DIL RAJU Press Meet

DIL RAJU Press Meet
 
DIL RAJU Press Meet
రేట్స్ పెర‌గ‌డానికి ప్ర‌భుత్వానికి సంబంధం లేదుః దిల్ రాజు
     
          సూప‌ర్ స్టార్ మ‌హేష్ హీరోగా న‌టించిన చిత్రం `మ‌హ‌ర్షి`.  వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా దిల్ రాజు, అశ్వ‌నీద‌త్, పివిపి సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా రేపు విడుద‌ల‌వుతోంది. ఈ సంద‌ర్భంగా దిల్ రాజు మీడియాతో మాట్లాడుతూ…“మ‌హేష్ బాబు గారి కెరీర్ ల్లో ల్యాండ్ మార్క్ ఫిలిం `మ‌హ‌ర్షి`. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పిన‌ట్టు ఆయ‌న కెరీర్ లో ఉన్న టాప్  ఫిలింస్ ప‌క్క‌న మా సినిమా నిల‌బ‌డ‌బోతుంది.   ఫ్యాన్ ఎంత కోరుకుంటే అంత  ఉంటుంద‌ని చెప్పింది.. ఓవ‌ర్ కాన్ఫిడెంట్ తో కాదు . ఒక స్టార్ సినిమాకు కావాల్సిన మూమెంట్స్ అన్నీ ఉన్నాయి. ఈ సినిమాలో చాలా  ప్ర‌త్యేక‌త‌లు ఉన్నాయి.  త్రీ డేస్ బ్యాక్ సినిమా చూసాను …సినిమా పూర్త‌య్యాక వావ్ ఒక మంచి సినిమా చూసాన‌న్న ఫీలింగ్ వ‌చ్చింది. అది నేను తీయ‌క‌పోయినా ఎవ‌రు తీసినా నాకు వ‌చ్చే ఫీలింగ్ అదే.   ఇక అశ్వ‌నిద‌త్ 9 వ తేదీ సెంటిమెంట్ ఉంది. మ‌హాన‌టి, జ‌గ‌దేక వీరు డు సినిమాలు విడుద‌లై వండ‌ర్స్ సృష్టించాయి.    వంశీ గురించి ఎంత చెప్పినా  త‌క్కువే.  టాప్ ద‌ర్శ‌కుల్లో వంశీ ఈ సినిమాతో చేర‌బోతున్నాడు. టీమ్ అంతా కూడా ఎంతో క‌ష్ట‌ప‌డ్డారు. న‌రేష్‌, ప్ర‌కాష్ రాజ్,  జ‌య‌సుధ‌, జ‌గ‌ప‌తిబాబు గారు అంద‌రూ అద్భుతంగా చేసారు.  ఇదొక మ్యాజిక‌ల్ పిలిం. ఇది ఓవ‌ర్ కాన్ఫిడెన్స్ తో చెబుతున్న‌ది కాదు.  ప‌ది సినిమాలు గురించి  చెబితే ఒకే సినిమా మిస్స‌య్యా. 9 సినిమాలు ఆడాయి.భారీ బ‌డ్జెట్ తీసాము కాబ‌ట్టి  తెలంగాణ  గ‌వ‌ర్న‌మెంట్ ని 5 వ షో అడిగాం.  వారు అంగీక‌రించారు ..జీవో కూడా ఇచ్చారు.  ఇంత కు ముందు తెలంగాణ‌లో లేదు.  అదే ఆంధ్రాలో ఉద‌యం ఐదు గంట‌ల‌కే స్టార్ట్ అవుతాయి.   జీవో వ‌చ్చాక  చిన్న మిస్ క‌మ్యూనికేష‌న్ వ‌ల్ల  కొంత ప్రాబ్ల‌మ్  అంయింది. థియేట‌ర్స్ ఓన‌ర్స్ కోర్టు  ద్వారా  తెలంగాణ‌లో  రేట్స్ పెంచుకునేందుకు ప‌ర్మిష‌న్ తెచ్చుకున్నారు. అలాగే కొన్ని చోట్ల ఆంధ్రాలో కూడా పెరిగాయి.  తెలంగాణ‌లో   80 ద‌గ్గ‌ర 100, 110 ద‌గ్గ‌ర 125,  అలాగే మ‌ల్టీప్లెక్స్ లో 150 ద‌గ్గ‌ర 200 చేసారు. వీళ్లంతా కోర్టు ద్వారా ప‌ర్మిష‌న్ తెచ్చుకున్నారు త‌ప్ప తెలంగాణ ప్ర‌భుత్వం ద్వారా కాదు.   గుంటూరు, వైజాగ్, నెల్లూరు లో కూడా  రేట్స్ పెంచ‌డం  జ‌రిగింది.  బ‌డ్జెట్ పెరిగిన‌ప్పుడు  ఎగ్జిబీట‌ర్స్ కోర్టు ద్వారా ఇలా రేట్స్ పెంచుకోవ‌డం అనేది ఎప్ప‌టి నుంచో ఉంది. దీన్ని కొన్ని చాన‌ల్స్ తెలంగాణ ప్ర‌భుత్వం రేట్స్ పెంచుకునేందుకు ప‌ర్మిష‌న్ ఇచ్చిందంటూ ప్ర‌సారం చేసారు. కానీ తెలంగాణ ప్ర‌భుత్వం ఫిప్త్ షో ప‌ర్మిష‌న్ మాత్ర‌మే ఇచ్చింది.   ఇది కూడా కేవ‌లం ఒక వారం మాత్ర‌మే ఉంటుంది. రెవిన్యూ అనేది ప్ర‌స్తుతం వ‌చ్చేది కేవ‌లం నాలుగు రోజులు మాత్ర‌మే.  అది ఎంత పెద్ద సినిమా అయినా కూడా. పైర‌సీ పెద్ద  ఎత్తు న జ‌రుగుతుంది  కాబ‌ట్టి పెద్ద సినిమాలు వ‌చ్చిన‌ప్పుడు ఇలాంటి ప‌రిస్థితి త‌ప్ప‌డం లేదు.  వ‌ర‌ల్డ్ వైడ్ గా రెండు వేల థియేట‌ర్స్ లో సినిమా విడుద‌ల‌వుతోంది.  నాన్ బాహుబ‌లి వైజ్ మా సినిమా హ‌య్య‌స్ట్ స్క్రీన్స్ లో రిలీజ్ అవుతోంది“ అన్నారు.