తెలుగు ప్రేక్షకులకు మరింత ఆనందాన్ని పంచడానికి ‘ఆహా’ దూసుకొస్తుంది – ‘ఆహా’ వార్షికోత్సవ వేడుకలో రాము జూపల్లి, అల్లు అరవింద్
తెలుగు ప్రేక్షకులకు మరింత ఎంటర్టైన్మెంట్తో ఆనందాన్ని పంచడానికి ‘ఆహా’ దూసుకొస్తుంది – ‘ఆహా’ వార్షికోత్సవ వేడుకలో రాము జూపల్లి, అల్లు అరవింద్
హండ్రెడ్ పర్సెంట్ తెలుగు ఎంటర్టైన్మెంట్తో తెలుగు ప్రేక్షకులను ఆనందంలో ముంచెత్తుతున్న తెలుగు ఓటీటీ మాధ్యమం ‘ఆహా’. 8.5 మిలియన్ ఇన్స్టాల్స్, 52 మిలియన్ స్ట్రీమింగ్ యూజర్స్, 25.5 మిలియన్ యూనిక్ విజిటర్స్, 1.3 బిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌తో రీజనల్ ఓటీటీగా సెన్సేషన్ క్రియేట్ చేస్తూ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం దక్కించుకున్న ‘ఆహా’ ఏడాది కాలాన్ని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సోమవారం వార్షికోత్సవ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆహా అధినేతలు రాము జూపల్లి, అల్లు అరవింద్ సహా ఆహా సీఈఓ అజిత్ ఠాకూర్, వంశీ పైడిపల్లి సహా ఆహా టీమ్ సభ్యులు పాల్గొన్నారు. కేక్ కట్ చేసి వార్షికోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా…
రాము జూపల్లి మాట్లాడుతూ – ‘‘ఓ ప్రాంతీయ భాషలో ఓటీటీ స్టార్ట్ చేయడం దానికి ఇంత మంచి రెస్పాన్స్ రావడం చాలా గొప్ప విషయం. మా ప్రయాణాన్ని ఇంకా ముందుకు వెళుతుంది. చాలా ఎగ్రెసివ్ ప్లాన్స్‌తో ముందుకు వెళ్లడానికి నిర్ణయించుకున్నాం. తెలుగులోనే కాదు, ఇతర భాషల్లోనూ ఆహాను విస్తరించే ఆలోచనలో ఉన్నాం. త్వరలోనే ఆ వివరాలను తెలియజేస్తాం. అల్లు అరవింద్‌గారు మా వెనుక ఉండి మమ్మల్ని ముందుకు నడిపారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్‌గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వంశీ పైడిపల్లి, సీఈఓ అజిత్ ఠాకూర్లకు థాంక్స్. అలాగే ఆహా ఏడాది పూర్తి చేసుకున్ సందర్భంగా ‘ఆహా హండ్రెడ్ పర్సెంట్ ఎంటర్టైన్మెంట్ అవార్డ్స్’ను ఇవ్వడానికి నిర్ణయించుకున్నాం. త్వరలోనే ఆ వివరాలను తెలియజేస్తాం’’ అన్నారు.
సీఈఓ అజిత్ ఠాకూర్ మాట్లాడుతూ – ‘‘రీజనల్ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌కు 25.5 మిలియన్ సబ్ స్క్రైబర్స్‌తో ప్రేక్షకుల నుంచి ఆదరణ దక్కడం గొప్ప విషయం. ఈ నేపథ్యంలో ‘ఆహా హండ్రెడ్ పర్సెంట్ ఎంటర్టైన్మెంట్ అవార్డ్స్’ ఇవ్వడం గొప్ప విషయం. ఆహాలో విడుదలైన ఒరిజినల్స్, సినిమాలు, పోష్ నుంచి బెస్ట్ వాటికి అవార్డులను ఇస్తాం. ప్రేక్షకుల ఓటింగ్ చేసి వారికి నచ్చిన వాటికి అవార్డ్స్ వచ్చేలా చేసుకోవచ్చు. ఓటింగ్ సిస్టమ్‌ను అందుబాటులోకి తెస్తాం. మార్చిలో ‘ఆహా హండ్రెడ్ పర్సెంట్ ఎంటర్టైన్మెంట్ అవార్డ్స్’ను ప్రకటిస్తాం’’ అన్నారు.
