MBM movie review ratitng 3/5
`ఎమ్ బిఎమ్` మూవీ రివ్యూ!!
ఆర్టిస్ట్స్ః
అఖిల్ కార్తిక్, ప్రియాంక శర్మ, శ్రీధర్ రాజు యర్రం, గిరి బాబు, విజయ్ చందర్, బాబుమోహన్, ఆమని, ఎల్బీ శ్రీరాం, తణికెళ్ల భరణి, చిన్నా, బాలాజి, సమన్ శెట్టి తదితరులు
సాంకేతిక నిపుణులుః
కథః డా.శ్రీధర్ రాజు యర్ర
డైలాగ్స్ః యర్రంశెట్టి సాయి,
పాటలుః పెద్దాడమూర్తి,
ఎడిటర్ః మేనగ శ్రీను,
ఫైట్స్ః విజయ్
ప్రొడ్యూసర్స్ః డా.శ్రీధర్ రాజు యర్ర,
డా.తాళ్ల రవి, డా.టి.పల్లవి రెడ్డి
స్ర్కీన్ ప్లే-దర్శకత్వంః భరత్
రిలీజ్ః 26-4-2019
లవ్, కామెడీ, హర్రర్ ,యాక్షన్ ఎంటరైనర్స్ , బోల్డ్ కంటెంట్ తో సినిమాలు వస్తోన్న ఈ తరుణంలో సోషల్ మెసేష్ ను కమర్షియల్ అంశాలతో చెప్పే చిత్రాలు చాలా అరుదుగా వస్తుంటాయి అని చెప్పాలి. ఇలాంటి క్రమంలో మేరాభారత్ మహాన్ సందేశాత్మక చిత్రంగా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో తెలుసుకుందాం…
స్టోరి విషయానికొస్తే…
కార్పోరేట్ విద్య వల్ల ఒక బిడ్డ బలన్మరణానికి పాల్పడితే…ఆ బిడ్డ ని కాపాడుకుందామని ప్రభుత్వ ఆసుప్రతికి వెళితే…అక్కడ నిర్లక్ష్యం, ఆ నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు కోల్పోయిన బిడ్డ. అసలు దీనకంతటికి కారమైన వారిణి ఏరి పారేయాలనకున్న `మేరాభారత్ మహాన్` అనే సంస్థను ఏర్పాటు చేస్తాడు మహాన్. వీరి సిద్ధాంతాలు, వీరి లక్ష్యాలతో ఆకర్షితులైన కార్తిక్ ( హీరో అఖిల్ కార్తిక్), సంజిత ( హీరోయిన్ ప్రియాంక శర్మ) ఆ మేరా భారత్ మహాన్ లో కీలక వ్యక్తులుగా చేరతారు. అసలు కార్తిక్, సంజిత స్టోరి ఏంటి? సమాజం నుంచి వారు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? చివరకు ఎమ్ బి యమ్ లక్ష్యం నెరవేరిందా లేదా అన్నది చిత్ర కథాంశం.
సినిమాకు బలం
దర్శకత్వం
శ్రీధర్ రాజు నటన
పాటలు
సంగీతం
నిర్మాణ విలువలు
సినిమాటోగ్రఫీ
సంభాషణలు
సినిమాకు బలహీనత
నేపథ్య సంగీతం
ఎడిటింగ్
నటీనటలు పర్ఫార్మెన్స్
విద్యార్థిగా, ప్రేమికుడుగా, సమాజం పట్ల బాధ్యతగల పౌరుడిగా హీరో అఖిల్ కార్తిక్ నటన ప్రశంస నీయం. సమస్యల పట్ల స్పందించే గుణం ఉన్న యువతిగా , తల్లిదండ్రుల కొరకు పోరాడం చేసే ఆధునిక మహిళగా ప్రియాంక శర్మ తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. “కుక్కల వలె, నక్కల వలె “అంటూ శ్రీ శ్రీ మాటలను వెండి తెరపై గుండెను తాకేలా చెబుతూ…అడుగడుగునా అన్యాయాలను , ఆర్థిక విధానాలను కార్పోరేట్ వ్యవస్థలను ప్రశ్నిస్తూ ఒక పవర్ ఫుల్ రోల్ లో అనదైన శైలిలో ఆకట్టుకున్నారు శ్రీధర్ రాజు. బాబు మోహన్ చేసే ఆకట్టుకుంటుంది. తణికెళ్ల భరణి, ఎల్బీ శ్రీరామ్, నారాయణరావు వారి పాత్రలకు న్యాయం చేసారు.
