‘ఎఫ్‌సీయూకే’ (ఫాద‌ర్‌-చిట్టి-ఉమా-కార్తీక్‌) లోని “హే హుడియా” పాట‌ను విడుద‌ల చేసిన మీడియా

‘ఎఫ్‌సీయూకే’ (ఫాద‌ర్‌-చిట్టి-ఉమా-కార్తీక్‌) లోని “హే హుడియా” పాట‌ను విడుద‌ల చేసిన మీడియా

 

‘ఎఫ్‌సీయూకే’ (ఫాద‌ర్‌-చిట్టి-ఉమా-కార్తీక్‌) లోని “హే హుడియా” పాట‌ను విడుద‌ల చేసిన మీడియా

జ‌గ‌ప‌తిబాబు ప్ర‌ధాన పాత్ర పోషించ‌గా శ్రీ రంజిత్ మూవీస్ ప‌తాకంపై కె.ఎల్‌. దామోద‌ర్ ప్ర‌సాద్ నిర్మించిన చిత్రం ‘ఎఫ్‌సీయూకే’ (ఫాద‌ర్‌-చిట్టి-ఉమా-కార్తీక్‌). రామ్ కార్తీక్‌, అమ్ము అభిరామి జంట‌గా, బేబి స‌హ‌శ్రిత మ‌రో కీల‌క పాత్ర‌ధారిగా న‌టించిన ఈ సినిమాకు విద్యాసాగ‌ర్ రాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

ఇదివ‌ర‌కు టాలీవుడ్‌లో ఎవ‌రూ చేయ‌ని విధంగా ఈ చిత్రంలోని పాట‌ల‌ను నిజ జీవిత హీరోల‌తో విడుద‌ల చేస్తూ వ‌స్తున్నారు. సినిమా వేడుక‌ల‌ను, ప్రెస్‌మీట్ల‌ను క‌వ‌ర్ చేయ‌డానికి వ‌చ్చే మీడియా సిబ్బందితో ఈ చిత్రంలోని నాలుగో పాట “హే హుడియా”ను విడుద‌ల చేయించ‌డం విశేషం.

కొవిడ్ 19 మ‌హమ్మారిపై మొద‌ట్నుంచీ ముందుండి పోరాటం చేస్తూ, అవిశ్రాంతంగా సేవ‌లందిస్తూ వ‌స్తోన్న వైద్య‌-ఆరోగ్య‌, మునిసిప‌ల్‌, పోలీస్ సిబ్బంది చేతుల మీదుగా మూడు పాట‌ల‌ను చిత్ర బృందం విడుద‌ల చేయించింది. ఆ పాట‌లు సంగీత ప్రియుల‌ను అమితంగా అల‌రిస్తున్నాయి.

శ్రీ రంజిత్ మూవీస్ అధినేత కె.ఎల్‌. దామోద‌ర్ ప్ర‌సాద్ మాట్లాడుతూ, త‌మ జీవితాల‌ను ప‌ణంగా పెట్టి, ఎదుటివాళ్ల జీవితాల‌ను కాపాడ్డం కోసం అమూల్య‌మైన సేవ‌లందిస్తూ వ‌స్తున్న కొవిడ్ ఫ్రంట్‌లైన్ వారియ‌ర్స్‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలుపుకోవాల‌నే ఉద్దేశంతోటే ఈ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టామ‌న్నారు.

జ‌గ‌ప‌తిబాబు మాట్లాడుతూ, కొవిడ్ ఫ్రంట్‌లైన్ వారియ‌ర్స్‌గా మీడియాకు గుర్తింపు రాలేద‌నీ, అయితే కొవిడ్ మ‌హ‌మ్మారికి సంబంధించిన స‌మాచారాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు ఫీల్డ్‌లో ఉండి అందిస్తూ, అంద‌రినీ అప్ర‌మ‌త్తం చేస్తూ వ‌చ్చింది మీడియా సిబ్బందేన‌నీ అన్నారు. అలాంటి వారి చేతుల మీదుగా ఈ చిత్రంలోని పాట విడుద‌ల కావ‌డం త‌న‌కెంతో ఆనందాన్నిచ్చింద‌ని చెప్పారు.

భీమ్స్ సెసిరోలియో బాణీలు స‌మ‌కూర్చిన “హే హుడియా” పాట‌ను ఆవిష్క‌రించిన సీనియ‌ర్ ఫిల్మ్ జ‌ర్న‌లిస్టులు సాయిర‌మేశ్‌, నాగేంద్ర‌కుమార్‌.. ఆ పాట‌ను రాగ‌యుక్తంగా ఆల‌పిస్తూ ఆస్వాదించారు.

