విమర్శకుల ప్రశంసలు పొందిన ‘ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్’ చిత్రం

విమర్శకుల ప్రశంసలు పొందిన ‘ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్’ చిత్రం

విమర్శకుల ప్రశంసలు పొందిన
‘ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్’ చిత్రం

 

చిన్న చిత్రంగా మే 12న విడుదలై విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రంగా ‘ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్’ నిలిచింది. ఈ చిత్రానికి‌ రవిప్రకాష్ దర్శకుడు. హీరో హీరోయిన్లగా నిహాల్, ద్రిషికా చందర్ నటించారు. ఈ చిత్రాన్ని ఛార్మి నటించిన ‘మంత్ర’, అనుపమ పరమేశ్వరన్ ‘సీతాకోకచిలుక’ చిత్రాలను నిర్మించిన జెన్ నెక్స్ట్ మూవీస్ నిర్మించింది. ఆ రెండు చిత్రాలు ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. ఈ రెండు బ్లాక్‌బస్టర్‌లను నిర్మించిన అదే ప్రొడక్షన్ హౌస్ ఇప్పుడు ‘ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్’ నిర్మించింది. ‌ఒక సాధారణ మధ్య తరగతి అమ్మాయి, అబ్బాయికి మధ్య సాగే ప్రేమకథే ఈ చిత్రం.‌ ప్రేమకథతో పాటు మంత్రముగ్ధులను చేసే పాటలు, యాక్షన్ సీక్వెన్స్ కలగలిపి అన్ని ఎమోషన్స్ నిండుగా ఉండడంతో ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకుంటుంది. ఒక చిన్న బడ్జెట్ చిత్రం అధిక సంఖ్యలో స్క్రీన్‌లు, షోలతో నడవడం అంత సులభం కాదు. ఇంతలా‌ దూసుకుపోతుందంటే అది సినిమాలో దమ్ముకు నిదర్శనం.