`Software Sudheer` pre release event

`Software Sudheer` pre release event

మా సుడిగాలి సుధీర్ హీరోగా న‌టించిన ‘సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌’ తప్పకుండా పెద్ద హిట్ అవ్వాల‌ని కోరుకుంటున్నా – ప్రీ రిలీజ్ఈవెంట్‌లో ముఖ్యఅతిథి స్టార్ యాంక‌ర్ సుమ‌.

‘జబర్దస్త్‌, ఢీ, పోవే పోరా’ వంటి సూపర్‌హిట్‌ టెలివిజన్‌ షోస్‌ ద్వారా ఎంతో పాపులర్‌ అయిన సుడిగాలి సుధీర్‌ హీరోగా, ‘రాజుగారి గది’ ఫేమ్‌ ధన్య బాలకృష్ణ హీరోయిన్‌గా శేఖర ఆర్ట్స్‌ క్రియేషన్స్‌ బేనర్‌పై ప్రొడక్షన్‌ నెం: 1గా ప్రముఖ పారిశ్రామిక వేత్త కె. శేఖర్‌ రాజు నిర్మిస్తున్న చిత్రం ‘సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌’. ఈ సినిమా ద్వారా రాజశేఖర్‌ రెడ్డి పులిచర్ల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇటీవల విడుదలైన టీజర్‌కి, ట్రైలర్ , పాటలకి  మంచి రెస్పాన్స్ వస్తోంది. డిసెంబర్ 28న గ్రాండ్ గా విడుదలవుతున్న సందర్భంగా  ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో నిర్మాత రాజ్ కందుకూరి, స్టార్‌ యాంకర్ సుమ ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. ఫైట్ మాస్టర్స్ రామ్- లక్ష్మణ్, యాంక‌ర్‌ ప్రదీప్, రవి తో పాటు జబర్దస్త్ , ఢీ టీమ్ మెంబర్స్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సుధీర్ అదిరిపోయే స్టెప్పులతో పాటు పాట పాడి ఫ్యాన్స్ ని అలరించారు.
ఫైట్ మాస్టర్స్ రామ్- లక్ష్మణ్ మాట్లాడుతూ – “శేఖర్ రాజు గారు సైకిల్ మీద హైదరాబాద్ కి వచ్చి ప్రముఖ పారిశ్రామిక వేత్తగా ఎదిగి ఇప్పుడు ‘సాఫ్ట్ వేర్ సుధీర్’ సినిమా ద్వారా తాను నిర్మాతగా మారి ఇండస్ట్రీలో ఎంతోమందికి మంచి దారి చూపించాడు. ఈ సినిమా టైటిల్ సాఫ్ట్ గా ఉండొచ్చు కానీ మూవీ చాలా హార్డ్ గా ఉంటుంది. దర్శకుడు రాజశేఖర్ మంచి టాలెంట్ ఉన్న వ్యక్తి. సినిమాలో అన్ని అంశాలు ఉంటూనే రైతుల గురించి మంచి సందేశాన్ని కూడా ఈ సినిమా ద్వారా ఇచ్చారు. సుధీర్ డాన్సులతో పాటు ఫైట్స్ ఇరగదీసాడు. డిసెంబర్ 28 న ప్రతి ఒక్కరూ సినిమా చూడండి” అన్నారు.
