AMMA NANNA ANADA ASHRAMAM Grand Website & Logo Launched by SV Krishna Reddy

వింత పొకడలతో పెడదారి పడుతున్న నేటి సమాజానికి మంచి మనస్సున్న మనుషుల అవసరం ఎంతైనా ఉందని ప్రముఖ దర్శకులు ,నిర్మాత ఎస్వీ కృష్ణా రెడ్డి అన్నారు…ఆదివారం జూబ్లీహిల్స్ లోని తాజ్ మహాల్ హోటల్ లో గ్రావిటి ఫిల్మ్ సంస్థ రూపొందించిన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ కు చెందిన అమ్మ నాన్న అనాధ ఆశ్రమం లొగొ ,వెబ్ సైట్ ను ఆయన ప్రారంభించారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ మనిషి కన్నా మనస్సు చాలా గొప్పదని, మనిషి ఆలోచనలను అది రాకెట్ కన్న వేగంతో పరిగెత్తిస్తుందని అన్నారు … ఆలాంటి మంచి మనస్సు కలిగిన సామజిక సేవకుడు గట్టు శంకర్ అని ఆయన అభినందించారు..ముఖ్యంగా నిరాశ నిస్పృహ మధ్య ముందుకు సాగుతున్న యువత వాటికి స్వస్తి పలికి సామాజిక చైతన్యం తో అడిగేస్తేనే సమాజానికి న్యాయం చేసినవారయితారని ,అలాంటి వారిజీవితాలే ధన్యమవుతాయని ఎస్వీ కృష్ణారెడ్డి తెలిపారు… ఇక మరొక అతిధిగా హాజరైన ప్రముఖ నిర్మాత అచ్చిరెడ్డి మాట్లాడుతూ అమ్మ నాన్న సేవ సంస్థ ద్వారా మానవతవాదిగా గట్టు శంకర్ చేస్తున్న సేవకు వెల కట్టలేమన్నారు
..నలుగురు సభ్యులు ఉన్న కుటుంబమే దానికి పోషణకు నానా ఇబ్బందులు పడే ఈ రోజుల్లో ఏకంగా నాలుగు వందల మంది ఏ దిక్కు లేని అభాగ్యులకు ఆశ్రయం కల్పించి మరో మధర్ ధెరస్సా లా శంకర్ గొప్ప విషయన్నారు… శంకర్ సేవను వీడియో లో చూసి వేదికపైనే కన్నీటి పర్యంతం అయ్యారు…
అమ్మ నాన్న అనాధ ఆశ్రమం లొగొ ఆవిష్కరణ లో గౌరవ అతిధిగా తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టు లసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరహాత్ అలీ మాట్లాడుతూ సమాజం లో తొటి మనిషిని మనిషిగా గుర్తించనివాడు అసలే మనిషే కాదన్నారు…కానీ గట్టు శంకర్ మాత్రం ముంబాయి లో ఉద్యోగాన్ని వదిలి తన జీవితాన్ని నోరు లేని అభాగ్యుల కోసం అంకితం చేయడం ప్రతి యువతకు స్పూర్తి దాయకం అన్నారు…అమ్మ నాన్న అనాధ ఆశ్రమాన్ని ఆధారించాల్సిన బాధ్యత ప్రతి మానవత వాదులపై ఉంటుందని విరహాత్ అలీ అన్నారు…
అమ్మనాన్న అనాధ ఆశ్రమం నిర్వాహకులు గట్టు శంకర్ మాట్లాడుతూ …తన నిజ జీవితంలో ఎదురైన కష్టం తో ఆశ్రమం నిర్వాహించాలని ..అదే లక్ష్యం తో ఓక్కరితో మొదలై ఇపుడు అనేక మందికి ఆశ్రయం ఇచ్చామని తెలిపారు… తమ ఆశ్రమం లో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలలోని మానసిక వికలాంగులు ఆశ్రమం లో ఉన్నారని .. చెత్త కుప్పలలో రోడ్ల వెంట తిరిగే అనేక మందిని ఆశ్రమం కు చేరదీసి మంచి మనస్సులుగా చేసి పంపామని తమ సంస్థ కు దాతల సహకారం మరవలేనిదని గట్టు శంకర్ అన్నారు….
మానవత్వం పరిమళించిన వేళ …
అమ్మ నాన్న అనాధ ఆశ్రమ వెబ్ సైట్ ,లొగొ ఆవిష్కరణ సభ లో పలువురు మానవతా వాదులు హాజరై తమ ఆశీస్సులు అందించారు.. ప్రముఖ డిజైనర్ శశి వంగపల్లి పది లక్షల ఆర్దిక సాయాన్ని ప్రకటించి అందించారు…శశి వంగపల్లి తో పాటు మరికొంతమంది దాతల సాయ సహాకారాలు అందించారు…
ఈ కార్యక్రమం లో గ్రావిటి ఫిల్మ్స్ పారుపల్లి చరణ్ ,విన్ను సంస్థ ప్రతినిధులు హాజరయ్యారు…