Bailampudi Movie review rating 3/5
`బైలంపుడి` మూవీ రివ్యూ!!
నటీనటులుః
హరీష్ వినయ్, తనిష్క తివారి, బ్రహ్మానంద రెడ్డి, సుచిత్ర, గణి, గోవింద్, నటరాజ్, నరి, నాగార్జున, సెబాస్టియన్ తదితరులు
సాంకేతిక నిపుణులుః
సంగీతం: సుభాష్ ఆనంద్
డైలాగ్స్: సాయి
ఎడిటర్: జానకిరామ్
ఫైట్స్: కృష్ణం రాజ్
ఆర్ట్: ఉత్తమ్‌కుమార్
డాన్స్: ఘోరా
లిరిక్స్: రామారావు
నిర్మాత: బ్రహ్మానందరెడ్డి
సినిమాటోగ్రాఫర్-స్టోరి-స్క్రీన్‌ప్లే-డైరక్షన్: అనిల్ పిజి రాజ్.
Rating 3/5
`ఇక్కడ యుద్ధం చేయాలి…గెలవడానికి కాదు, బతకాడినికి“ అనే క్యాప్షన్ తో రూపొందిన చిత్రం `బైలంపుడి`. ఇంట్రస్టింగ్ టైటిల్ , ట్రైలర్ , సాంగ్స్ ఇలా ప్రతిది సినిమా పై క్రేజ్ ని ఏర్పరిచాయి. తార క్రియేషన్స్ పై బ్రహ్మానంద రెడ్డి విలన్ పాత్రలో నటిస్తూ నిర్మించిచారు. కెమెరా అసిస్టెంట్ గా పలు చిత్రాలకు పని చేసిన అనిల్ పిజి రాజ్ దర్శకుడుగా పరిచయమయ్యారు. మరి ఈ రోజు విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకోనుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
స్టోరి విషయానికొస్తే…
బైలంపుడి అనే గ్రామంలో గురునారాయణ (బ్రహ్మానంద రెడ్డి) అనే వ్యక్తి గంజాయి లాంటి అక్రమ రవాణాలు చేస్తుంటాడు. పొలిటికల్ గా ఎదగాలన్నది ఆయన లక్ష్యం. బైలంపుడిలో ఆయనంటే అందరికీ హడల్. కానీ ఇంజనీరింగ్ చదివి పుట్టిన ఊరిని, తల్లిని వదిలి వెళ్లడం ఇష్టంలేక అదే ఊరిలో ఆటో నటుడుపుకునే రవి ( హీరో హరీష్ వినయ్) మాత్రం గురునారాయణను ఏ మాత్రం కేర్ చేయడు. ఇది గమనించిన కళ్యాణి ( తనిష్క తివారి) రవిని ఇష్టపడుతుంది. వారి పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది. వీరి ప్రేమ విషయం తెలుసుకున్న కళ్యాణి అన్నైన కుమార్ తను అన్నలా భావించే గురునారాయణకు చెబుతాడు. ఇక రవిని ఓ గంజాయి కేసులో ఇరికిస్తారు. దీంతో రవి మీడియాను ఉపయోగించుకుని అసలు గంజాయి వ్యాపారం చేస్తుంది గురునారాయణ అంటూ పట్టిస్తాడు. దీంతో గురునారాయణ రాజకీయ భవిష్యత్ పోతుంది. ఇక ఎలాగైనా హీరో, హీరో ఫ్రెండ్స్ ని చంపేయాలనుకుంటాడు. ఈ క్రమంలో హీరో ఫ్రెండ్ పిల్లల దేవుడిని చంపేస్తారు. ఈ కోపంతో గురునారాయణను చంపడానికి వెళ్లిన రవి ఓ నిజాన్ని తెలుసుకుంటాడు. ఆ నిజం ఏంటి? అసలు హీరో ఫ్రెండ్ ని చంపించిది ఎవరు? హీరోయిన్ కళ్యాణి , రవిని ప్రేమించడానికి రీజన్ ఏంటి అనేది మిగతా సినిమా.