ముఖ్య అతిధి నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ – “నాకు సుధీర్ లో సుడిగాలి తెలుసు కానీ ఇప్పుడు సుడిగాలిని ఎదురుగా చూస్తుంటే ఒక ప్రభంజనంలా ఉంది. సుధీర్ బాడీ లాంగ్వేజ్, టైమింగ్ అన్నింటికి మించి తనకున్న ఫాలోయింగ్ ఎక్స్ట్రాడినరీ. ట్రైలర్ లో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. నాకు పిచ్చపిచ్చగా నచ్చింది. డిసెంబర్ 28 సినిమా కోసం మీతో పాటు నేను కూడా ఎదురుచూస్తున్నాను” అన్నారు.
సినిమాటోగ్రాఫర్ రామ్ ప్రసాద్ మాట్లాడుతూ – “నేను ఇప్పటివరకు పెద్ద పెద్ద హీరోల‌ ఈవెంట్ లకి వెళ్ళాను వాటితో ఈక్వల్ గా ఉంది ఈ ఫంక్షన్. డెఫినెట్ గా సుధీర్ మంచి హీరో అవుతారు. ఫారెన్ లో కూడా సుధీర్ కి మంచి ఫాలోయింగ్ ఉంది” అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ మాట్లాడుతూ – “నేను రాజశేఖర్ రెడ్డి ఒకే రూమ్ లో ఉండేవాల్లం. మా ఇద్దరిది అన్నదమ్ముల బంధం. ఇప్పుడు సుధీర్ హీరోగా వస్తోన్న `సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌’ద్వారా దర్శకుడిగా పరిచయం అవడం చాలా  సంతోషంగా ఉంది. ఈ సినిమాకి నాకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు” అన్నారు.
లిరిసిస్ట్ సురేష్ గంగుల మాట్లాడుతూ – “బొంబాయి పోతావా రాజా’ తో భీమ్స్ గారు నాకు మంచి అవకాశం ఇస్తూ వస్తున్నారు. ఈ సినిమాలో ‘కోయం బత్తూరు పీసు, ఇంత అందమే, ఐడెంటిటీ కార్డు` అనే మూడు పాటలు రాశాను. ఈ మూడు పాటలు మంచి పేరు తెస్తాయని నమ్మకం ఉంది” అన్నారు.
ముఖ్య అతిధి యాంకర్ సుమ మాట్లాడుతూ – “ఈ షోకి హోస్ట్ గా వద్దామనుకున్నా కానీ గెస్ట్ గావచ్చాను.
కథా కథనాలు బాగుండి దానికి మంచి కాస్టింగ్ తోడయితే తప్పకుండా సినిమా సక్సెస్ అవుతుంది అనడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఈ సినిమా కూడా తప్పకుండా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా” అన్నారు.
యాంకర్ ప్రదీప్ మాట్లాడుతూ – “యాక్టింగ్ లో కానీ డాన్సులతో కానీ ప్రతి రోజు తనని తాను ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తున్న సుధీర్ ఈ సినిమాతో పెద్ద స్టార్ అవ్వాలని కోరుకుంటున్నా.  `సాఫ్ట్ వేర్ సుధీర్` సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా ‘అన్నారు
