ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 13న విడుద‌ల‌వుతోన్న మోస్ట్ అవెయిటెడ్ ప్యాన్ ఇండియా మూవీ `ఆర్ఆర్ఆర్‌`

ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 13న విడుద‌ల‌వుతోన్న మోస్ట్ అవెయిటెడ్ ప్యాన్ ఇండియా మూవీ `ఆర్ఆర్ఆర్‌`

ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 13న విడుద‌ల‌వుతోన్న మోస్ట్ అవెయిటెడ్ ప్యాన్ ఇండియా మూవీ `ఆర్ఆర్ఆర్‌`
 
ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి డైరెక్ష‌న్‌లో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా రూపొందుతోన్న మోస్ట్ అవెయిటెడ్ ప్యాన్ ఇండియా మూవీ `ఆర్ఆర్ఆర్‌(రౌద్రం ర‌ణం రుధిరం)`. డి.పార్వ‌తి స‌మ‌ర్ప‌ణ‌లో డి.వి.వి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై డి.వి.వి.దాన‌య్య  భారీ బ‌డ్జెట్ చిత్రాన్ని అన్‌కాంప్ర‌మైజ్డ్‌గా నిర్మిస్తున్నారు. ఎప్పుడెప్పుడా అని ఎంటైర్ ఇండియ‌న్ మూవీ ఇండ‌స్ట్రీ ఎదురుచూస్తున్న RRR సినిమాను తెలుగు, హిందీ, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లో  ఈ ఏడాది ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 13న విడుద‌ల చేస్తున్నారు. 
 
మ‌న్యంవీరుడు అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, గోండు వీరుడు కొమురం భీమ్ పాత్ర‌లో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్స్ అజ‌య్ దేవ‌గ‌ణ్‌, ఆలియా భ‌ట్‌, కోలీవుడ్ విల‌క్ష‌ణ న‌టుడు స‌ముద్ర‌ఖ‌ని, హాలీవుడ్ స్టార్ అలిస‌న్ డూడీ స‌హా ప్ర‌ముఖ తారాగ‌ణమంతా న‌టిస్తున్నారు. ఫిక్ష‌న‌ల్‌ పీరియాడిక్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో కొమురం భీమ్‌, అల్లూరి సీతారామరాజు స్వాతంత్ర్యం కోసం పోరాటాన్ని ఎలా ప్రారంభించార‌నేదే క‌థాంశం. ఈ సంద‌ర్భంగా ….
 
చిత్ర నిర్మాత డి.వి.వి.దాన‌య్య మాట్లాడుతూ “`ఆర్ఆర్ఆర్` చిత్రీక‌ర‌ణ ముగింపు ద‌శ‌కు చేరుకుంది. మిగిలిన కార్య‌క్ర‌మాల‌ను వీలైనంత త‌ర్వ‌గా పూర్తి చేసి సినిమాను ఈ ఏడాది ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 13న విడుద‌ల చేస్తున్నాం. ఈ ఏడాది ద‌స‌రాను ప్రేక్ష‌కాభిమానులు థియేట‌ర్స్‌లో చాలా గొప్ప‌గా సెలబ్రేట్ చేసుకుంటారు“ అన్నారు.
 
Announcement: Dussehra release for RRR; Worldwide release on October 13, 2021
 
It is official. The much-awaited pan-India film, the multistarrer RRR will have a worldwide release on October 13, 2021 on the festive occasion of Dussehra!
 
Starring NTR, Ram Charan, Ajay Devgn, Alia Bhatt, Samuthirakani and Allison Doody amongst a host of other popular actors from Indian cinema, RRR is a period actioner that portrays the fictional take on the lives of Telugu freedom fighters Komaram Bheem and Alluri Seetharama Raju’s lives before they started their fight for independence.
Speaking about this development, producer DVV Danayya said, “We have come to the end of RRR’s shooting schedule and are very excited to bring this film to the audiences. We are happy to celebrate a massive festival like Dussehra with the audience, in the theatres.”
Produced by DVV Danayya, RRR is directed by India’s most celebrated filmmaker SS Rajamouli and is set to release in Telugu, Hindi, Tamil, Malayalam, Kannada and several other Indian languages.