Dulquer Salmaan interview about “Kanulu Kanulanu Dochayante”
‘కనులు కనులను దోచాయంటే’ ఒక రొమాంటిక్ థ్రిల్లర్ – దుల్కర్ సల్మాన్ !!
మణిరత్నం ‘ఓకే బంగారం’, నాగ అశ్విన్ ‘మహానటి’తో మన తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన దుల్కర్ సల్మాన్ హీరోగా హైదరాబాదీ అమ్మాయి రీతూ వర్మ హీరోయిన్ గా రేపు రాబోతున్న సినిమా ‘కనులు కనులను దోచాయంటే’. ఈ రొమాంటిక్ థ్రిల్లర్ కి దేసింగ్ పెరియసామి దర్శకుడు. నిర్మాణ సంస్థలు వయోకామ్ 18 స్టూడియోస్, ఆంటో జోసెఫ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించాయి. కాగా కె.ఎఫ్.సి. ఎంటర్టైన్మెంట్స్ తెలుగులో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తోంది. కాగా ఈ సందర్భంగా హీరో
దుల్కర్ సల్మాన్ మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు ఇప్పుడు మీ కోసం…
‘మహానటి’ సినిమాతో తెలుగు ప్రేక్షుకులకు బాగా దగ్గరయ్యారు. ?
అవును. ఆ సినిమా విడుదలైన అన్ని భాషల్లో నాకు మంచి పేరు తీసుకొచ్చింది.
మీరు ఎక్కువుగా ద్విభాషా చిత్రాల్లోనే నటిస్తున్నారు. ప్లాన్డ్ గానే ప్రాజెక్ట్స్ ను సెట్ చేసుకుంటారా ?
ఈ ప్రశ్న నన్ను రెగ్యులర్ గా అడుగుతుంటారు. అలా ఏమి ప్రత్యేకంగా ప్లాన్ చెయ్యను. నాకు నచ్చిన సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాను. కొన్ని కథలు అందరికీ కనెక్ట్ అయేవి ఉంటాయి. అలాంటి సినిమానే ‘కనులు కనులను దోచాయంటే’ సినిమా.
మరి ఇతర భాషల్లో సినిమాలు చేస్తున్నారు. మీరు ఎన్ని భాషలు మాట్లాడగలరు ?
మలయాళంతో పాటు ఇంగ్లీష్ అండ్ తమిళ్ మాట్లాడతాను. తెలుగు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటాను. తెలుగులో కొన్ని పదాలు చాల బాగా ఇష్టం.. అలాగే కొన్ని హిందీ ఉర్దూ పదాలు నాకు ఇంట్రస్టింగ్ గా అనిపిస్తాయి.
మీరు హీరోగానే కాకుండా మిమ్మల్ని కొత్తతరహా పాత్రల్లో త్వరలో చూడగలమా ?
అలాంటి వైవిధ్యమైన కథలు వస్తే కచ్చితంగా చేస్తాను. అయితే అది అందరికీ నచ్చేది అయి ఉండాలి.
‘కనులు కనులను దోచాయంటే’ సినిమా గురించి ?
ఇదొక రొమాంటిక్ థ్రిల్లర్. సినిమాలో మంచి లవ్ స్టోరీ ఉంది, అలాగే కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ చాల బాగా వచ్చాయి. ప్రతి ఒక్కరికీ ఈ సినిమా కనెక్ట్ అవుతుంది.
ఈ సినిమా ట్రైలర్ తెలుగు ప్రేక్షుకులను బాగా ఆకట్టుకుంది ?
అవునండి. ట్రైలర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. చాలామంది ట్రైలర్ గురించి వెరీ పాజిటివ్ కామెంట్స్ చేశారు. అలాగే సాంగ్స్ కు కూడా గుడ్ రెస్పాన్స్ వచ్చింది.
మీరు ఒక ప్రాజెక్ట్ ను యాక్సెప్ట్ చెయ్యాలంటే ప్రధానంగా ఏమి ఉండాలి ?
రైటింగే అండి. గుడ్ రైటింగ్ ఉంటేనే స్క్రిప్ట్ అవుట్ ఫుట్ పర్ఫెక్ట్ గా వస్తోంది. అలాంటి స్క్రిప్ట్ నే యాక్సెప్ట్ చేస్తాను. అలాగే నేను రీమేక్స్ కి వ్యతిరేకిని. మనం చేసే సినిమా కొత్తగా ఉండటానికి ట్రై చేస్తాను. అలాగే దర్శకుడి పై ఉన్న నమ్మకాన్ని బట్టి సినిమా అంగీకరించాలా లేదా నిర్ణయించుకుంటాను.
మీరు డైరెక్ట్ తెలుగు సినిమా మళ్లీ ఎప్పుడు చేస్తారు. ప్రస్తుతం ఎన్ని సినిమాలు చేస్తున్నారు ?
డైరెక్ట్ తెలుగు సినిమా ఈ ఇయర్ ఎండింగ్ లో చెయ్యొచ్చు. ఇక ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే మూడు చిత్రాలు ప్రొడక్షన్ లో ఉన్నాయి.