`క్లూ `మూవీ రివ్వ్యూ !!
`క్లూ `మూవీ రివ్వ్యూ !!
నిర్మాత : కాశి విశ్వంత్ నాగుబండి
దర్శకత్వం : వెంకటేశ్వర్లు కరడి
ఎడిటింగ్ : K.R. స్వామి
కెమెరామెన్ : ఎన్. రవి కుమార్ రెడ్డి
సంగీతం : ప్రజ్వల్ క్రిష్
కో డైరెక్టర్ — కె. సేతుపతి
సాహిత్యం — పోతుల రవి కిరణ్
నటీనటులు : భూమిరెడ్డి వెంకటరెడ్డి, ఆర్. ఐశ్వర్య, జీనాథ్ కపాడియా, నవీన్ కుమార్, అనిల్, విజయ్, గౌతమి, తదితరులు
జానర్ : సస్పెన్స్ థ్రిల్లర్
విడుదల : 24-09-2021
రేటింగ్ : 3.25/ 5
థ్రిల్లర్ చిత్రాలు ఇష్టపడని వారుండరు. అలా థ్రిల్లర్ కథాంశంతో వచ్చిన చిత్రం ` క్లూ`. ఈ చిత్రం పాటలు, ట్రైలర్స్ టాలీవుడ్ లో క్యూరియాసిటీ ఏర్పరిచాయి. మరి ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం ఇటీవల విడుదలైంది. ప్రేక్షకులు రెస్పాన్స్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
కథ :
హీరో రోహిత్ ( వెంకట్ రెడ్డి ) తన భార్య పవిత్ర ( ఐశ్వర్య )ను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. ఇద్దరు వారి కాపురం చాలా అన్యోన్యంగా సాగుతున్న క్రమంలో అనుకోకుండా ఓ ముగ్గురు యువకులు తన భార్య ఐశ్వర్య ను కిడ్నాప్ చేసినట్లు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కంప్లైంట్ ఇస్తాడు. ఆ కేసు తీసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలు పెడతారు.. అయితే ఎవరు ఊహించని విధంగా ఆ నేరస్థులు ఒకరి తర్వాత ఒకరు హత్య చేయబడటం చూసి వారు ఆశ్చర్యపోయారు. అసలు ఈ యువకులను ఎవరు చంపుతున్నారు? కిడ్నాప్ కు గురైన పవిత్ర ఎక్కడుంది. లాంటి ఆసక్తి కార అంశాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే .
ఆర్టిస్స్ పర్పార్మెన్స్ః
ఈ చిత్రంలో హీరోగా వెంకట్ రెడ్డి వైవిధ్యమైన పాత్రలో కనిపించాడు. ఆ పాత్రకు చక్కగా సరిపోయాడు. కొన్ని సన్నివేశాల్లో హీరో చూపించిన ఇంటెన్సిటీ ఆకట్టుకుంటుంది. పతాక సన్నివేశాల్లో అతని టాలెంట్ బయటికి వస్తుంది. నటన పరంగా తనకు కెరీర్లో అత్యుత్తమ పాత్రల్లో ఇదొకటిగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. ఇక హీరోయిన్ గా చేసిన ఐశ్వర్య బాగా చేసింది. మోడర్న్ అమ్మాయి పాత్రలో అటు రొమాంటిక్, ఇటు గ్లామర్ పరంగా ఆకట్టుకుంది. ఇక ఆర్టిస్టుల్లో జీనాథ్ కపాడియా, నవీన్ కుమార్, అనిల్, విజయ్, గౌతమి, చాలా సహజంగా పాత్రల్లో ఒదిగిపోయారు.
సాంకేతిక నిపుణుల పనితీరుః
కెమెరామెన్ రవి కుమార్ రెడ్డి అందించిన ఫోటో గ్రఫీ బాగుంది. సినిమాలోని సస్పెన్స్ ను బాగా డ్రైవ్ చేసింది. ప్రతి ఫ్రేమ్ చాలా చక్కగా ఉంది. ముఖ్యంగా చాలా సన్నివేశాల్లో ప్రేక్షకుడికి మరింత ఆసక్తి కలిగించేలా ఇంటెన్స్ తో ఉంది. ఇక సంగీతం అందించిన ప్రజ్వల మరో హైలెట్ అని చెప్పాలి. ఈ సినిమాలోని సాంగ్స్ కంటే కూడా ఎక్కువ ప్రాముఖ్యత ఆర్ ఆర్ కె ఇచ్చారు. కథలో లీనం అవుతూ మ్యూజిక్ సాగుతుంది. ఇక ఎడిటింగ్ కూడా బాగుంది. K.R. స్వామి ఎడిటింగ్ విషయంలో అయితే ఫస్ట్ హాఫ్ లో కొన్ని బోరింగ్ సన్నివేశాల నిడివి తగ్గిస్తే బాగుండేది. ఇక నిర్మాత కాశి విశ్వంత్ నాగుబండి కథ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక దర్శకుడు వెంకటేశ్వర్లు కరడి ఎంచుకున్న కథ చాలా ఇంట్రస్టింగ్ గా ఉండటమే కాకుండా దాన్ని తెరకెక్కించడంలో పాస్ మార్కులు కొట్టేశారు. బలమైన సీన్స్, మంచి పవర్ ఫుల్ డైలాగ్స్ తో కథను నడిపిన విధానం బాగుంది. మొత్తానికి సస్పెన్స్ థ్రిల్లర్ అంశాలతో తెరకెక్కిన ఈ కథ ఆకట్టుకుంది.
ఫైనల్ గా చెప్పాలంటేః
కథానాయకుడు వెంకట్ రెడీ నటన, హీరోయిన్ గ్లామర్, నటన , దర్శకుడు ఎంచుకున్న పాయింట్ సినిమాకు హైలెట్స్. సంగీతంతో పాటు సాహిత్యం కుదిరాయి. మొత్తానికి సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారికి ఓ కొత్త తరహా ఇంటెన్స్ ఉన్న థ్రిల్లర్ గా క్లూ సినిమా చూడొచ్చు. డోంట్ మిస్ దిస్ వీక్ మూవీ. గో అండ్ వాచ్.