అజయ్, శ్రద్ధా దాస్, మహేంద్ర, ఆమని నటించిన ‘అర్థం’ ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్ విడుదల చేసిన ప్రముఖ దర్శకులు దేవ్ కట్టా
‘దేవి’, ‘పెదరాయుడు’ చిత్రాలతో బాలనటుడిగా గుర్తింపు తెచ్చుకున్న మహేంద్ర, శ్రద్ధా దాస్… అజయ్, ఆమని, సాహితీ అవంచ ప్రధాన తారలుగా రూపొందుతున్న సైకలాజికల్ థ్రిల్లర్ ‘అర్థం’. రిత్విక్ వెత్సా సమర్పణలో మినర్వా పిక్చర్స్, ఎస్‌విఎమ్ (శ్రీ వాసవి మూవీ) ప్రొడక్షన్స్ పతాకాలపై రాధికా శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో సినిమా తెరకెక్కింది. ఇంతకు ముందు అనేక చిత్రాలకు ఎడిటర్‌గా, వీఎఫ్ఎక్స్ నిపుణుడిగా పని చేసి గుర్తింపు తెచ్చుకున్న మణికాంత్ తెల్లగూటి రచయిత, దర్శకుడు.
ఈ సినిమా ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్ విడుదల చేసిన ప్రముఖ దర్శకుడు దేవ్ కట్టా, చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. సినిమా విజయవంతకం కావాలని ఆకాంక్షించారు. మోషన్ పోస్టర్ లో విజువల్ ఎఫెక్ట్స్ హై స్టాండర్డ్స్ లో ఉన్నాయని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. మోషన్ పోస్టర్ చివరలో గన్ పట్టుకుని కనిపించిన మహేంద్ర సినిమాపై క్యూరియాసిటి పెంచారు. శ్రద్ధా దాస్ కూడా కనిపించారు.
ఈ సందర్భంగా నిర్మాత రాధికా శ్రీనివాస్ మాట్లాడుతూ “ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్ విడుదల చేసిన దేవ్ కట్టా గారికి కృతజ్ఞతలు. ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసే కథాంశంతో రూపొందుతున్న సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రమిది. చిత్రీకరణ పూర్తయింది. త్వరలో విడుదల వివరాలు వెల్లడిస్తాం. మణికాంత్ తెల్లగూటి అద్భుతంగా తెరకెక్కించారు. తెలుగులో ‘ఖైదీ’కి అద్భుతమైన మాటలు, పలు చిత్రాల్లో పాటలు రాసిన రాకేందు మౌళి మా సినిమాకి మాటలు, పాటలు రాశారు. హర్షవర్ధన్ రామేశ్వర్ చక్కటి బాణీలు అందించారు. త్వరలో విడుదల తేదీ వెల్లడిస్తామం” అని అన్నారు.
దర్శకుడు మణికాంత్ తెల్లగూటి మాట్లాడుతూ “కుటుంబ విలువలను కాపాడే, మహిళా సాధికారతను పెంపొందించే సరికొత్త కథాంశంతో రూపొందుతున్న సినిమా – ‘అర్థం’. సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాకి వినోదం మేళవించి ఆసక్తికరంగా తీర్చిదిద్దుతున్నాం. వీఎఫ్ఎక్స్‌లో నాకు అనుభవం ఉండటంతో సినిమా వీఎఫ్ఎక్స్ విషయంలో మరింత శ్రద్ధ వహిస్తున్నాను. అత్యుత్తమ నిర్మాణ విలువలతో రాధికా శ్రీనివాస్ గారు సినిమా నిర్మించారు” అని అన్నారు.
మహేంద్ర, శ్రద్దా దాస్, వైశాలి నందన్, అజయ్, ఆమని, సాహితీ అవంచ, దేవి ప్రసాద్, సాయి దీనా, వాసు విక్రమ్, రౌడీ రోహిణి, ఈటీవీ ప్రభాకర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి పీఆర్వో: నాయుడు సురేంద్ర కుమార్ – ఫణి కందుకూరి, మాటలు-పాటలు: రాకేందు మౌళి, నృత్యాలు: సుచిత్రా చంద్రబోస్, ఛాయాగ్రహణం: పవన్ చెన్నా, సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్ అసోసియేట్ నిర్మాత: పవన్ జానీ, వెంకట రమేష్, నిర్మాత: రాధికా శ్రీనివాస్, కూర్పు-రచన-దర్శకత్వం: మణికాంత్ తెల్లగూటి.
First Look Motion Poster of Mahendra, Shraddha Das, Ajay, Amani-starrer ‘Arrdham’ unveiled by prominent director Deva Katta
‘Arrdham’ is a psychological thriller starring child artist-turned-actor Mahendra of ‘Devi’ and ‘Peda Rayudu’ fame in a lead role. Featuring also Shraddha Das, Ajay, Amani, and Sahithi Avancha in other key roles, the film is presented by Rithvik Vetsha. Produced by Radhika Srinivas of Minerva Piktures and SVM (Sri Vasavi Movie) Productions, the film is going to release in Telugu, Tamil, Malayalam, and Kannada. Manikanth Thallaguti, who has previously worked as an editor and VFX technician, is its writer and director.
Well-known filmmaker Deva Katta has released its First Look Motion Poster and wished the team of ‘Arrdham’ all the best. He also wished that the movie becomes a hit. Netizens are lauding the VFX-rich motion poster for catering to high standards. Mahendra’s gun-wielding pose towards the end of the motion poster raises curiosity. We also see Shraddha Das in the motion poster.
Speaking on the occasion, producer Radhika Srinivas said, “We thank director Deva Katta garu for releasing the motion poster. Our psychological thriller has got a gripping screenplay. The production works have been completed. We are going to announce the release date soon. Director Manikanth Thallaguti has executed amazingly. Rakendu Mouli, who has written ‘Khaidi’ and other movies in the past, has penned both dialogues and songs. Harshavardhan Rameshwar has tuned the songs.”
Director Manikanth Thallaguti said, “Our film has got a novel subject that deals with the importance of protecting family values and propagates the primacy of women in our lives. We have blended entertainment with the psychological thriller genre. Since I have got prior experience in VFX, I have been meticulous. Our film boasts of the highest technical standards.”
Cast:
Mahendra, Shraddha Das, Vaishali Nandan, Ajay, Amani, Sahithi Avancha, Devi Prasad, Sai Dheena, Vasu Vikram, Rowdy Rohini, ETV Prabhakar, and others.