రక్తదానాన్ని ప్రోత్సహించండి, రక్తదానం చేయండి – నందమూరి బాలకృష్ణ!!
రక్తదానాన్ని ప్రోత్సహించండి, రక్తదానం చేయండి – నందమూరి బాలకృష్ణ !!
అక్టోబర్2 గాంధీ జయంతి సందర్భంగా, తలసేమియా భాదితుల కోసం తెలంగాణా తెలుగు యువత, ఎన్టీఆర్ ట్రస్ట్ సహకారంతో నిర్వహిస్తున్న రక్త దాన శిబిరానికి పిలునిచ్చారు హిందుపూర్ శాసన సభ్యులు, అగ్ర కథానాయకుడు, బసవతారకం ఇండో అమెరికన్ కాన్సర్ హాస్పిటల్ చైర్మన్ నందమూరి బాలకృష్ణ.
ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ తలసేమియా వ్యాధి గురించి వివరించారు. అలాగే రక్త దానం పట్ల ప్రచారంలో ఉన్న పలు అపోహలను తొలగించారు. మానవాళి ఎంత అభివృద్ధి చెందినా రక్తాన్ని కృత్రిమంగా తయారు చేయడం సాధ్యం కాదు కాబట్టి, తోటి ప్రాణాలను కాపాడడానికి మనకు ఉన్న ఒకే ఒక్క ఆయుధం రక్త దానం మాత్రమే అని తెలుపుతూ అభిమానులు, కార్యకర్తలు, ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ రక్త దానం, ప్లాస్మా దానం చేసి ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడాలని పిలుపునిచ్చారు.
[01/10, 2:59 pm] siddu: బాలయ్య ఔదార్యం..
భాదిత కుటుంబానికి రూ.1.5 లక్షల ఆర్ధికసాయం, ఫోన్‌లో పరామర్శ..
ఇటీవల అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కోడూరు కాలనీకి చెందిన టీడిపి నాయకుడు నర్సింహప్ప అనే వ్యక్తి మృతి చెందారు. స్థానిక నాయకుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న హిందూపురం శాసనసభ్యుడు, అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ ఆ కుటుంబానికి రూ.1.5లక్షలు ఆర్ధిక సాయం అందించి అండగా నిలిచారు. ఎమ్మెల్యే బాలకృష్ణ ఆదేశాలతో స్థానిక నాయకులు భాదితుని ఇంటికి వెళ్లి ఎమ్మెల్యే అందించిన రూ.1.5లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్ బాండును కుటుంబ సబ్యులకు అందజేశారు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యులను ఫోనులో పరామర్శించిన నందమూరి బాలకృష్ణ వారికి మనోధైర్యాన్ని అందించారు. అలాగే పిల్లలను బాగా చదివించుకోవాలని అందుకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని అభయమిచ్చారు. అదే విధంగా స్థానిక టీడిపి నాయకులు ఆ కుటుంబానికి తమ వంతుగా ఆర్ధికసహాయం అందించారు. తమ కుటుంబానికి అండగా నిలిచినందుకు భాదిత కుటుంబ సభ్యులు నందమూరి బాలకృష్ణగారికి, స్థానిక టీడిపీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.