చిత్ర నిర్మాత కె శేఖర్‌  రాజు మాట్లాడుతూ – ”మా శేఖర ఆర్ట్స్‌ క్రియేషన్స్‌లో ఫస్ట్‌ మూవీ. సుధీర్‌ని మా బేనర్‌లో హీరోగా పరిచయం చేయడం సంతోషంగా ఉంది. మొదటి సినిమా అయినా పూర్తి సహకారం అందించిన ఆర్టిస్టులు, టెక్నిషియన్స్‌కి ధన్యవాదాలు. డిసెంబర్ 28న సినిమా విడుదలవుతుంది. మూవీ తప్పకుండా పెద్ద హిట్ అవుతుంది” అన్నారు.
చిత్ర దర్శకుడు రాజశేఖర్ రెడ్డి పులిచర్ల మాట్లాడుతూ – “ఈ సినిమాలో కథ కన్నా కొందరి జీవితాలు కనిపిస్తాయి. ఫస్ట్ కాపీ చూశాను. తప్పకుండా సక్సెస్ అవుతుందనే కాన్ఫిడెంట్ వచ్చింది. డా.శివ ప్రసాద్ గారి గురించి  మాట్లాడాలి ఎందుకంటే ఈరోజు ఆయన మనమధ్య లేరు. ఆయనకు ఫోన్ చేసి మంచి రోల్ ఉంది సర్ మీరు తప్పకుండా చేయాలి అంటే ఆరోగ్యం బాగోలేకపోయినా వచ్చి నటించారు. రేపు చనిపోతారన‌గా ఈరోజు నటించడానికి కూడా సిద్ధమయ్యారు. నటన అంటే ఆయనకు అంత ఫ్యాషన్, మా ప్రొడ్యూసర్‌ శేఖర్‌ రాజుగారు కథ నచ్చి నాకు దర్శకుడిగా అవకాశం ఇచ్చారు. నా మొదటి సినిమాకే గొప్ప ప్రొడ్యూసర్‌ దొరికినందుకు హ్యాపీగా ఉంది. భీమ్స్ నాకు 15 సంవత్సరాలుగా తెలుసు. ఈ సినిమాకి మంచి మ్యూజిక్ ఇచ్చారు. మంచి కామెడీ టైమింగ్‌ ఉన్న హీరో కావాలని పెర్ఫామెన్స్‌కి మంచి అవకాశం ఉన్న క్యారెక్టర్‌ కావడంతో సుధీర్‌ని సెలెక్ట్‌ చేయడం జరిగింది. ఆయనలోని అన్ని ఎనర్జీలను ఈ సినిమాలో వాడడం జరిగింది. ధన్య బాలకృష్ణ చాలాబాగా నటించారు. అలాగే మా చిత్రంలో ప్రజా గాయకుడు గద్దర్‌ కథ నచ్చి ఒక పాట పాడి అందులో నటించడం జరిగింది.  అలాగే ఈ సినిమాలో మా ప్రొడ్యూసర్‌ శేఖర్‌ రాజుగారు ఒక రోల్‌ చేయడం జరిగింది. డిసెంబర్ 28న అందరూ సినిమా చూసి  తప్పకుండా సక్సెస్‌ చేయాలని కోరుకుంటున్నా” అన్నారు.
హీరో సుడిగాలి సుధీర్‌ మాట్లాడుతూ – ”నా ఫస్ట్‌ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇక్కడ జరగడానికి ఆ దేవుడి ఆశీస్సులు, మా అమ్మానాన్నల ఆశీర్వాదమే కారణం. మార్చిలో రాజశేఖర్‌గారు నాదగ్గరికి వచ్చి స్టోరీ లైన్‌ చెప్పారు. చాలా బాగుంది సర్‌. టెక్నీషియన్స్‌ ఎవరు? అని అడిగాను. వెంటనే రామ్‌ ప్రసాద్‌గారు కెమెరా, గౌతం రాజు ఎడిటర్‌, రామ్‌ లక్ష్మణ్‌ ఫైట్స్‌, భీమ్స్‌ మ్యూజిక్‌, అని చెప్పారు. మొదటి సినిమాకే ఇంత పెద్ద టెక్నిషియన్స్‌ని ఇచ్చిన మా దర్శక, నిర్మాతలకు థాంక్స్‌. 

