2 hours love movie review ratintg 3.25/5

2 hours love movie review ratintg 3.25/5

 

 

` 2 అవర్స్ లవ్ ` మూవీ రివ్యూ

నటీనటులు : శ్రీ పవార్ , క్రితి గార్గ్‌, త‌నికెళ్ళ‌భ‌ర‌ణి, న‌ర్సింగ్ యాద‌వ్‌, అశోక్ వ‌ర్ధ‌న్ త‌దిత‌రులు
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: శ్రీ పవార్
నిర్మాణం: శ్రీనిక క్రియేటివ్ వ‌ర్క్స్‌,
మ్యూజిక్‌: గ్యాని సింగ్‌,
విడుదల తేదీ : 06-09-2019
రేటింగ్ : 3.25/ 5

శ్రీ పవార్ హీరోగా నటించడమే కాకుండా డైరెక్షన్ చేసిన ఫస్ట్ ఫిలిం `2 అవర్స్ లవ్`. టైటిల్ తోనే ఆకట్టుకున్న ఈ దర్శకుడు టీజర్ తో ఆడియన్స్ లో క్యూరియాసిటీ ఏర్పరిచాడు. దీంతో సినిమా కు పాజిటివ్ బజ్ వచ్చేసింది. ఇక ట్రైలర్ తో యూత్ ని ఆకట్టుకున్న ఈ 2 అవర్స్ లవ్ ఈ ఫ్రైడే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఆడియన్స్ ని ఏ మేరకు ఎంటర్టైన్ చేస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం …

స్టోరీ …
అదిత్ ( శ్రీ పవార్) ఒక సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ . జాలీ గా గడిపే ఈ కుర్రాడికి తొలి చూపులోనే అవిక ( హీరోయిన్ కృతి గార్గ్ ) తెగ నచ్చేస్తుంది. తనతోనే చావైనా, బ్రతుకైనా అనే ఫీలింగ్ కలగడం తో తన ఫీలింగ్స్ అవికా తో షేర్ చేసుకుంటాడు. తొలి చూపులోనే అదిత్ నచ్చడం తో ఆమె తన ప్రేమను ఒక చేస్తుంది కానీ కొన్ని కండీషన్స్ పెడుతుంది. డైలీ ఫోర్ తో సిక్స్ అంటే టూ అవర్స్ మాత్రమే లవ్ చేస్తాను అంటుంది. తనకు ఆ షరతులు ఇష్టం లేకపోయినా అగ్రిమెంట్ మీద సైన్ చేస్తాడు అదిత్. ఇలాంటి క్రమములో అన్నిటికి హాలిడేస్ ఇచ్చేనట్లే మన ప్రేమకు రెండు నెలలు హాలిడే వెకేషన్స్ అంటూ మరో కండీషన్ పెడుతుంది. అసలు అవికా రెండు గంటలే ఎందుకు లవ్ చేస్తుంది. రెండు నెలలు దూరం గా ఉన్న సమయం లో ఏం జరిగింది అన్నది మిగతా స్టోరీ.

ప్లస్ పాయింట్స్ :
లవ్ స్టోరీ
హీరో , హీరోయిన్ పెరఫార్మెన్సెస్
మ్యూజిక్
డైలాగ్స్
సినిమాటోగ్రఫీ
డైరెక్షన్

మైనస్ పాయింట్స్ :
ఎడిటింగ్
సపోర్టింగ్ కేరక్టర్స్

విశ్లేషణ:
ఫస్ట్ డైరెక్షన్ చేయడమే కత్తి మీద సాము . అలాంటిది డైరెక్షన్ తో పాటు హీరోగా నటించడం అంటే రిస్క్ చేయడమే. మరి రిస్క్ చేస్తనే కిక్ అనే మనస్తత్వం ఉన్న శ్రీ పవార్ రెండు బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు అనడం లో సందేహం లేదు. ఫస్ట్ నుంచి లాస్ట్ సీన్ వరకు ప్రతి సీన్ లో కొత్తదనం చూపిస్తూ ..సినిమాను చాలా ఇంట్రెస్టింగ్ గా తీసుకెళ్లాడు. సినిమా అంతా తన భుజాలపై వేసుకుని సినిమాను ముందుకు నడిపించాడు. ఒక కొత్త కుర్రాడి ని తెరపై రెండు గంటలు చూడటం అంటే మామూలు విషయమ కాదు. డైరెక్టర్ గా పాస్ మర్క్స్ కొట్టేసాడు కానీ నటుడిగా ఇంకాస్త మెరుగు అవ్వాలి. నెక్స్ట్ సినిమాకు కచ్చితం గా ఇంప్రూవ్ అవుతాడు. ఇక హీరోయిన్ కూడా తన పాత్రకు హండ్రెడ్ పెర్సెంట్ న్యాయం చేసింది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగానే వర్క్ అవుట్ అయ్యింది. ఎమోషనల్ సీన్స్ కూడా పండించారు.
ఇక రోజుకు రెండు గంటలు లవ్ చేసుకోవడం అనే థాట్ మెచ్చుకోతగింది. ఆమె టూ అవర్స్ లవ్ చేస్తుంటే అతడు మాత్రం 24 అవర్స్ లవ్ చేస్తుంటాడు. సినిమా హీరో డైలాగ్ చెప్పినట్టు …హీరోయిన్ అచ్చం సుకుమార్ సినిమాలో హీరో లా బిహేవ్ చేస్తుంది. ఇక మ్యూజిక్ , సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రధాన ఆకర్షణలు. కొత్త కథతో మంచి స్క్రీన్ ప్లే తో ఎక్కడ బోర్ సీన్స్ లేకుండా చాలా చక్కగా సినిమాని తీయడంలో సక్సస్ అయ్యాడు. అటు మంచి నటనతో తో పాటు మంచి దర్శకుడు కూడా అనిపించుకున్నాడు. ముఖ్యంగా లవ్ సీన్స్ యూత్ ను బాగా ఆకట్టుకునేలా తెరకేకించాడు. కొత్త అమ్మాయి అయిన తనలోని నటన మొత్తాన్ని రాబట్టుకోవడం లో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ప్రేమ కథలకు ముఖ్యంగా కావాల్సింది మంచి పాటలు. అవి బాగా కుదిరాయి . బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సీన్స్ కు తగ్గట్టుగా సీన్స్ ను ఎలివేట్ చేసేలా ఉన్నాయి. ఇక ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ తో వచ్చిన 2 అవర్స్ లవ్ కచ్చితం గా 2 అవర్స్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది . సో డోంట్ మిస్ 2 అవర్స్ లవ్.

ఫైనల్ గా : 2 అవర్స్ ఎంటర్టైన్ చేస్తుంది