హత్య వెనుక కారణం ఏమిటి, ఎవరు చంపారు, పోలీసులు కేసును ఎలా ఛేదించారు. నేరస్థుడిని గుర్తించడంలో విజయం సాధిస్తారా, ఇవన్నీ తెలుసుకోవాలంటే థియేటర్ కి వెళ్లి సినిమా చూడాల్సిందే.
పెరఫార్మెన్సెస్:
విజయ్ శంకర్ చిత్రానికి ప్రధాన ఆకర్షణ అని చెప్పాలి. అతని నటన , బాడీ లాంగ్వేజ్ మరియు అతని పాత్రలో ఒదిగిపోయిన తీరు ప్రేక్షకుల దృష్టిని ఆకట్టుకుంటాయి. అలాగే డైలాగ్ డెలివరీ , యాక్షన్ సన్నివేశాల్లో అద్భుతమగా రాణించాడు. బిగ్ బాస్ ఫేమ్ ఆశు రెడ్డి పాత్ర సినిమాకు మరో అట్రాక్షన్ గా నిలిచింది. ఆమె ఇంట్రడక్షన్ తో సినిమా మరింత ఆసక్తికరంగా మారుతుంది. మిగిలిన పాత్రధారులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.
టెక్నిషన్స్ పనితీరు:
డైరెక్టర్ సూర్య తేజ ఎంతో ఫోకస్డ్ గా కథ, కథనాలు రాసుకున్నాడు. అంతే ఫోకస్డ్ గా సినిమాను తీసాడు. వీరభద్ర రావు కథకు ఎంత ఖర్చు పెట్టాలో అంత ఖర్చు పెట్టి సినిమాను లావిష్ గా తీశారు. సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలకు మ్యూజిక్ కీ రోల్ ప్లే చేస్తుంది..వినోద్ యాజమాన్య బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్లస్ అయ్యింది. ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్ గా ఉంటె బావుండేది. అక్కడక్కడా కొన్ని సీన్స్ రొటీన్ గా అనిపిస్తాయి.
అనాలసిస్:
విజయ్ శంకర్ పెరఫార్మెన్సు, స్టోరీ , డైరెక్షన్ , సస్పెన్స్, అషు రెడ్డి అందం , అభినయం సినిమాకు ప్లస్ అయ్యాయి. ఇన్విస్టిగేషన్, ట్విస్ట్స్ , థ్రిల్లర్ అంశాలు ఇష్టపడే వారితో పాటు ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఫోకస్. డోంట్ మిస్. గో అండ్ వాచ్.