 సినిమాకి ఇది కావాలి అంటే ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ముందుకు వచ్చిన మా నిర్మాత శేఖర్ రాజు గారికి స్పెషల్ థాంక్స్. ఆయన కూడా ఈ సినిమాలో  మంచి క్యారెక్ట‌ర్ చేశారు. సినిమా ఔట్‌పుట్‌ చాలా బాగా వచ్చింది. ఇప్పటివరకూ నన్ను ఎలా సపోర్ట్‌ చేశారో, వెండి తెరపై కూడా అలాగే సపోర్ట్‌ చేస్తారని కోరుకుంటున్నాను. కామెడీతో పాటు కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఉన్న మూవీ. అలాగే ఈ సినిమాలో డాన్సులు, ఫైట్స్‌ చేశాం. ఎలా ఉన్నాయో మీరే స్క్రీన్‌ మీద చూసి చెప్పాలి.  మీ మీడియా సపోర్ట్‌ మాకు ఎప్పటిలాగే ఉండాలని కోరుకుంటున్నాను. డిసెంబర్ 28న సినిమా విడుదలవుతుంది. తప్పకుండా అందరూ చూడండి” అన్నారు

సుడిగాలి సుధీర్‌, ధన్య బాలకృష్ణ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రజా గాయకుడు గద్దర్‌ ఓ పాటలో నటిస్తున్నారు. సీనియర్‌ నటి ఇంద్రజ, పోసాని కృష్ణమురళి, నాజర్‌, షాయాజీ షిండే, డా. ఎన్‌. శివప్రసాద్‌, పృథ్వీ, సంజయ్‌ స్వరూప్‌, రవికాలే, విద్యుల్లేఖ, టార్జాన్‌ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఎడిటర్‌: గౌతంరాజు, సినిమాటోగ్రఫీ: సి.రామ్‌ప్రసాద్‌, ఆర్ట్‌: నారాయణరావు, సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో, ఫైట్స్‌: రామ్‌-లక్ష్మణ్‌, నందు, స్టంట్‌ జాషువ, అంజి, డాన్స్‌: అనీష్‌ మాస్టర్‌, పబ్లిసిటీ డిజైనర్‌: ధని ఏలె, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: భిక్షపతి తుమ్మల, పాటలు: గద్దర్‌, సురేష్‌ ఉపాధ్యాయ, నిర్మాత: కె.శేఖర్‌రాజు, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాజశేఖర్‌రెడ్డి పులిచర్ల.

 
I Wish ‘Software Sudheer’ Starring Our Sudigaali Sudheer As The Hero To Become A Big Hit – Chief Guest, Star Anchor Suma In Pre-Release Event
 
Sudigaali Sudheer who is quite popular with TV shows like ‘Jabardasth’, ‘Dhee’, ‘Pove Por’aa’ is starring as a hero in a film titled ‘Software Sudheer’ co-starring ‘Raju gari Gadhi’ fame Dhanya Balakrishna as a heroine. ‘Software Sudheer’ is produced by Popular Industrialist K.Sekhar Raju in Sekhara Art Creations as production no – 1. Rajasekhar Reddy Pulicharla is debuting as director with this film. Recently released Teaser, Trailer and Songs of the film have garnered a very good response. The film is releasing in a grand manner on December 28th. On this occasion, the team has held a grand pre-release event on December 25th at Prasad Labs, Hyderabad. Producer Raj Kandukuri, Fight Masters Ram – Lakshman, Anchor Suma, Pradeep, Ravi along with Jabardasth, Dhee Team attended the event. Sudheer made his fans go frenzy with his dance steps and also crooned a song at the event.

Fight Masters Ram – Lakshman said, ” Sekhar Raju garu came to Hyderabad on a cycle and finds his way to become a popular industrialist with his sheer hard work. Now he has paved the way to many in the film industry by turning as a Producer with ‘Software Sudheer’. Though the title of the film is ‘Soft’, the content of the film is very ‘Hard’. Director Rajasekhar is very talented. The film has all aspects along with a strong message about Farmers. Sudheer is terrific in dances and fights. Everyone should watch this film on December 28th.” 

Producer Raj Kandukuri said, ” I know ‘Sudigaali’ in Sudheer but, now at this event, it’s more like a hurricane. Sudheer has very good body language and timing. More than that he has an extraordinary following. The trailer has all the elements. I just loved it. Along with you all, I am also eagerly waiting for December 28th.”

Cinematographer Ram Prasad said, ” I have attended events of Big Heroes. This is like any Big Hero event. Sudheer will definitely become a very good hero. Sudheer has a very good following in foreign countries too.”

