చేనేతపై పాట రాసిన ఐఏఎస్ అధికారి
చేనేత దినోత్సవంగా మన చేనేత కార్మికుల ఆనందాలు, బాధలు, వాళ్ల పూర్తి జీవన శైలిని అద్భుతంగా తమ మాటలని అలంకరించి వాళ్ల పూర్తి జీవన శైలిని అద్భుతంగా తమ మాటలని అలంకరించి ఒక అందమైన పాట రూపంలో చేకూరించిన మన ఐ.ఎ.ఎస్ ఆఫీసర్ నరహరిగారికి హర్ధిక ధన్యవాదాలు.
తమ పాటలోని ప్రతి మాటల మన చేనేతల నేతన్నల జీవితంలోని అణువణువున వర్ణిస్తూ విన్న ప్రతి మనస్సుని హద్దుకుని ఆలోచింపచేస్తుంది. మధ్యప్రదేశ్ ఐ.ఎన్.పి.ఆర్ కమీషనర్ పి.నరహరిగారు మన సమాజ శ్రేయస్సు కోసం ఎప్పుడూ ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటారు. స్వచ్ఛ భారత మిషన్‌లో భాగంగాను ఒక అద్భుతమైన పాట ` హో హళల.. ` అని రాసి ఇన్‌డోర్ ప్రజలని మన చుట్టూ ఉన్న పరసరాలను స్వచ్ఛంగా ఉంచుకోడానికి స్ఫూర్తిని నింపి ఉత్తేజపరిచి ఇన్‌డోర్‌కి స్వచ్ఛ భారత మిషన్‌లో ఉత్తమ స్థానం రావడానికి కీలక పాత్ర పోషించారు. ఈసారి నరహరిగారు తమ మాతృభాషైనా తెలుగులో నేతన్నల జీవితాన్ని వర్ణించి వాళ్ల కష్ట సుఖాలను ప్రజలకు అతి దగ్గరిగా తీసుకెళ్లి తమకి మన వంతు సాయంగా సమాజంలో తమ మీద ఉన్న గౌరవాన్ని మరింత పెంచేలా కృషి చేస్తున్నారు.
యువ సంగీత దర్శకుడు రిషి కింగ్ అద్భుతమైన సంగీత సారథ్యంలో యువ గాయకి పాయల్ దేవ్ వినసొంపైనా స్వరాలు నరహరి గొప్ప ఆలోచనకి ప్రాణం పోసింది. చేనేతల దినోత్సవంగా వాళ్ల జీవితాలను మీ ముందుకి ఇలా తీసుకు రావడానికి కారణమైనమ`మేమేగా నేతన్నలం`కి కృతజ్ఞతలు.
పాటలు: పరికిపండ్ల నరహరి, శ్రీకాంత్
మ్యూజిక్: రిషి కింగ్
సింగర్: పాయల్ దేవ్
క్రియేటివ్ డైరెక్టర్: పరికిపండ్ల నరహరి(ఐ.ఎ.ఎస్)
డైరెక్టర్: రిషికేష్ పాండే
ప్రొడక్షన్: బ‌్యోమ్
కెమెరా: మధుసూదన్ కోట
ఎడిటర్: మనోజ్ హుస్సేన్
నిర్మాణ బాధ్యతలు: లుక్ హియర్ ఇండియా, ఆలయ ఫౌండేషన్
మ్యూజిక్ లేబుల్: రీ మ్యూజికల్