అందరిని ఆలోచింపజేసే ‘భూమి’ చిత్రం!
మహిళల ఫై జరుగుతున్నా అఘాయిత్యాలు ఎంత ఘోరంగా ఉంటున్నాయో అందరికి తెలిసిన నిజం. దానికి ప్రత్యక్ష సాక్ష్యం.. ఐటి యుగంలో ఉన్నాకూడా దేశంలో ప్రతి ఐదు నిమిషాలకు ఒక అమ్మాయి పై అఘాయిత్యం జరుగుతూనే ఉంది. ఇంకా మృగాళ్ల దాడిలో మహిళ భలి అవుతూనే ఉంది.. ఈ అఘాయిత్యాలకు అంతే లేదా? అనే కోణంలో ఓ మిహిళ తన జీవితాన్ని చిత్రం చేసిన ఓ మానవ మృగం పై తీర్చుకున్న పగ నేపథ్యంలో తెరకెక్కిన లఘు చిత్రం భూమి. నజియా షైక్, అరుణ్ బాబు, సతీష్ సారిపల్లి, లక్ష్మి కళ్యాణి ముఖ్య పాత్రల్లో రాఘవేంద్ర కటారి దర్శకత్వంలో నజియా షేక్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నజియా షేక్ నిర్మించిన షార్ట్ ఫిలిం భూమి. ఈ చిత్రానికి కెమెరా దిలీప్ కె కుమార్. ఈ లఘు చిత్రం ప్రివ్యూ హైద్రాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అథిదులుగా యువ హీరో సుధాకర్ కొమాకుల, దర్శకులు హరినాధ్ బాబు, యోగి కుమార్, జనార్దన్ ఎడ్వార్డ్ యోయో ముకుంద్, నిర్మాత రాజీవ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ఈ చిత్రంలో లీడ్ రోల్ పోషించిన నజియా షేక్ మాట్లాడుతూ.. ఈ కథను రాఘవేంద్ర చెప్పినప్పుడు చాలా కొత్తగా అనిపించింది. మనం ఇప్పటి వరకు అమ్మాయిలపై జరిగిన దాడుల గురించి చర్చించిన కథలను చూసాం, కానీ ఇందులో ఒక బాధితురాలి వేదన ఎలా ఉంటుంది అన్న కోణంలో కథ చెప్పడం జరిగింది. ఈ పాత్ర నేనే పోషించాను. దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించాడు, కెమెరా మెన్ దిలీప్ చాలా కష్ట పడ్డారు. బడ్జెట్ చాలా తక్కువ ఇచ్చాను అయినా కష్టపడి చేసారు. క్వాన్టిటి అండ్ క్వాలిటీ ఉంది.. ఒక దర్శకుడు నరేషన్ ఇచ్చేటప్పుడు బడ్జెట్ అడగకండి.. కథ నచ్చితే అప్పుడు చెప్పండి. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ కూడా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. అలాగే రాహుల్ అల్లం కూడా మంచి సౌండ్స్ ఇచ్చారు. థాంక్స్ రాహుల్, అలాగే అక్షయ స్టూడియో కి థాంక్స్. ఈ మూవీ కి పనిచేసిన ప్రతి ఒకరికి థాంక్స్ చెప్పాలి. రాజీవ్ గారికి ముందు థాంక్స్ చెప్పాలి.. సినిమా 30 మినిట్స్ అన్నా కూడా అది ఎంత సేపు ఉందన్నది కాదు కంటెంట్ ముఖ్యం అని అయన ఈ సినిమా తీసుకున్నారు. నన్ను ఆర్టిస్ట్ గా ఎంకరేజ్ చేసిన మీ అందరికి థాంక్స్, ఇది ఓటిటి ప్లాట్ ఫార్మ్ ఎం ఎక్స్ మీడియా లో విడుదల అవుతుంది, అలాగే తప్పకుండా మీ అందరి సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నాను అన్నారు.
యువ హీరో సుధాకర్ కొమాకుల మాట్లాడుతూ .. నిజంగా ఇలాంటి కథను ఎంచుకున్న నజియా గారిని అభినందిస్తున్నాను. నిజంగా ఈ షార్ట్ ఫిలిం చూసాకా ఆమెపై చాలా రెస్పెక్ట్ పెరిగింది. ఇలాంటి షార్ట్ ఫిలిమ్స్ ను కమర్షియల్ వె లో కాకుండా చాలా బోల్డ్ క్యారెక్టర్ చేయడం. ముక్యంగా ఆమె చేసిన బాత్ రూమ్ సీన్ చూసి నా మైండ్ బ్లాక్ అయింది. నిజంగా ఇలాంటి దైర్యం చేసిన నజియా గొప్ప ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకుంటుంది. మనం రోజు పేపర్స్ లో ఇలాంటి న్యూస్ చూస్తుంటాం.. కానీ వాళ్ళ కు న్యాయం జరిగిందా లేదా అన్నది ఆలోచించం .. ముక్యంగా వారి పెయిన్ ఎలా ఉంటుందో చూపించారు ..నిజంగా ఒళ్ళు గగుర్పొడించింది. నిజంగా ఈ మేకింగ్ కు హాట్స్ హాఫ్ చెప్పాలి, దర్శకుడు రాఘవేంద్ర నిజంగా నువ్వు పెద్ద డైరెక్టర్ అవుతావు.. తప్పకుండా చాలా అవార్డ్స్ రావాలి , ముక్యంగా నేషనల్ అవార్డు కూడా రావాలని కోరుకుంటున్నాను అన్నారు.
