Dr. Rajasekhar’s daughters donate Rs 2 lakh to Telangana relief fund
తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి రాజశేఖర్ కుమార్తెల విరాళం రూ.2 లక్షలు
Today (April 22) is the birthday of Shivathmika Rajasekhar, the younger daughter of ‘Angry Star’ Rajasekhar and ‘Dorasaani’ debutante. Marking the occasion, she has donated a sum of Rs 1 lakh to the Telangana CM Relief Fund. Her elder sister Shivani donated another Rs 1 lakh. On Wednesday morning, the duo handed over cheques to Kalvakuntla Taraka Rama Rao, Minister of IT. Cinematography Minister Talasani Srinivas Yadav was present on the occasion.
Speaking on the occasion, the Shivathmika-Shivani duo said, “The state and central governments are taking the right measures to contain the spread of COVID-19. We have come forward to do our bit in terms of monetary contribution. We hope that the public will confine themselves to their homes and strictly adhere to instructions given by the government. Stay home. Stay safe.”
యాంగ్రీ స్టార్ రాజశేఖర్ రెండో కుమార్తె, ‘దొరసాని’ సినిమాతో తెలుగు వెండితెరకు కథానాయికగా పరిచయమైన శివాత్మిక రాజశేఖర్ పుట్టినరోజు ఈ రోజు (ఏప్రిల్ 22). ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి లక్ష రూపాయలను ఆమె విరాళంగా ఇచ్చారు. అలాగే, రాజశేఖర్ పెద్ద కుమార్తె శివాని రాజశేఖర్ మరో లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చారు. ఈ రోజు ఉదయం అక్కాచెల్లెళ్లు ఇద్దరూ తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్)తో సమావేశం అయ్యారు. ఆయనకు చెక్స్ అందజేశారు. ఆ సమయంలో సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కూడా ఉన్నారు. శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్ మాట్లాడుతూ “కరోనా నియంత్రణకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చక్కటి చర్యలు తీసుకుంటున్నాయి. మా వంతుగా వీలైనంత సహాయం చేయాలని ముందుకొచ్చాం. ప్రజలందరూ తమ తమ ఇళ్లకు పరిమితమై, ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ జాగ్రత్తలు తీసుకుంటున్నారని ఆశిస్తున్నాము. స్టే హోమ్. స్టే సేఫ్” అని అన్నారు.