ధ్వని మూవీ రివ్యూ!

ధ్వని మూవీ రివ్యూ!

ధ్వని మూవీ రివ్యూ!

 

 


 

న‌టీన‌టులుః ర‌వీంద్ర రెడ్డి, విన‌య్‌, ప్రాణి గ్ర‌హి, త్రినాథ్ వ‌ర్మ , స్వాతి మందాడి, భావ‌న సాగి
నిర్మాత‌లుః  సాయి సాధన నన్నపనేని, సాన పరమకృష్ణ
ద‌ర్శ‌క‌త్వంః  నాని సాన
 సినిమాటోగ్ర‌ఫీః శ‌శాంక్ శ్రీరామ్  
సంగీతంః ప్రతీక్ అభ్యంక‌ర్ , ఆనంద్ నంబియార్‌
 విడుద‌ల తేదిః మే 20-2022
రేటింగ్ః 3.5/5
   రవీంద్ర రెడ్డి, వినయ్ ప్రాణి గ్రహి, త్రినాధ్ వర్మకథానాయకులుగా స్వాతి మందాడి, భావన సాగి కథానాయికలుగా,  సాయి సాధన నన్నపనేని, సాన పరమకృష్ణ నిర్మాణంలో నాని సాన దర్శకత్వం లో రూపొందిని  సినిమా “120DB  ధ్వని.  పోస్ట‌ర్స్, టీజ‌ర్, ట్రైల‌ర్ తో హైప్ క్రియేట్ చేసిన ఈ చిత్రం  ఈ నెల 20 న థియేట‌ర్స్ లో గ్రాండ్ గా విడుద‌లైంది. మ‌రి ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ను ఏ మేర‌కు ఆక‌ట్టుకుందో తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం…
  స్టోరిలోకి వెళితే…
 అరుణ్, సాగర్, మరియు కిరణ్ ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ . సరదాగా కాలాన్ని గడుపుతుంటారు.  అనుకోని ఇక ఇన్స్ డెంట్ వ‌ల్ల  అరుణ్ తలకు గాయం అవుతుంది.  ఈ క్రమంలో అరుణ్  వినికిడి కోల్పోతాడు . ఇలా ఉన్న అతని జీవితంలోకి చిత్ర అనే అమ్మాయి వ‌స్తుంది.  వీరిద్దరూ వివాహం చేసుకుంటారు. అంతా బాగుంది అనుకునే స‌మ‌యంలో అరుణ్ ఒక విష‌యంలో మోస‌పోతాడు.  ఆ మోసానికి కార‌కులు ఎవ‌రు?  అస‌లు అరుణ్ జీవితంలో జ‌రిగే ఇన్స్ డెంట్స్ కి కార‌కులు ఎ వ‌రు ?  చివ‌రికి క‌థ ఎలాంటి మ‌లుపులు తిరిగింది అన్న‌ది మిగ‌తా స్టోరి.
 