దర్శకుడు రాఘవేంద్ర మాట్లాడుతూ .. ఈ సినిమా చూడడానికి వచ్చిన మీ అందరికి థాంక్స్, మీ సపోర్ట్ ఉంటుందని అర్థం అయింది. ఈ సినిమా మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. నేను రాణి ఫిచర్ ఫిలిం ఆగిపోయినప్పుడు నజియా గారు సపోర్ట్ చేసి, ఆ తరువాత ఈ షార్ట్ ఫిలిం గురించి ఆమె నాతొ డిస్కషన్ చేశాను. నిజానికి రాణి ఫిలిం తరువాత సినిమా చేయాలనీ అనుకున్నపుడు మళ్ళీ 30 నిమిషాల షార్ట్ ఫిలిం చేస్తానని అనుకోలేదు. కెమెరా దిలీప్ చాలా కష్టపడి మంచి అవుట్ ఫుట్ ఇచ్చారు. అలాగే మ్యూజిక్, ఎడిటింగ్ అందరికి నేను థాంక్స్ చెప్పాలి. అలాగే అరుణ్ కూడా చాలా ఇన్వాల్వ్ అయ్యాడు. అరుణ్ చాలా ఇవాల్వ్ అయి నటించాడు.. నజియా కు పోటీగా నటించారు. ఇందులో బాత్ రూమ్ సీన్ చేయడానికి కారణం నేను రియల్ గా విన్నాను.. ఒక అమ్మాయి రేప్ కు గురయి కూడా నాలుగేళ్ళ తరువాత ఇన్ఫెక్షన్స్ వచ్చి ఎంత బాధ పడిందో విన్నాను అందుకే ఆ పెయిన్ చెప్పాలని అనుకున్నాను అన్నారు. అలాగే మిగతా నటీనటులు కూడా వారి వారి పాత్రల్లో ఆకట్టుకున్నారు. ఈ నాలుగు పాత్రలు చాలా అద్భుతంగా పండించారు. ఇక్కడికి వచ్చిన గెస్ట్స్ అందరికి థాంక్స్ అన్నారు .
అరుణ్ బాబు మాట్లాడుతూ .. ఇక్కడికి వచ్చిన అందరికి థాంక్స్. రెండేళ్ల క్రితం రాణి అనే రాణి ఫిచర్ ఫిలిం చూసాను.. ఆ సినిమా అయ్యాక చాలా సేపు అలాగే కూర్చొని ఉన్నాను.. నేను కూడా ఇలాంటి దర్శకుడితో పనిచేస్తే బాగుంటుంది అన్న ఆలోచన కలిగింది. ఆ తరువాత సంభవామి యుగే యుగే అనే షార్ట్ ఫిలిం చేశాను. ఒకరోజు నరేష్ ఫ్రెండ్ నాకు ఫోన్ చేసి రాఘవేంద్ర కటారి ఫోన్ చేస్తానని అన్నారు.. అతనితో మాట్లాడాకా నేను వెంటనే చేస్తానని చెప్పాను. ఈ ఫిలిం లో బాత్ రూమ్ షార్ట్ విన్నపుడు నా కళ్ళు చెమ్మగిల్లాయి.. నిజంగా చాలా గొప్పగా ప్రెజెంట్ చేసాడు రాఘవేంద్ర, ఆర్టిస్ట్ కి సంతృప్తి ఇచ్చే పాత్ర ఇది.. చాలా హ్యాపీగా ఉంది. రాఘవేంద్ర చాలా కూల్ గా ఉంటారు.. అందుకే ఆయనను స్థిత ప్రాజ్ఞుడు అంటాను.. చాలా కూల్ గా పనిచేస్తూ వెళ్తాడు. తప్పకుండా గొప్ప దర్శకుడు అవుతాడు అన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న దర్శకులు హరినాధ్, యోగి కుమార్, యో యో ముకుంద్ తదితరులు టీం అందరిని అభినందించారు.
నటీనటులు :
నజియా షైక్
అరుణ్ బాబు
సతిష్ సారిపల్లి
లక్ష్మి కళ్యాణి.
కెమెరా : దిలీప్ కె కుమార్
మ్యూజిక్ : బాన్ డే వ్రిస్
సౌండ్ & మిక్సింగ్ : రాహుల్ అల్లం
ఎడిటింగ్ : కార్తీక్ నందన్,
పి ఆర్ ఓ : సాయి సతీష్, పర్వతనేని రాంబాబు
నిర్మాత : నజియా షైక్
రచన దర్శకత్వం : రాఘవేంద్ర కటారి.