Evaru Trailer Launch

Evaru Trailer Launch
Evaru Trailer Launch
Evaru Trailer Launch

తెలుగు సినిమానా? ఇంగ్లీష్ సినిమానా? అనేంత గొప్పగా, గ్రిప్పింగ్‌గా రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్ `ఎవరు` పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను  – నేచురల్ స్టార్ నాని

`క్ష‌ణం`, `అమీ తుమీ`, `గూఢ‌చారి` వంటి వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న అడివిశేష్ క‌థానాయ‌కుడుగా రూపొందుతోన్న థ్రిల్ల‌ర్ `ఎవ‌రు`. `బ‌లుపు`, `ఊపిరి`, `క్ష‌ణం` వంటి సూప‌ర్‌హిట్ చిత్రాల‌ను నిర్మించిన ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ పివిపి సినిమా బ్యాన‌ర్‌పై ఈ చిత్రం నిర్మిత‌మ‌వుతోంది. వెంక‌ట్ రామ్‌జీ ఈ చిత్రం ద్వారా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. పెర‌ల్ వి.పొట్లూరి, ప‌ర‌మ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నె నిర్మాత‌లు. ఈ చిత్రంలో రెజీనా క‌సండ్ర హీరోయిన్‌గా న‌టిస్తుంది. న‌వీన్ చంద్ర కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆగస్ట్ 15న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా సోమవారం థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా… 
 
నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ – “ట్రైలర్‌ను రెండు సార్లు చూశారందరూ. తొలిసారి చూస్తున్నప్పుడు `మనమిప్పుడు ఏం చూశాం?` అని అందరూ షాక్‌లో ఉండిపోయారు. ట్రైలర్ మనల్ని నేరుగా కథలోకి తీసుకెళ్లిపోయింది. శేష్, రెజీనా, పివిపిగారు సహా అందరూ నా కుటుంబ సభ్యులతో సమానం. గూఢచారి ట్రైలర్‌ను ఇదే ప్లేస్‌లో రిలీజ్ చేశాం. శేష్ ఈ సినిమా ట్రైలర్ గురించి నాకు ఫోన్ చేసినప్పుడు నేను కూడా రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యాను. `గూఢచారి` ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనకు తెలుసు. ఈ సినిమా కూడా పెద్ద హిట్ అయిపోతే ప్రతి సినిమా ట్రైలర్‌ని నేనే రిలీజ్ చేయాల్సి వస్తుందనే డేంజర్ ఉన్నప్పటికీ, మనస్ఫూర్తిగా ఈ సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నాను. సినిమా చాలా గ్రిప్పింగ్‌గా అసలు తెలుగు సినిమానా? ఇంగ్లీష్ సినిమా అనిపిస్తుంది. సినిమాను అంత బాగా చేశారు. శేష్ ప్రతిసారి అంత మంచి క్వాలిటీని ఎలా ఇస్తాడో తెలియడం లేదు. టీజర్ చూసినప్పుడే సినిమాపై ఇంట్రెస్ట్ కలిగింది. ఇప్పుడు ట్రైలర్ చూసిన తర్వాత ఇంకా ఆసక్తి పెరిగిపోయింది. సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా? అనిపిస్తుంది. శేష్, రెజీనా చక్కగా పెర్ఫామ్ చేశారు. `అ!` సినిమాకు నిర్మాతగా చేసినప్పుడు రెజీనా ఎంత డేరింగో చూశాను. డేరింగ్ ఐడియాను ఓ ఇంపాక్ట్‌తో ప్రెజెంట్ చేసినట్లు కనపడుతుంది. ఆగస్ట్ 15న అందరూ ఈ సినిమాను థియేటర్‌లో చూసి ఈ టీమ్‌కి పెద్ద సక్సెస్‌ని అందించాలని కోరుకుంటున్నాను“ అన్నారు. 
దర్శకుడు వెంకట్ రామ్‌జీ మాట్లాడుతూ – “ట్రైలర్ అందరికీ నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను. ఇప్పుడే సినిమా గురించి మాట్లాడాలనుకోవడం లేదు. ప్రీ రిలీజ్ రోజున మాట్లాడుతాను“ అన్నారు. 
అడివిశేష్ మాట్లాడుతూ ఎవరు` సినిమా టీజర్ రిలీజ్ టైమ్‌లో చిన్నపాటి టెన్షన్ ఉండింది. కానీ ఇప్పుడు చాలా కామ్‌గా ఉన్నాను. అందుకు కారణం మేం సాలిడ్ మూవీని చేశామని నమ్మకంగా ఉంది. ఆ నమ్మకంతోనే నేను నానిగారికి ఫోన్ చేసి రిక్వెస్ట్ చేశాను. నమ్మిన సినిమా..నచ్చిన సినిమా. కంటెంట్ ఉంది కాబట్టే నానిగారిని అడిగానే.. ఆయన కూడా వచ్చినందుకు ఆయనకు నా థ్యాంక్స్. ట్రైలర్‌కు సంబంధించినంత వరకు ఈ సినిమాలో అందరూ రెండు ముఖాలను కలిగి ఉంటారు. ఈ మనిషి ఇలా ఉంటారని ప్రేక్షకుడు అనుకున్న పది నిమిషాలకు ఆ మనిషి మారిపోతుంటాడు. ఇలాంటి కాన్సెప్ట్‌తో సినిమా చేయబోతున్నానని రామ్‌జీ నాకు చెప్పగానే నేను ట్విస్ట్‌ను బ్రేక్ చేయలేకపోయాను. శ్రీచరణ్ పాకాల అద్భుతమైన మ్యూజిక్ ఇవ్వగా.. వంశీ చక్కటి విజువల్స్ ఇచ్చారు. నన్ను హీరోగా ఏ ప్రొడ్యూసర్ నమ్మని టైమ్‌లో ఆయన నమ్మారు. అందుకే ఆయనతో ఇప్పుడు రెండో సినిమా చేస్తున్నాను. భవిష్యత్‌లో ఈ బ్యానర్‌లో సినిమాలు చేస్తున్నాను. అబ్బూరి రవిగారికి థ్యాంక్స్. ఆర్ట్ డైరెక్టర్ అవినాష్‌కి థ్యాంక్స్. తనతో మేజర్‌కి కూడా వర్క్ చేయాలనుకుంటున్నాను“ అన్నారు. 
అబ్బూరి రవి మాట్లాడుతూ – క్షణం` సినిమాకు పివిపిగారు, శేష్ కలిసి పనిచేశారు. నాతో `పంజా` నుండి శేష్ పరిచయం ఉన్నాడు. `క్షణం`, `గూఢచారి` సినిమాలకు కలిసి పనిచేశాం. ఇక `ఎవరు` సినిమా విషయానికి వస్తే..వెంకట్ రామ్‌జీ కథ చెప్పినప్పుడు ట్విస్టులను ఊహించలేకపోయాం. అందరం కష్టపడి పనిచేశాం“ అన్నారు. 
నవీన్ చంద్ర మాట్లాడుతూ – “ట్రైలర్ చాలా బావుంది. ఎవరు సినిమాలో పనిచేయడం ఆనందంగా ఉంది. పివిపిగారికి థ్యాంక్స్. 
నిర్మాత పివిపి మాట్లాడుతూ – “సినిమాలంటే ప్యాషన్ ఉన్న టీమ్. సెల్ఫ్ మేడ్ టీమ్. రెండేళ్ల ముందు అనుకున్న ఆలోచనతో చేసిన సినిమా. అందరూ తమ వంతుగా కష్టపడి చేసిన సినిమా. మంచి సినిమా, గర్వంగా ఫీల్ అవుతున్నాం. కచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది“ అన్నారు. 
 
న‌టీన‌టులు:
అడివిశేష్‌, రెజీనా కసండ్ర‌, న‌వీన్ చంద్ర త‌దిత‌రులు 
 
సాంకేతిక వ‌ర్గం:
ద‌ర్శ‌క‌త్వం:  వెంక‌ట్ రామ్‌జీ, నిర్మాత‌లు:  పెర‌ల్ వి.పొట్లూరి, ప‌ర‌మ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నె, సినిమాటోగ్ర‌ఫీ: వ‌ంశీ ప‌చ్చిపులుసు, సంగీతం: శ‌్రీచ‌ర‌ణ్ పాకాల‌, ఆర్ట్‌: అవినాష్ కొల్ల‌, ఎడిటింగ్‌:  గ్యారీ బి.హెచ్‌, డైలాగ్స్‌:  అబ్బూరి ర‌వి, కాస్ట్యూమ్స్‌:  జాహ్న‌వి ఎల్లోర్‌, సురా రెడ్డి, సౌండ్ ఎఫెక్ట్స్‌:  య‌తిరాజ్‌, పి.ఆర్‌.ఒ:  వంశీ కాకా.