క‌రోనా మ‌హ‌మ్మారిపై పోరాటంలో మీడియా పాత్ర‌ను ప్ర‌శంసించిన హీరో రామ్ కార్తీక్‌, “హే హుడియా” పాట‌ను విడుద‌ల చేసిన జ‌ర్న‌లిస్టుల‌కు థాంక్స్ చెప్పారు.

డైరెక్ట‌ర్ విద్యాసాగ‌ర్ రాజు మాట్లాడుతూ, రొమాంటిక్ కామెడీగా రూపొంది, ఫిబ్ర‌వ‌రి 12న థియేట‌ర్ల‌లో విడుద‌ల‌వుతున్న‌ ‘ఎఫ్‌సీయూకే’ మూవీ క‌చ్చితంగా ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తుంద‌నే న‌మ్మ‌కాన్ని వ్య‌క్తం చేశారు.

తారాగ‌ణం:
జ‌గ‌ప‌తిబాబు, రామ్ కార్తీక్‌, అమ్ము అభిరామి, బేబి స‌హ‌శ్రిత‌, అలీ, దగ్గుబాటి రాజా, కళ్యాణి నటరాజన్, బ్రహ్మాజీ, కృష్ణ భగవాన్, రజిత, జబర్దస్త్ రామ్ ప్రసాద్, నవీన్, వెంకీ, రాఘవ, భరత్‌.

సాంకేతిక బృందం:
మాటలు:ఆదిత్య, కరుణాకర్
ఛాయాగ్రహణం: శివ జి.
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
బ్యాక్ గ్రౌండ్ స్కోర్: జీవన్
పాటలు: ఆదిత్య,కరుణాకర్, భీమ్స్
ఎడిటింగ్: కిషోర్ మద్దాలి
ఆర్ట్: జె.కె.మూర్తి
పి.ఆర్.ఓ: యల్. వేణుగోపాల్
లైన్ ప్రొడ్యూస‌ర్: వాసు ప‌రిమి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్: శ్రీ‌కాంత్‌రెడ్డి పాతూరి
స‌హ‌నిర్మాత: య‌ల‌మంచిలి రామ‌కోటేశ్వ‌ర‌రావు
కథ-స్క్రీన్ ప్లే- కొరియోగ్రఫీ-దర్శకత్వం: విద్యాసాగర్ రాజు
నిర్మాత: కె.ఎల్. దామోదర్ ప్రసాద్
బ్యాన‌ర్‌: శ్రీ రంజిత్ మూవీస్.

FCUK (Father Chitti Uma Karthik) Movie Hey Hudiya Song released by media for media

In a never before kind of event, media personnel released a song for the media personnel. ‘Hey Hudiya’ song from FCUK Movie was released by the media personnel who had come to cover the event. This is as part of the initiative by Sri Ranjith Movies to release the song by real heroes of the pandemic and the previous songs were released by health, muncipal and police personnel. Speaking on behalf of Sri Ranjith Movies producer K L Damodar Prasad said that this initiative was taken as a small token of gratitude to the invaluable services of the covid frontline workers who risked their lives to save others lives. Jagapati Babu Garu said that media was among the sections that didn’t get recognition though they played a pivotal role in keeping the information flowing when everyone was scared to step up. The media stalwarts who participated in the event thoroughly enjoyed singing the song ‘Hey Hudiya’ the music for which was composed by Bheems Ceciroleo. Hero Ram Karthik thanked the media for their role in fighting the pandemic and for releasing the song of FCUK Movie. Director Vidyasagar Raju said that he was confident that FCUK which is a Romantic Comedy will be releasing in the theatres on February 12th 2021.

Jagapatibabu, Karthik, Ammu Abhirami, Ali, Daggubati Raja, Kalyani Natarajan, Brahmaji, Krishna Bhagavaan, Rajitha, Jabardast Ram Prasad, Naveen, Venky, Raghava, Bharat etc.

Dialogues: Aditya,Karunakar,
Cinematography: Shiva.G
Music Director: Bheems Ceciroleo
Songs: Aditya, Karunakar, Bheems
Editing: Kishore Maddali
Art Director: J.k. Murthy
PRO: L.Venugopal
Story-Screenplay-Choreography-Direction: Vidyasagar Raju
Producer: KL Damodar Prasad