టెక్నీషియన్స్ః
కథ సినిమాకు ప్రధాన బలం, భరత్ దర్శకత్వం, స్క్రీన్ ప్లే బావుంది. నేటి చదువుల గురించి చెబుతూ వచ్చే ఒక పాటతో పాటు సత్యం శివం సుందరం అనే పాటలో మంచి లిరిక్స్ రాసారు పెద్దాడ మూర్తి. పాటలు పర్వాలేదనిపించినా కానీ, వెంటనే వెంటనే పాటలు వస్తూ కథ గమనం వేగాన్ని తగ్గించాయి. యర్రంశెట్టి డైలాగ్స్ చాలా చోట్ల తూటాల్లా పేలాయి. నేపథ్య సంగీతం పై ఇంకా దృ ష్టి సారించాల్సింది. సినిమాటోగ్రఫీ కొన్ని కొన్ని సీన్స్ తప్ప అంతా బావుంది. నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా క్వాలిటీ గా తీసారు.
విశ్లేషణః
ముగ్గరు నిర్మాతలు సామాజిక చైతన్యంతో ఈ సినిమాను నిర్మించారు. ఒక వైపు కార్పోరేట్ వ్యవస్థల దోపిడీని, ఆగడాలను చూపిస్తూనే మరో వైపు ప్రభుత్వ విద్య, వైద్య వ్యవస్థల పై చురకలు వేసారు. ఓట్ల కోసమే పథకాలు తప్ప ప్రజల కోసం కాదంటూ నిలదీసే ప్రయత్నం చేసారు. పథకాలు వాటిని అమలు చేసే విధానలలో లోటు పాట్లను వేలెత్తి చూపారు. ఒకవైపు సమకాలీన అంశాలను చూపిస్తూ మరో వైపు హీరో, హీరోయిన్ ప్రేమకథ ను చూపిస్తూ సినిమాను ఆసక్తికరంగా ముందుకు తీసుకెళ్లారు దర్శకుడు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎదుర్కోంటున్న సమస్య పిల్లలపై కార్పోరేట్ కాలేజీల ఒత్తిడి, వారి బలన్మరణాలు గురించి చర్చిస్తూ…ఆరోగ్య శ్రీ పథకాల వెనుకున్న అసలు మతలబ్ లు, ఫీజు రీ ఇంబర్స్ మెంట్ వల్ల లాభ నష్టాలు ఇలా సమకాలీన అంశాలను వాటిని అమలు జేసే విధానాలు చూపిస్తూ ఎండగట్టే ప్రయత్నం చేసారు. సమస్యలను చూపించడం మాత్రమే కాకుండా వాటికి పరిష్కార మార్గాలను చూపించారు. యువతను మేల్కోలుపుతూ , పబ్లిక్ ను చైతన్య పరుస్తూ వచ్చిన ఈ చిత్రం ప్రతి ఒక్కరూ చూడాల్సిన చిత్రం అనడంలో సందేహం లేదు. సినిమాలు కొన్ని లూప్ హోల్స్, కొంత సాగతీత ఉన్నప్పటికీ తీసుకున్న కథాంశం, ఆ ఎమోషన్ వాటన్నింటినీ కవర్ చేసాయి. లవ్ , కామెడీ, యాక్షన్ ఎంటర్ టైనర్స్ చిత్రాలు ఎప్పూడు వస్తూ నే ఉంటాయో కానీ, సమాజాన్ని చైతన్య పరిచే చిత్రాలు మాత్రం అరుదుగా వస్తుంటాయి. వాటిని ఆదరించాలి.
ఒక్క మాటలోః మెసేజ్ ఓరియెంటెడ్ బెస్ట్ మూవీ (ఎమ్ బియమ్)
Rating 3/5