సక్సెస్ ఫుల్ దర్శక నిర్మాతకు హ్యాపీ బర్త్ డే!!
సక్సెస్ ఫుల్ దర్శక నిర్మాతకు హ్యాపీ బర్త్ డే!!
చేసింది నాలుగు సినిమాలైనా నలభై సినిమాలంత పేరు తెచ్చుకున్నారు డైరక్టర్ సంపత్ నంది. స్టోరి, టైటిల్ , హీరో లుక్, సాంగ్స్ , ఫైట్స్ , టేకింగ్ ఇలా ప్రతి విషయంలో ఎంతో కేర్ తీసుకుంటారు. డిఫరెంట్ గా ఉండేలా చూసుకుంటారు. అందుకే టాలీవుడ్ లో ఆయనకంటూ ఒక మార్క్ ఏర్పడింది. రైటర్ గా కెరీర్ ప్రారంభించి డైరక్టర్ గా మారారు సంపత్ నంది. `ఏమైంది ఈవేళ` అనే చిన్న సినిమాతో దర్శకుడుగా పరిచమయై తొలి సినిమాతోనే సక్సెస్ ఫుల్ డైరక్టర్ గా పేరు తెచ్చుకుని రెండో సినిమానే మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ తో `రచ్చ` చేసాడీ యంగ్ డైరక్టర్. రచ్చ సినిమా పెద్ద హిట్ కావడంతో కమర్షియల్ అండ్ మాసివ్ డైరక్టర్ గా పేరు తెచ్చుకుని పెద్ద హీరోల దృష్టిలో పడ్డారు. పవన్ కళ్యాణ్ లాంటి హీరో సైతం ఆయనతో సినిమా చేయాలనుకున్నారంటే దర్శకుడుగా సంపత్ నంది స్టామినా ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇక మూడో సినిమాను మాస్ మహారాజా రవితేజతో `బెంగాల్ టైగర్` చేసారు. సంతప్ నంది రైటింగ్, టేకింగ్ కి రవితేజ ఎనర్జీ తోడవడంతో బెంగాల్ టైగర్ బాక్సాఫీస్ వద్ద హల్ చల్ చేసింది. చూడటానికి క్లాస్ గా కనిపించినా, సంపత్ నంది మాంచి మాస్ ఎలిమెంట్స్, హీరోయిజం, కామెడీ, సెంటిమెంట్ ఇలా ఆల్ కమర్షియల్ అంశాలను పండించడంలో దిట్టగా పేరు తెచ్చుకున్నారు. తన సినిమాలో హీరో మెంటల్ గా, ఫిజికల్ గా స్ట్రాంగ్ గా ఉంటూ విపరీతంగా ఎంటర్ టైన్ చేస్తాడు. ఏదైనా సాధించే సత్తాగలవాడే ఉంటాడు. అందుకే ఆయన సినిమాలు ఆడియన్స్ కు అంతగా కనెక్ట్ అవుతుంటాయి. సంపత్ నంది దర్శకత్వంలో వచ్చిన నాలుగో సినిమా `గౌతమ్ నంద`. గోపిచంద్ డ్యూయల్ రోల్ చేసిన సినిమా. అప్పటి వరకు ఉన్న గోపిచంద్ ని కాకుండా కొత్త గోపిచంద్ ని ఈ సినిమాలో చూపించారు. గోపిచంద్ ఇలా కూడా ఉంటాడా? అనిపించేంతలా చాలా స్టైలిష్ గా చూపించాడు దర్శకుడు సంపత్. కొన్ని కారణాల వల్ల సినిమా ఆశించినంత గా ఆడకపోయినా, దర్శకుడుగా మాత్రం సంపత్ నందికి మంచి పేరు తెచ్చిందీ సినిమా. ప్రజంట్ ఓ యంగ్ హీరోతో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడీ యంగ్ అండ్ ఎనర్జిటిక్ డైరక్టర్. ఇక దర్శకుడుగా ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సంపత్ నంది టీమ్ వర్క్స్ పేరుతో బేనర్ స్థాపించి కొత్తవారిని ఎంకరేజ్ చేస్తూ `గాలిపటం`, పేపర్ బాయ్ చిత్రాలు నిర్మించారు. కొత్త సంగీత దర్శకులు, లిరిసిస్ట్ లు, డైరక్టర్స్ , ఆర్టిస్ట్స్ ని తన బేనర్ ద్వారా పరిచయం చేసారు. ఇలా ఎంతో మంది కొత్త వారికి లైఫ్ ఇస్తూ తన డైరక్షన్ లో మంచి సినిమాలు చేయాలని కోరుకుంటూ ఈ రోజు (జూన్ 20) న పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు బర్త్ డే శుభాకాంక్షలు తెలుపుతోంది తెలుగు వన్ డాట్ కామ్.