Chalo Premiddam Movie Review
Chalo Premiddam Movie Review
నటీనటులుః సాయి రోనక్, నేహ సోలంకి, శశాంక్, సిజ్జు, అలీ, నాగినీడు, పోసాని కృష్ణమురళి, రఘుబాబు, బాహుబలి ప్రభాకర్, హేమ, రఘు కారుమంచి, సూర్య, తాగుబోతు రమేష్
చిత్రానికి సంగీతంః భీమ్స్ సిసిరోలియో
పాటలుః సురేష్ గంగుల, దేవ్
ఎడిటింగ్ః ఉపేంద్ర జక్క
ఆర్ట్ డైరక్టర్ః రామాంజనేయులు
ఫైట్స్ః నభా-సుబ్బు
కొరియోగ్రఫీః వెంకట్ దీప్
సినిమాటోగ్రఫీః అజిత్ వి.రెడ్డి, జయపాల్ రెడ్డి
నిర్మాతః ఉదయ్ కిరణ్
రచన-దర్శకత్వంః సురేష్ శేఖర్ రేపల్లె
విడుదల తేదిః 19-11-21
రేటింగ్: 3.25/5
ఈ మధ్య కాలంలో కుటుంబ కథా చిత్రాలు తక్కువగా వస్తున్నాయి. ఆ లోటు తీర్చేలా స్వఛ్చమైన ప్రేమతో కూడిన కటుంబ కథా చిత్రంగా రూపొందిన చిత్రం `ఛలో ప్రేమిద్దాం`. పోస్టర్స్ దగ్గర నుంచి పాటలు, టీజర్, ట్రైలర్ ఇలా ఈ సినిమాకు సంబంధించిన ప్రతిదీ సినిమాపై క్రేజ్ ని పెంచాయి. దీంతో విడుదలకు ముందే సినిమా పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఫీల్ గుడ్ లవ్ ఫ్యామిలీ థ్రిల్లర్ గా తెరకెక్కింది. ఈ రోజు విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో చూద్దాం..!
కథః
మిడిల్ క్లాప్ ఫ్యామిలీ కి చెందిన హీరో రావు (సాయి రోనక్) స్టడీ కోసం హైదరాబాద్ వెళతాడు. అతనికి అదే కాలేజ్‌లో చదువుతున్న మధు(నేహా సోలంకి)తో పరిచయమవుతుంది.. అది ప్రేమగా మారుతుంది. వీళ్ళిద్దరూ మధు అక్క పెళ్లికి ఊరికి వెళతారు. అక్కడ మధు పెదనాన్న పెద్దప్ప(నాగినీడు)కి చాలా మందితో శత్రుత్వం వుంటుంది. అతన్ని చంపాలని చాలామంది(బాహుబలి ప్రభాకర్ తదితరులు) చూస్తుంటారు. అయితే పెద్దప్పను శివుడు(శశాంక్)ఎప్పటికప్పుడు శత్రువుల నుంచి కాపాడుతూ వస్తుంటాడు. అయితే ఆ ఊళ్ళోకి రావు రాగానే పెద్దప్ప శత్రువులను ఒక్కొక్కరిని మంచోళ్ళుగా మారుస్తూ… పెద్దప్పకు శత్రువులు లేకుండా చేస్తూ వస్తుంటాడు. కట్ చేస్తే రావుని హత్యాయత్నం కేసులో ఇరికించి, మధుని చంపాలని ఆమెను కిడ్నాప్ చేస్తారు. మరి రావు హత్యాయత్నం కేసు నుంచి ఎలా బయటపడ్డారు? మధుని కిడ్నాప్ ఎవరు చేశారు? రావు, మధులిద్దరూ కలిశారా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే…
విశ్లేషణలోకి వెళితే…
ఎక్కడా ప్రేక్షకుడికి బోరింగ్ లేకుండా ఫస్టాప్ అంతా రన్ చేశాడు దర్శకుడు సురేష్ రేపల్లె. సినిమా ఫస్ట్ హాఫ్ లో హీరో, హీరోయిన్ ల మధ్య లవ్ ట్రాక్, ఫన్ అంతా ఎంటర్ టైనింగ్ సాగుతుంది. `సెల్ ఫోన్ ఎక్కువగా మాట్లాడితే మ్యాటర్ పనిచేయదు` అనే డైలాగ్ ని హీరోయిన్ చేత చెప్పించి బాగా ఫన్ క్రియేట్ చేసాడు. మరో సందర్భంలో “పని అయిపోయిందా”అనే డైలాగ్ తో యూత్ ని ఆకర్షించేలా దర్శకుడు స్క్రిప్ట్ కి తగ్గట్టు సంభాషణలు రాయించుకున్నారు. అలానే పోసాని కృష్ణ మురళితో కూడా మంచి ఫన్ పండించే ప్రయత్నం చేశారు దర్శకుడు సురేష్ . ఇక సెకెండ్ హాఫ్ లో నాగి నీడు, శశాంక్ పాత్రలు ఎంటర్ చేసి… మాస్ మెచ్చేలా కమర్షియల్ యాక్షన్ ఎలిమెంట్స్ జోడించి… సెకెండ్ హాఫ్ పై మరింత ఆసక్తిని పెంచారు. క్లయిమ్యాక్స్ లో… అసలు విలన్ ఎవరనేది రివీల్ చేసి.. ఆడియన్స్ ని థ్రిల్ కు గురి చేసాడు. ఇలా “ఛలో ప్రేమిద్దాం”మూవీని అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా తీర్చిదిద్ధి.. సక్సెస్ అయ్యారు దర్శకుడు.
ఆర్టిస్ట్స్ -టెక్నీషియన్స్ పనితీరుః
ఈ సినిమా ఆర్టిస్టుల గురించి చెప్పే ముందు హీరోయిన్ నేహ సోలంకి గురించి చెప్పుకోవాలి. ఓపెన్ గా ఉన్నదున్నట్టు కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడే టైప్ హీరోయిన్. తన పాత్ర బొమ్మరిల్లులోని హాసిని పాత్రను గుర్తు చేస్తుంది. నేహ చాలా బాగా చేసింది ఆ పాత్రను. చాలా నేచరల్ గా నటించింది. సాయి రోనక్ పర్వాలేదనిపించేలా నటించాడు.
పెద్దప్ప పాత్రలో నాగి నీడు మెప్పించారు. అతని ప్రధాన అనుచరుడు శివుడి పాత్రలో శశాంక్ ఆశ్చర్యపరిచాడు. ఇలాంటి పాత్రలు కూడా శశాంక్‌తో చేయవచ్చా అనే విధంగా దర్శకుడు డిజైన్ చేశాడు. హీరో తండ్రి పాత్రలో పోసాని, తల్లి పాత్రలో హేమ, విలన్ గా బాహుబలి ప్రభాకర్ తమ పాత్రల పరిధి మేరకు మెప్పించారు.
సినిమాకు మరో హైలెట్ అంటే భీమ్స్ అందించిన నేపధ్య సంగీతం, పాటలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. సినిమాటోగ్రఫీ రిచ్ గా ఉంది. ఖర్చుకి వెనుకాడకుండా సినిమాను నిర్మించారు నిర్మాత ఉదయ్ కిరణ్. ఒక క్యూట్ అండ్ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చూడాలంటే ఛలో ప్రేమిద్దాం చిత్రానికి వెళ్లాల్సిందే.
ఫైనల్ గా చెప్పాలంటేః ఆల్ ఏజ్ గ్రూప్ వాళ్లకు నచ్చే `ఛలో ప్రేమిద్దాం`