Pre-Release function of Rajinikanth’s ‘Darbar’ in Hyderabad on January 3
సూపర్‌స్టార్ రజనీకాంత్, స్టార్ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్‌లో రూపొందుతున్న తొలి సినిమా ‘దర్బార్’. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై భారీ నిర్మాణ వ్యయంతో, అత్యున్నత సాంకేతిక విలువలతో ఎ. సుభాస్కరన్ నిర్మిస్తున్నారు. తెలుగులో ప్రముఖ నిర్మాత ఎన్వీ ప్రసాద్ విడుదల చేస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 9న సినిమా ప్రేక్షకుల ముందుకొస్తోంది. జనవరి 3న హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించనున్నట్టు నిర్మాతలు తెలిపారు. రజనీకాంత్ సహా చిత్రబృందం అంతా ఈ వేడుకకు హాజరు కానున్నారు.
ఆల్రెడీ రిలీజైన ఈ సినిమా ట్రైలర్ రికార్డులు సృష్టోస్తోంది. ముఖ్యంగా పోలీస్ ఆఫీసర్‌గా రజనీకాంత్ స్టైల్, గ్రేస్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది. ఆయనను దర్శకుడు మురుగదాస్ చాలా స్టయిలిష్ గా చూపించారని అభిమానులు సంబరపడుతున్నారు. ట్రైలర్‌లో ‘సార్! వాళ్ళకు చెప్పండి… పోలీసుల దగ్గరకు లెఫ్ట్‌లో రావొచ్చు. రైట్‌లో రావొచ్చు. స్ట్రైయిట్‌గా రావొద్దని’, ‘ఆ చూపేంటి? ఒరిజినల్‌గానే విలన్ అమ్మా! ఇది ఎలా ఉంది?’, ‘అయామ్ ఎ బ్యాడ్ కాప్’ అని రజనీకాంత్ చెప్పిన డైలాగులకు సూపర్ రెస్పాన్స్ లభిస్తోంది. ట్రైలర్‌లో రజనీకాంత్ మేనరిజమ్స్, యాక్టింగ్, స్టైల్, మురుగదాస్ టేకింగ్ సినిమాపై అంచనాలు పెంచేశాయి.
రజనీకాంత్ సరసన కథానాయికగా నయనతార, రజనీకాంత్ కుమార్తెగా నివేదా థామస్, ఇతర కీలక పాత్రల్లో తంబీ రామయ్య, యోగి బాబు, ప్రతీక్ బబ్బర్, నవాబ్ షా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: సురేంద్ర నాయుడు- ఫణి కందుకూరి, బి.ఎ.రాజు, స్టంట్ కొరియోగ్రఫీ: పీటర్ హెయిన్, రామ్-లక్ష్మణ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సుందర్ రాజ్, పాటలు: అనంత శ్రీరామ్, సినిమాటోగ్రఫీ: సంతోష్ శివన్, మ్యూజిక్: అనిరుద్ రవి చంద్రన్, ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్, నిర్మాత: ఎ.సుభాస్కరన్, దర్శకత్వం: ఎ.ఆర్. మురుగదాస్.
With Nayanthara as the hero’s pair, the big-ticket mass entertainer has Nivetha Thomas as Rajinikanth’s daughter. Bollywood actor Suneil Shetty, Yogi Babu, Thambi Ramaiah, Sriman, Pratheik Babbar, Jatin Sarna, Nawab Shah, Dalip Tahil and others are part of the cast.
PRO: Naidu Surendra Kumar-Phani, B.A. Raju. Fights: Peter Hein, Ram-Lakshman. Lyricist: Anantha Sriram. Art Direction: T Santanam. Editor: Srikar Prasad. Executive Producer: Sundar Raj. Cinematography: Santosh Sivan. Music: Anirudh Ravichandran. Production House: Lyca Productions. Written and directed by: AR Murugadoss. Producer: Subaskaran.