Dil Raju is planning a mega project with megastar !!


మెగాస్టార్ తో మెగా ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తోన్న దిల్ రాజు!!
రామ్ చరణ్ తో ఎవడు, అల్లు అర్జున్ తో ఆర్య, పరుగు , వరుణ్ తేజ్ తో ఫిదా, ఎఫ్ 2, సాయితేజ్ తో సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీమ్ ఇలా వరుసగా మెగా హీరోలతో సినిమాలు చేసి వరుసగా సక్సెస్ లు సాధించి , మెగా హీరోలకు అచ్చొచ్చిన నిర్మాతలలో ఒకరుగా పేరు తెచ్చుకున్నారు దిల్ రాజు. ఇక ఈ చిత్రాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురిపించాయి. ఇక ఎప్పటి నుంచో చిరంజీవితో సినిమా చేయాలన్న దిల్ రాజు డ్రీమ్ త్వరలో తీరబోతున్నట్లు తెలుస్తోంది. అవును త్వరలో మెగాస్టార్ చిరంజీవితో దిల్ రాజు ఓ మెగా ప్రాజెక్ట్ భారీ బడ్జెట్ తో రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ గురించి చిరంజీవితో చర్చలు కూడా జరిపాడట దిల్ రాజు. త్వరలో దీనిపై అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశాలున్నాయట. ఇక ప్రస్తుతం చిరంజీవి `సైరా నరసింహా రెడ్డి` లో నటిస్తున్నాడు. ఆ తర్వాత కొరటాల దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. ఇక ఈ రెండింటి తర్వాత దిల్ రాజు బేనర్ లో చిరంజీవి సినిమా చేసే అవకాశాలున్నాయంటున్నారు సినీ జనాలు.