ఏమైపోతావే మూవీ రివ్యూ

ఏమైపోతావే మూవీ రివ్యూ

Emaipothaave movie review  

 

 

 

 

  ఏమైపోతావే మూవీ రివ్యూ

బ్యానర్ : ఎస్ ఎస్ పిక్చర్స్
దర్శకత్వం : సురేష్ కుమార్ కూసిరెడ్డి
నిర్మాత : సురేష్ కుమార్ కూసిరెడ్డి
సంగీతం : వసంత్ జి.
ఎడిటర్ : శివ శర్వాణి
సినిమాటోగ్రఫీ : కె. వెంకటేశ్
నటీనటులు : అమర్ లతు, చాందిని. బి, సారిపల్లి సతీష్, విజయ్ రామ్, నరేష్ రెడ్డి తదితరులు ..
విడుదల : 17-09-2021
జోనర్ : లవ్ అండ్ డ్రామా
రేటింగ్ : 3.25 / 5

`ఏమైపోతానే `అంటూ డిఫ‌రెంట్ టైటిల్, కాన్సెప్ట్ తో రూపొదిం పాట‌లు, ట్రైల‌ర్ తో సినిమా ఆడియ‌న్స్ లో క్రేజ్ ఏర్ప‌రిచింది. నూతన నటీనటులను పరిచయం చేస్తూ తెరకెక్కిన ఈ సినిమా ఈ వారం విడుద‌లైంది. ఈ అచ్చ‌మైన స్వ‌ఛ్చ‌మైన ప్రేమ క‌థా చిత్రం ప్రేక్ష‌కుల‌ను ఏ మేర‌కు ఆక‌ట్టుకుంటుందో తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం…

స్టోరి విష‌యానికొస్తే…

హీరో జ్యోతిష్ ( అమర్ ) నేటి తరం యువకుడు. మంచి ప్రతిభ ఉన్న యువకుడే కానీ అతనికి జాబ్ లేదు. ఆ ప్రయత్నాల్లో ఉండగా ఓ అందమైన అమ్మాయి శుభాని ( చాందిని ) ని చూసి ప్రేమలో పడిపోతాడు. ఆ తరువాత ఆమె ప్రేమకోసం ప్రయత్నాలు చేసి చివరికి ఆమెను తన ప్రేమలో పడేస్తాడు. కానీ శుభాని హీరో జ్యోతిష్ జీవితంలోకి వచ్చాకా అతని లైఫ్ అనుకోని మలుపు తీసుకుంటుంది. అసలు ఆ మలుపు ఏమిటి ? ఈ ప్రేమకోసం హీరో పడ్డ పాట్లేమిటి అన్నది తెలియాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే.

ఆర్టిస్ట్స్ ప‌ర్ఫార్మెన్స్ః
అమర్ కిది తొలి సినిమా అయినా చాలా చక్కని నటన కనబరిచాడు. ముఖ్యంగా అమ్మాయి ప్రేమకోసం ఓ ప్రేమికుడు పడే తపన, ఫీలింగ్స్ చక్కగా పలికించాడు. అలాగే మిగతా అంశాల్లో కూడా మెప్పించాడు. ఇక హీరోయిన్ చాందిని పేరుకు తగ్గట్టే అందం, నటన పుష్కలంగా ఉన్న అమ్మాయిలా కనిపించింది. సన్నివేశాల్లో చాందిని మెప్పించింది. హీరో, హీరోయిన్లమధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయింది. ఇక మిగతా పాత్రల్లో సారిపల్లి సతీష్ తండ్రి పాత్రలో ఆకట్టుకున్నాడు. ఇక మిగతా పాత్రల్లో విజయ్ రామ్, నరేష్ రెడ్డి త‌మ పాత్ర‌ల మేర‌కు బాగా న‌టించారు.

సాంకేతిక నిపుణుల ప‌నితీరుః
చిన్న బ‌డ్జెట్ లో రూపొందిన సినిమా అయినా దర్శకుడు ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. ప్రేమకథా చిత్రాలకు మ్యూజిక్ చాలా ముఖ్యం. ఈ విషయంలో సంగీతం అందించిన వసంత్ జి మంచి మార్కులు కొట్టేసాడు. సాంగ్ బాగున్నాయి. అలాగే ఆర్ ఆర్ విషయంలో కూడా చాలా చక్కని ప్రతిభ కనబరిచాడు. ఇక ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ అందించిన వెంకటేశ్ పనితనం బాగుంది. చాలా సన్నివేశాలు చాలా అందంగా చిత్రీకరించారు. సాంగ్స్ లో కూడా ఫోటోగ్రఫి ఆకట్టుకుంది. ఇక ఎడిటర్ శివ శర్వాణి పనితనం బాగుంది. అయితే అక్కడక్కడా కొన్ని రొటీన్ సన్నివేశాలు, బోర్ కొట్టించే అంశాల విషయంలో కత్తెరకు పనిచెబితే బాగుండేది. ఇక దర్శకుడు సురేష్ కుమార్ కూసిరెడ్డి ఎంచుకున్న ప్రేమకథ పాతదే అయినప్పటికీ నేటి తరం యువకుల ఆలోచన విధానం, వాళ్ళ బేస్ చేసుకుని చక్కగా తెరకెక్కించాడు. ప్రేమ విషయంలో యూత్ ఆలోచనలు ఎలా ఉన్నాయన్న విషయాన్నీ బాగా చూపించాడు. దర్శకుడిగా కొన్ని విషయాలు పక్కన పెడితే ఓవరాల్ గా బాగా చేసాడు. కొన్ని రొటీన్ సన్నివేశాల విషయంలో జాగ్రత్త పడిఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

విశ్లేషణ :
ప్ర‌జంట్ ట్రెండ్ కు క‌నెక్ట‌య్యే అంశాల‌తో రూపొందిన చిత్రం `ఏమైపోతానే`. టైటిల్ లోనే సినిమా కథ మొత్తం తెలిసిపోతుంది. టైటిల్ లో చెప్పినట్టు అచ్చమైన ప్రేమ, ఆ ప్రేమికుడి భావోద్వేగాలతో దర్శకుడు మంచి కథను తెరకెక్కించాడు. టెక్నీకల్ అంశాలు కూడా బాగున్నాయి. రెండు పాటలు ఆకట్టుకున్నాయి . మొత్తానికి ఓ చక్కని ప్రేమకథను ఎంజాయ్ చేసేవారికి మంచి సినిమా ఇది. సో డోంట్ మిస్ దిస్ మూవీ. గో అండ్ వాచ్.