నటీనటుల హావభావాలుః
హీరోగా హరీష్ వినయ్ కిది తొలి సినిమా అయినా కూడా ఇంజనీరింగ్ స్టూడింట్ గా ఆటో డ్రైవర్ గా ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఫ్రెండ్ చనిపోయినప్పుడు తను పడ్డ బాధ, తపన ఎంతో ఎక్స్ పీరియన్స్ డ్ హీరోలా అనిపించింది. ఇక ఇందులో మెయిన్ విలన్ గా నటించిన బ్రహ్మానంద రెడ్డి సహజమైన నటన ప్రదర్శించాడు. టాలీవుడ్ కు మరో టాలెంటెడ్ విలన్ దొరికాడు అనడంలో సందేహం లేదు. ఆయనకు ఈ సినిమా తర్వాత తెలుగులో మంచి అవకాశాలు కూడా వస్తాయి. ఇక తనిష్క తివారి పాత్ర చాలా నేచరల్ గా ఉంటుంది. ఈ చిత్రం ద్వారా చాలా మంది కొత్త నటీనటులు పరిచయమయ్యారు. అందరూ వారి వారి పాత్రలకు న్యాయం చేశారు.
సాంకితిక నిపుణుల పనితీరుః
ఇక దర్శకుడే సినిమాటోగ్రఫీ కూడా చేయడంతో సినిమాటోగ్రఫీ బాగా కుదిరింది. అలాగే సుభాష్ ఆనంద్ చేసిన పిల్లల దేవుడు అనే పాట కొత్తగా ఉంటూ థియేటర్ లో అందరి చేత విజిల్స్ వేయించింది. నేపథ్య సంగీతం కూడా అక్కడక్కడా పర్వాలేదనిపించింది. ఇక జానకిరామ్ ఎడిటింగ్ కూడా చాలా షార్ప్ గా ఉంది. నిర్మాత కథకు తగ్గట్టుగా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఎంత పెట్టాలో అంత పెట్టారు.
విశ్లేషణః
కేరాఫ్ కంచెరపాలెం సినిమా ఇన్ స్పిరేషన్ తో వచ్చిన సినిమా `బైలంపుడి`. చాలా నేచరల్ గా బైలంపుడి అనే గ్రామంలో జరిగిన ఓ కథను చూస్తున్నట్లుగా సినిమాను చిత్రీకరించారు. క్యారక్టర్స్ అన్నీ కూడా ఓ చిన్న గ్రామంలో ఎలా అయితే ప్రవర్తిస్తాయో అలాగే ప్రవర్తించాయి తప్ప ఎక్కడా అసహజంగా అనిపించవు. హీరో హీరోయిన్స్ డి గ్లామర్ గా కనిపిస్తారు తప్ప ఎక్కడా అనవసరమైన హడావిడి, హంగులు లేవు. ఒక ఊరంటే మంచి, చెడు, ప్రేమ, ద్వేషం , రాజకీయం ఇలా ఎన్నో ఉంటాయి. అలాగే బైలంపుడి సినిమాలో అన్ని ఎమోషన్స్ మెండుగా ఉన్నాయి కానీ వాటిని పండించడంలో దర్శకుడు ఇంకాస్త శ్రద్ధ పెడితే ఇంకా మంచి సినిమా అయ్యేది. ముఖ్యంగా గురునారాయణ్ ని అంతమొందించే సన్నివేశాలు చాలా పేలవంగా ఉన్నాయి. ఇక ఎప్పుడైతే గురునారాయణ్ నీ ఫ్రెండ్ ని నేను కాదు చంపించింది , నీ లవర్ అంటూ రవితో చెప్పాడో అప్పటి నుంచి మళ్లీ అసలు హీరోయిన్ ఎందుకు? ఇలా చేసిందనే క్యూరియాసిటీ కలిగిస్తూ మళ్లీ కథను రసపట్టులోకి తీసుకెళ్లింది. ఇక ఈ ట్విస్ట్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఇక ఆర్ ఎక్స్ 100 లో హీరోయిన్ . హీరోని చంపించడం అనేది హైలెట్ అయింది. ఆ సినిమాలో వర్కవుట్ అయింది. ఆ సినిమాకు ఈ సినిమాకు ఏ మాత్రం సంబంధం లేకున్నా ఈ సినిమాలో కూడా హీరోయిన్ వల్లే హీరో ఫ్రెండ్ ప్రాణాలు పోతాయి, ఈ క్రమంలో హీరో కూడా చనిపోతాడు.
ఇక ఎటువంటి అంచనాలు లేకుండా సినిమాకు వస్తే ఎంటట్ టైన్ అవ్వచ్చు. సహజమైన సన్నివేశాలు, పిల్లల దేవుడి కామెడీ, చక్కటి సంగీతం, సినిమాటోగ్రఫీ మిమ్మల్ని కచ్చితంగా ఎంటర్ టైన్ చేస్తాయి. సో బైలంపుడి కి బైలెల్లండి!!