బాలీవుడ్లోకి బ్రోచేవారెవరురా

టాలీవుడ్ సూపర్ హిట్ మూవీ బ్రోచేవారెవరురా త్వరలో బాలీవుడ్ లోకి రీమేక్ కాబోతుంది. తెలుగులో శ్రీ విష్ణు, నివేదా థామస్, సత్యదేవ్, నివేదా పేతురాజ్ నటించిన ఈ చిత్రానికి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించారు. బ్రోచేవారెవరురా చిత్రం బాలీవుడ్ రైట్్స అజయ్ దేవగన్ తీసుకున్నట్లు సమాచారం. బాలీవుడ్ రీమేక్ అవుతున్న ఈ చిత్రంలో అభయ్ డియోల్, కరణ్ డియోల్ హీరోలుగా దేవెన్ ముంజల్ దర్శకత్వం వహించనున్నారు. హిందీ ప్రేక్షకుల అభిరుచి అనుగుణంగా కథను మార్చి వచ్చే సంవత్సరం ఆరంభంలో ఈ సినిమా సెట్్స మీదకు వెళ్లే అవకాశం ఉంది.