” అర్దశతాబ్దం” చిత్రంలోని ‘ఏ కనులు చూడని చిత్రమే’ సాంగ్ లాంఛ్ చేసిన రకుల్ ప్రీత్ సింగ్ !!

” అర్దశతాబ్దం” చిత్రంలోని ‘ఏ కనులు చూడని చిత్రమే’ సాంగ్ లాంఛ్ చేసిన  రకుల్ ప్రీత్ సింగ్ !!

 

” అర్దశతాబ్దం” చిత్రంలోని ‘ఏ కనులు చూడని చిత్రమే’ సాంగ్ లాంఛ్ చేసిన  రకుల్ ప్రీత్ సింగ్ !! 
 
కార్తిక్ రత్నం, కృష్ణ ప్రియ, నవీన్ చంద్ర, సాయి కుమార్ ప్రధాన పాత్రల్లో  రిషిత శ్రీ క్రియేషన్స్, 24 ఫ్రెమ్స్ సెల్యూలాయిడ్స్ బ్యానర్లపై వీర్ ధర్మిక్ సమర్పణలో రవీంద్ర పుల్లే దర్శకత్వంలో చిట్టి కిరణ్ రామోజు, తేలు రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “అర్ద శతాబ్ధం”. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న ఒక బర్నింగ్ ఇష్యుని మెయిన్ పాయింట్ గా తీసుకొని నేటి ట్రెండ్ కి తగ్గట్లుగా, కమర్షియల్ ఎలిమెంట్స్ మిక్స్ చేసి రవీంద్ర పుల్లే ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ వీక్షకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి.. రీసెంట్ గా బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్ర టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ టీజర్ కు పబ్లిక్ లో వండర్ ఫుల్ రెస్పాన్స్ వస్తోంది.. సినిమా ఫస్ట్ గ్లింప్స్ ని  దగ్గుబాటి రానా రిలీజ్ చేశారు. ఇండస్ట్రీలోని స్టార్స్ అంతా ఈ సినిమాని సపోర్ట్ చేస్తూ.. ఎంకరేజ్ చేస్తుండటంతో అర్దశతాబ్దం చిత్రంపై అంచనాలు భారీగా పెరిగాయి. అందరి అంచనాలకు ధీటుగా రవీంద్ర ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది.. నౌపల్ రాజా సంగీతాన్ని అందించిన ఈ చిత్రంలోని ‘ఏ కనులు చూడని చిత్రమే’ పాటని గ్లామర్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ రిలీజ్ చేశారు.. ప్రస్తుతం తన పాటలతో మ్యూజిక్ శ్రోతలను అలరిస్తున్న ప్రముఖ గాయకుడు సిద్ శ్రీరామ్ ఏకనులు చూడని పాటని ఆలపించారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా సాంగ్ మార్కెట్లోకి రిలీజ్ అయింది..
 
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. ‘ అర్దశతాబ్దం పోస్టర్ గెలిమ్స్, టీజర్ చూశాను.. చాలా బాగున్నాయి. ఏకనులు చూడని చిత్రమే సాంగ్ వింటుంటే మెలోడియస్, రొమాంటిక్ ఫీల్ వస్తుంది. అష్కర్ ఫోటోగ్రఫీ  సూపర్బ్ గా ఉంది. విజువల్స్ అన్నీ ఎక్స్ ట్రార్డినరి గా ఉన్నాయి.. ఈ సినిమా బిగ్ హిట్ అయి యూనిట్ అందరికీ మంచి పేరు రావాలి.. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ అన్నారు. 
 
నిర్మాతలు చిట్టి కిరణ్ రామోజు, తేలు రాధాకృష్ణ మాట్లాడుతూ.. ఇటీవల సుకుమార్ గారు మా సినిమా టీజర్ రిలీజ్ చేశారు. చాలా అద్భుతమైన స్పందన వచ్చింది.. ఈ టీజర్ సోషల్ మీడియాలో హైయెస్ట్ వ్యూస్ తో ట్రెండింగ్ అవుతోంది.  మా దర్శకుడు రవీంద్ర అందరికీ నచ్చేలా ఈ చిత్రాన్ని అత్యద్భుతంగా రూపొందించారు. మాకు సపోర్ట్ చేస్తున్న ప్రతీ ఒక్కరికీ మా ధన్యవాదాలు.. అతి త్వరలో నే ‘అర్దశతాబ్దం’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం.. అన్నారు.
 
 రచన,దర్శకత్వం: రవీంద్ర పుల్లే,
నిర్మాతలు: చిట్టి కిరణ్ రామోజు, తేలు రాధాకృష్ణ, డిఓపి: అష్కర్ (బాయ్ ఫేమ్), ఈ జే వేణు, వెంకట్ ఆర్ శాఖమూరి  సంగీతం: నౌఫల్ రాజా (ఎ.ఐ.ఎస్), ఆర్ట్: సుమిత్ పటేల్, కాస్ట్యూమ్స్: పూజిత తాడికొండ, ఎడిటర్: జె. ప్రతాప్ కుమార్, పాటలు: రెహమాన్, స్టాంట్స్: అంజి, పిఆర్ఓ: సాయి సతీష్. రాంబాబు పర్వతనేని.