అల్లు అరవింద్ మాట్లాడుతూ – “ఎంటైర్ టీమ్ పగలు, రాత్రి లేకుండా పనిచేయడం వల్లే ఈ స్థాయికి రీచ్ అయ్యాం. అజిత్ ఠాకూర్ పని రాక్షసుడిలా అందరినీ ముందుండి నడుపుతున్నాడు. అజిత్ ఎగ్రెసివ్‌గా అలా చేయకపోతే, ఇది ఇంత దూరం వచ్చేది కాదు. ఇక మా అందరికీ వెనుక ఉండి బలాన్ని అందిస్తున్నది రామేశ్వర్ రావుగారు. ఈ సందర్భంగా ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గత ఏడాది కాలంగా చాలా కష్టాలు పడ్డాం. ఆడియెన్స్‌ను ఎలా ఎంగేజ్ చేయాలని కోవిడ్ సమయంలోనూ ఆలోచించడం వల్లే అందరికీ దగ్గరయ్యాం. రాబోయే ఏడాదిలో మా స్పీడు ఇంకా పెరగనుంది. మంచి చిత్రాలే కాకుండా క్రాక్ వంటి పెద్ద సినిమా కూడా ఆహాలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇకపై ఇలా పెద్ద చిత్రాలు ఆహాలో రాబోతున్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పెద్ద షోస్ రాబోతున్నాయి. పెద్ద హీరోలు, హీరోస్ చేసే షోస్ ఆహాలో రాబోతున్నాయి. ఇప్పుడున్న ఎంటర్టైన్మెంట్కి రెండు, మూడు రెట్లు ఎంటర్టైన్మెంట్ను అందించేలా చర్యలు తీసుకుంటున్నాం. ప్రేక్షకుల అంచనాలను అందుకునేలా మేం ముందుకు వెళతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం” అన్నారు.
వంశీ పైడిపల్లి మాట్లాడుతూ – “ఆహా వన్ ఇయర్ జర్నీలో అక్కడక్కడ తప్పటడుగులు పడినా.. హండ్రెడ్ పర్సెంట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి మేం చేస్తున్న ప్రయత్నాన్ని తెలుగు ప్రేక్షకులు మాకు సపోర్ట్ ఇవ్వడం వల్లే ఇక్కడి దాకా వచ్చాం. ఈ ప్రయాణంలో భాగమైనందుకు ఆనందంగా ఉంది. ఇది ప్రారంభం మాత్రమే, ఇంకా ఎంతో గొప్పగా ఎంటర్టైన్మెంట్ అందించడానికి సిద్ధంగా ఉన్నాం” అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో సుహాస్, నవదీప్, ప్రియదర్శి తదితరులు పాల్గొని ఆహాలో భాగమైనందుకు సంతోషంగా ఉందని తెలియజేస్తూ ఆహా మరింత గొప్పగా ఎంటర్టైన్మెంట్తో ప్రేకక్షకులను మెప్పించనుందని తెలియజేశారు.
Producer Allu Arvind garu pens a hand-written open letter to the Telugu audience on the occasion of aha’s first anniversary!
The much-loved 100% Telugu OTT platform, aha completed one year of it’s journey on 8th February. Ace-producer Allu Arvind garu took this jubilant day to pen down a heartfelt open letter, addressing the Telugu audience and thanking them for their constant love and support.
Please find the letter attached! An English translation to the letter is below:
Dear aha Family,
I profusely thank you all for becoming an important part of the aha family. Today, my heart is filled with immense gratitude as aha turns one.
Its not just an anniversary that we celebrate, but also our joint love and passion for entertainment which brought us together.
We are united by the Telugu language and your endless support helped in bringing us this stupendous success.
Jupally Rameshwar Rao, Jupally Ramu Rao, Dil Raju, all our partners and the team aha that has been tirelessly working towards this success, join me in expressing our heartfelt gratitude to you all.
With love,
Allu Aravind.