ఆచార్య క్రియేషన్స్, అవికా స్క్రీన్ క్రియేషన్స్ సంయుక్త నిర్మాణంలో ఆచార్య క్రియేషన్స్ ప్రొడక్షన్ నెం.3
సరికొత్త కథలను ఎంపిక చేసుకోవడం, కంటెంట్ బేస్డ్ సినిమాలను ప్రేక్షకులకు ముందుకు తీసుకు రావడం ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీలో, ప్రేక్షకుల్లో ఆచార్య క్రియేషన్స్ ప్రత్యేక గౌరవం, మంచి పేరు తెచ్చుకుంది. ‘నెపోలియన్’తో విమర్శకులతో పాటు ప్రేక్షకుల మన్ననలు అందుకుంది. తొలి సినిమాతో తనకు ప్యాషన్ చాటుకున్నారు నిర్మాత భోగేంద్ర గుప్తా మడుపల్లి. ధైర్యంగా కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమా నిర్మించారు. ఇప్పుడు మరో కొత్త చిత్రానికి ఆయన శ్రీకారం చుట్టారు. విశేషం ఏమిటంటే… హీరోయిన్ అవికా గోర్ ఈ సినిమాతో నిర్మాతగా మారుతున్నారు.
‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్‌తో బుల్లితెర వీక్షకులను… ‘ఉయ్యాలా జంపాలా’, ‘లక్ష్మీ రావే మా ఇంటికి’, ‘సినిమా చూపిస్త మావ’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ వంటి విజయవంతమైన సినిమాల్లో కథానాయిక నటించిన అవికా గోర్ తెలుగు ప్రజలను ఆకట్టుకున్నారు. అవికా స్క్రీన్ క్రియేషన్స్ పేరుతో ఆమె ఒక నిర్మాణ సంస్థ ప్రారంభిస్తున్నారు.
ఆచార్య క్రియేషన్స్, అవికా స్క్రీన్ క్రియేషన్స్ సంయుక్త నిర్మాణంలో ఆచార్య క్రియేషన్స్ ప్రొడక్షన్ నెం3 రూపొందుతోంది. ఈ సినిమాలో అవికా గోర్ హీరోయిన్. సాయి రోనక్ హీరో. ఈ చిత్రానికి ఎం.ఎస్. చలపతి రాజు సహ నిర్మాత. ప్రముఖ యాడ్ ఫిల్మ్ మేకర్ మురళీ నాగ శ్రీనివాస్ గంధం దర్శకత్వం వహించనున్నారు.
అడ్వర్టైజింగ్ రంగంలో మురళీ నాగ శ్రీనివాస్ గంధం గారికి 19 ఏళ్ల అనుభవం ఉంది. ఫ్లోయింగ్ ఇంక్ కమ్యూనికేషన్స్ ప్రై.లి. యాడ్ ఏజెన్సీ స్థాపించి పలు ప్రముఖ కంపెనీలకు యాడ్స్ చేశారు. అలాగే, అవికా గోర్ తో పలు యాడ్స్ చేశారు. ఆచార్య క్రియేషన్స్ లో తాను దర్శకత్వం వహిస్తున్న సినిమాలో కథానాయికగా నటించమని ఆమె దగ్గరకు వెళ్లడం, ఆ కథ నచ్చడంతో నిర్మాతగా మారాలని అవికా నిర్ణయించుకోవడం వెంట వెంటనే జరిగాయి.
ఈ సందర్భంగా అవికా గోర్ మాట్లాడుతూ “నా చిన్నతనం నుంచి ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఉన్నాను. ఇక్కడ ప్రతి అంశాన్ని నిశితంగా గమనించా. అందుకని, ప్రొడక్షన్ లోకి రావాలని అనుకుంటున్నాను. ఆచార్య క్రియేషన్స్ కోసం రాసిన కథను మురళీ నాగ శ్రీనివాస్ గంధం నాకు చెప్పారు. దర్శకుడు చెప్పిన కథ నాకు బాగా నచ్చింది. నిర్మాతగా నా తొలి సినిమాకు ఇదే సరైన కథ అనుకున్నాను. దాంతో నేనూ ప్రొడక్షన్ లో పార్ట్ అవుతానని చెప్పా. ఆచార్య క్రియేషన్స్, అవికా స్క్రీన్ క్రియేషన్స్ బంధం ఈ సినిమాతో మరింత బలపడుతుందని ఆశిస్తున్నాను” అని అన్నారు.
దర్శకుడు మురళీ నాగ శ్రీనివాస్ గంధం మాట్లాడుతూ “మెలోడ్రామా జానర్ లో తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఒకరిపై మరొకరికి విపరీతమైన ద్వేషం ఉన్న ఓ అమ్మాయి, ఓ అబ్బాయి… తప్పించుకోవడానికి వీలు లేని పరిస్థితిలో చిక్కుకుంటారు. ఆ తర్వాత ఏమైందనేది కథ” అని అన్నారు.
నిర్మాత భోగేంద్ర గుప్తా మడుపల్లి మాట్లాడుతూ “సరికొత్త కథ, కథనాలతో రూపొందుతున్న చిత్రమిది. అవికా గోర్ నిర్మాణ భాగస్వామ్యంలో సినిమా చేస్తుండటం సంతోషంగా ఉంది. ఈ చిత్రానికి శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందించనున్నారు. త్వరలో ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు వెల్లడిస్తాం” అని అన్నారు.
Acharya Creations, Avika Screen Creations join hands
Acharya Creations has carved a distinct image for itself in the Telugu film industry by picking novel stories and producing content-based movies. Its film, ‘Napolian’, was a critically-acclaimed thriller loved by the audience. Producer Bhogendragupta Madupalli has proved that he is a passionate producer, besides daring to experiment. Such a talented producer has now resolved to come out with yet another promising film. An exciting piece of news is that actress Avika Gor is debuting as a producer with this project.
We have known Avika Gor because of ‘Chinnari Pelli Koothuru’ on the small screen and films like ‘Uyyala Jampala’, ‘Lakshmi Raave Maa Intiki’, ‘Cinema Choopistha Maava’ and ‘Ekkadiki Pothavu Chinnavada’ on the big screen. She is a familiar face to the Telugu audience. The versatile actress has floated a production house named Avika Screen Creations.
Acharya Creations and Avika Screen Creations have joined hands for the former’s Production No. 3. Avika Gor is the female lead of the untitled film, while Sai Ronak is its male lead. MS Chalapathi Raju is its co-producer. Well-known ad filmmaker Murali Naga Srinivas Gandham is wielding the megaphone.
Murali Naga Srinivas Gandham comes with 19 years of experience in the advertising field. Besides being the founder of Flowing Ink Communications Pvt. Ltd., an ad agency, he has been associated with a number of other ad companies, and has directed ads featuring Avika Gor as well. When he approached Avika with the story of Acharya Creations’ movie, she loved the script and offered to be one of its producers.
Speaking about the project, Avika said, “I have been part of the entertainment industry from childhood. Over the years, I have observed every aspect of filmmaking. That’s why I want to try producing a movie. The director has narrated a fine story, and I think it is apt for me to turn a producer with such a film. I hope my association with Acharya Creations will become stronger in the future.”
Director Murali Naga Srinivas Gandham said, “This film is a melodrama. A boy and a girl, who hate each other intensely, are trapped in a situation where they can’t find a way out. What ensues is the crux of the story.”
Producer Bhogendragupta Madupalli said, “This is a new story and screenplay. I am very glad to be associated with Avika Gor as a fellow producer. Shravan Bharadwaj has been roped in to compose music. We will announce details of other cast and crew soon.”