 సాంకేతికి నిపుణుల ప‌ని తీరుః
 ఇది  సౌండ్ బేస్డ్ స్టోరి.  డైరెక్టర్ నాని సాన ఈ కథ నీ చాలా చక్కగా రాసుకున్నారు. అలాగే రాసుకున్న కథని అద్భుతంగా ప్ర‌జంట్ చేశారు.  వెండి తెర మీద ప్రతి ఫ్రేమ్, ప్రతి సన్నివేశం ఇన్నోవేటివ్ గా, ఇంట్ర‌స్టింగ్ గా తీర్చిదిద్దాడు. తొలి సినిమా డైరెక్టర్ అయినా కూడా  ఎక్క‌డా త‌డ‌బ‌డ‌కుండా తెర‌కెక్కించాడు.  ఇక శశాంక్ శ్రీరామ్ కెమెరా పనితనం మెచ్చుకునేలా ఉంది.  ప్రతీక్ అభ్యంక‌ర్  పాల‌టు  సినిమాకు ప్ల‌స్ అయ్యాయి.  ఆనంద్ నంబియార్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో  సినిమాను  నెక్ట్స్ లెవ‌ల్ కు తీసుకెళ్లారు. అల్లావుద్దీన్ ఎడిటింగ్ ఇంకాస్త బెట‌ర్ గా ఉంటే సినిమా స్పీడ్ పెరిగేది. ఇక నిర్మాత‌లు ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా ద‌ర్శ‌కుడికి స‌హ‌క‌రించ‌డంతో సినిమాను క్వాలిటీగా తీయ‌గ‌లిగాడు ద‌ర్శ‌కుడు.
  న‌టీన‌టులు ప‌నితీరుః
 హీరో వినయ్ పాణిగ్రహి సౌండ్ ఎఫెక్ట్ తో బాధపడుతున్న కుర్రాడి క్యారక్ట‌ర్ లో అద్భుత‌మైన ప‌ర్ఫార్మెన్స్ క‌న‌బ‌రిచాడు. ముక్యంగా ఎమోష‌న‌ల్ సన్నివేశాల్లో త‌న హావ‌భావాలు ఆడియ‌న్స్ ని మైమ‌రిపిస్తాయి.   త్రినాథ్‍ వర్మ మరియు రవీందర్‍ రెడ్డి తమ న‌ట‌న‌తో ర‌క్తి క‌ట్టించారు.  హీరోయిన్ భానవ సాగి అందం , అభిన‌యం సినిమాకు అద‌న‌పు ఆక‌ర్ష‌ణ అని చెప్ప‌వ‌చ్చు.  ఒక వైపు సమాజం కోసం, మరో వైపు తన ఫ్రెండ్ ని  కాపాడుకోవడం కోసం హీరో ప‌డే త‌ప‌న చాలా బాగుంది.  రవీందర్ రెడ్డి నటన, ఆయన క్యారీ చేసిన ఎమోషన్, కోపం, లవర్ బాయ్ గా, ఫ్రెండ్ కి కష్టాల్లో తోడుండే ఫ్రెండ్ గా ప్ర‌జంట్ ట్రెండ్ ని క‌దిలించేలా న‌టించాడు.  కథానాయిక స్వాతి తన పాత్ర పరిధిలో నటించింది.  సినిమాలోని మిగతా యాక్టర్స్ కూడా వాళ్ళ పాత్ర పరిధి లో నటించి మెప్పించారు.
 విశ్లేష‌ణ లోకి వెళితే..
ప్రేక్షకులనుండి సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ వ‌స్తోంది.  సినిమా మొదటి భాగం లో అన్ని క్యారెక్టర్స్ ని పరిచయం చేసి ఇంటర్వెల్ ముందు ఊహించని మలుపు తిప్పి బ్రేక్ ఇచ్చారు ద‌ర్శ‌కుడు. తర్వాత మొదటి సన్నివేశం నుండే చాలా ఆసెక్తి గా మొదలు అయ్యి పతాక సన్నివేశాలకు చేరుకోగానే ఊహించని మలుపులతో సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చారు ద‌ర్శ‌క‌డు. శబ్ధానికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన వ్యాధితో బాధపడే వ్యక్తి జీవితంలో జరిగిన సంఘటనల సమాహారమే ఈ ధ్వని చిత్రం. సస్పెన్స్ థ్రిల్లర్‍గా రూపొందిన ఈ సినిమా కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పించింది. ఇందులో కాన్సెప్ట్ ఆకట్టుకునేలా ఉండడమే కాకుండా స్క్రీన్ ప్లే కొత్తగా ఉంది.  ద‌ర్శ‌కుడు సినిమాను అత్యంత ఆసక్తికరంగా తెరకెక్కించారు. కొత్త కాన్సెప్ట్స్ తో వస్తున్న సినిమాలను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. అదే తరహాలో వచ్చిన ధ్వని సినిమా అందరిని అలరిస్తుంది చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎక్కడా బోరింగ్ లేకుండా ట్విస్టులతో సాగే ధ్వని సినిమాను అన్ని ఏజ్ గ్రూప్స్ వారు చూసి ఎంజాయ్ చేయొచ్చు. సో గో అండ్ వాచ్ ధ్వ‌ని మూవీ. డోంట్ మిస్‌.
సూటిగా చెప్పాలంటేః థియేట‌ర్స్ లో దద్ద‌రిల్లిన ధ్వ‌ని!