Music Director Bheems said, ” Me and Rajasekhar Reddy used to share a room. We share a bond of brothers. I am very happy that he is debuting as a director with Sudheer as the hero. Thanks to everyone who has helped this film and me.”

Lyricist Suresh Gangula said, ” Bheems garu gave me good opportunities from ‘Bombay Pothava Raja’. I wrote three songs, ‘Coimbatore Piece’, ‘Intha Andame’,’Identity Card’ in this film. I believe this film will bring me a good name for my songs.”

Anchor Suma said, “I wanted to host this show instead I attended as a guest. We have many examples that a film which has a good story and screenplay backed by the good cast will surely score big successes. I wish ‘Software Sudheer’ starring our Sudigaali Sudheer as the hero to become a big hit.”

Anchor Pradeep said, ” Sudheer keeps on improving himself in acting and dances every day. I wish him to become a big star with this film and ‘Software Sudheer’ to become a big hit.”

Film Producer K Sekhar Raju said, ” This is the first film in our Sekhara Arts Creations banner. I am very happy to introduce Sudheer as a Hero in our banner. Though this is my first film, Artists and technicians have lent their complete support for this film. Thanks to them. ‘Software Sudheer’ is releasing on December 28th. The film will surely become a Super Hit.”

Film Director Rajasekhar Reddy Pulicharla said, ” The story of this film reflects the lives of some people. I have seen the first copy. I am confident that this film will score a Hit. We should remember Dr. Siva Prasad garu as he is not with us today. When I called him and asked to do a very good role in this film He agreed and did it despite his illness. He prepared to act in spite of knowing that he will pass away the next day. He has that kind of passion for acting. My Producer Sekhar Raju garu liked the story and gave me this opportunity to Direct this film. I am very happy that I worked with a great producer for my first film itself. I know Bheems for 15 years. He composed very good music for this film.  We opted for Sudheer as we need a Hero with very good comedy timing for a performance-oriented role. He worked very hard with all his energies for this film. Dhanya Balakrishna did a very good job. People’s Singer Gaddar liked the story and crooned a song. He also featured in it. Our Producer Sekhar Raju garu did a role in this film.  I wish everyone should watch this film on December 28th and make this film a big success.”

Hero Sudigaali Sudheer said, ‘ I believe it is due to the blessings of the god and my parents, The pre-release event of my first film is happening here today. Rajasekhar garu narrated the storyline in March. I liked the story and asked him about the technicians. He immediately said that Ram Prasad garu for cinematography, Gowtam Raju garu for editing, Ram – Lakshma for Fights, Bheems for Music. Thanks to my Director and Producer for making me work with such big technicians in my first film itself. Special Thanks to my Producer Sekhar Raju garu who has never compromised for the film. He acted in this film. The output of the film came out very well. You all supported me on the small screen and I hope you will continue your support on the big screen too. This film has all commercial elements along with the comedy.  I did dances and Fights too in this film. I am awaiting your response. I wish the media will extend their support to us.  ‘Software Sudheer’ is releasing on December 28th. Please go watch it in theatres.”

Sudigaali Sudheer, Dhanya Balakrishna will be seen as lead pair while People’s Singer Gaddar will be featured in a song. Principle cast involves senior actress Indraja, Posani Krishna Murali, Nazar, Sayaji Shinde, Dr. N Siva Prasad, Prudhvi, Sanjay Swaroop, Ravi Kaale, Vidyullekha, Tarzan in other important roles. 

Editing: Gowtham Raju, Cinematography: C Ram Prasad, Art: Narayana Rao, Music: Bheems Cecerolio, Fights: Ram – Lakshman, Nandu, Stunt Joshua, Anji, Dance: Aneesh master, Publicity Designer: Dhani Aelay, Production Executive: Bhikshapathi Thummala, Songs: Gaddar, Suresh Upadhyaya, Producer: K Sekhar Raju, Story, Screenplay, Dialogues, Direction: Rajasekhar Reddy Pulicharla